తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈటెల విషయంలో తెరాస నెక్స్ట్ స్టెప్ ఏమిటి, దీనికి ఈటెల ఎలా కౌంటర్ ఇస్తారు, రేపు ఇంకేమైనా కొత్త ఆరోపణలు తెర మీదకు వస్తాయా అని అంతా చర్చించుకుంటున్నారు. ఒక పక్క కరోనా విలయతాండవం చేస్తున్నప్పటికీ... రాష్ట్రంలో మాత్రం ఈ విషయం గురించిన చర్చ మాత్రం హాట్ హాట్ గా నడుస్తూనే ఉంది.
undefined
ఇక ఇప్పుడు ఈటెల నెక్స్ట్ స్టెప్ ఏమిటి, ఆయన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఏమిటి అని అంతా చర్చించుకుంటున్నారు. ఆయన రాజీనామా చేయడం మాత్రం పక్కా అని తేల్చి చెప్పారు. అది నేడా, రేపా అనేదే తేలాలి. ఆయన కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అంటూ బహిరంగంగానే ఫైట్ కి దిగారు. కేసీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా ఒక బలమైన శక్తి. అపర మేధావి. ఆయనను ఎదుర్కొనేందుకు ఈటెల ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారంటూ సర్వత్రా చర్చ జరుగుతుంది.
undefined
ఇకపోతే ఈటల రాజేందర్ తీసుకునే నిర్ణయం పై ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆయన ఒక్క చిన్న తప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా ఆయన రాజకీయంగా కనుమరుగవుతారు. కేసీఆర్ ని ఎదిరించి బయటకు వచ్చిన హేమాహేమీలే నేడు అడ్రస్ లేకుండా పోయారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు పన్నడంలో దిట్ట. దానికి తోడు కేసీఆర్ మొండి ఘటం ఏదైనా ఒక్కసారి అనుకున్నాడంటే అది పూర్తి చేసే వరకు ఆగడు.
undefined
అధికారం చేపట్టి ఇది రెండవ పర్యాయం అవడంతో ఆయన రాజకీయంగా చాలా అనుభవజ్ఞుడిగా ఎదిగాడు. అంగ బలం, అర్థ బలం రెండు ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. దానికి తోడు కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తుతానికి అయితే సన్నిహిత సంబంధాలని నెరుపుతున్నారు. మొన్నటి బెంగాల్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ తరువాత కేంద్ర బీజేపీ సైతం కాంగ్రెస్ యేతర పార్టీల విషయంలో తమ అవసరం కోసం సానుకూలంగానే ఉంటుంది. ఉండక తప్పదు కూడా.
undefined
ఇలాంటి పరిస్థితుల్లో ఈటెల రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలుస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం. పార్టీ ఆయనను సస్పెండ్ చేస్తే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. కాబట్టి ఆయన నిర్ణయం ఆలోచించి తీసుకుంటూ ఉండొచ్చు. ఇలా లేట్ చేయడం వల్ల ఆయనకు రెండు లాభాలు. మొదటగా ఆయనకు ఒకింత టైం దొరుకుతుంది. రెండవది ఆయన ఇంకా ఇలానే కొనసాగుతుంటే ప్రజల్లో సానుభూతి పెరిగే ఆస్కారం ఉంటుంది.
undefined
ఇక రాజేందర్ రాజీనామా చేసి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రెండు రకాల పరిణామాలు ఎదురవ్వొచ్చు. రాజేందర్ గెలిస్తే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ని ఢీకొట్టగల స్థాయి నాయకుడిగా పేరు సంపాదిస్తాడు. అదే ఊపులో ఆయన పార్టీ పెడితే అది సక్సెస్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
undefined
ఇలాంటి ప్రమాదం ఉంటుందని తెలిసిన కేసీఆర్ అంత ఈజీగా ఈ అవకాశం ఇవ్వజాలడు. రాజకీయ ప్రత్యర్థులను ఏమాత్రం ఉపేక్షించని కేసీఆర్ ఈటెలను ఎలా వదిలేస్తాడు. కేసీఆర్ తో పడక బయటకు వచ్చిన వారి ఉదంతాలు... కేసీఆర్ వ్యవహార శైలిని మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. పోనీ ఈటలకు మిగిలిన విపక్షాలన్నీ కలిసి మద్దతిస్తాయా అంటే కేసీఆర్ ఇతర పార్టీల్లో ఉన్న తన మిత్రుల ద్వారా అది జరగకుండా ఆపగలడు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాం పై అన్ని పార్టీలు అభ్యర్థులను పెట్టడానికి కేసీఆర్ ప్రధాన కారకుడని విమర్శ బలంగా వినబడుతూనే ఉంది. ఇది రెండవ అంశం. ఇది జరిగితే ఈటెల కనుమరుగవుతారు.
undefined
ఇలాంటి పరిస్థితుల్లో ఈటెల కేసీఆర్ అస్త్రాన్ని కేసీఆర్ మీదే ఎలా ప్రయోగిస్తాడో చూడాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ రాజీనామాలు చేసి గెలుస్తూ తెలంగాణ వాదాన్ని ప్రజల నరనరాన నిమ్పగలిగాడు. ఇప్పుడు ఈటల అదే ఫార్ములాను కేసీఆర్ పై తిరిగి ప్రయోగిస్తాడో లేదో చూడాలి.
undefined