కేసీఆర్ వర్సెస్ ఈటెల రాజేందర్: తమ్ముడు దయ్యమైందిలా..

First Published | May 4, 2021, 6:41 PM IST

అసలు కేసీఆర్ కి, ఈటలకు మధ్య ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనే విషయం ఇప్పటికీ ఇంకా ఎవరికీ అంతుబట్టడం లేదు. 

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆయన మీద ఆరోపణలు మొదలు, నిన్నటి కార్ల ర్యాలీ, ఇందాకటి ప్రెస్ మీట్ వరకు అన్ని కూడా సంచలనమే అవుతున్నాయి. గత కొంతకాలంగా ఈటలకు కేసీఆర్ కి పొసగడం లేదు అనే వ్యాఖ్యలు వస్తున్నప్పటికీ... కరోనా వైరస్, ఆ తరువాత ఎన్నికలు అన్ని వెరసి ఆ విషయాన్నీ తెరాస అధిష్టానం అణిచిపెట్టినట్టుగా సమాచారం.
undefined
కానీ హఠాత్తుగా ఆరోపణలు రావడం, దాన్ని ఒక వర్గం మీడియా మాత్రమే ప్రచారం చేయడం, కేసీఆర్ విచారణకు ఆదేశించడం, మంత్రి పదవి పోవడం అన్ని కూడా రోజుల వ్యవధిలో జరిగిపోయాయి. ఇక ప్రస్తుతం కేసీఆర్ , ఈటల మధ్య నెలకొన్న అగాథం పూడ్చలేనంత పెద్దదిగా మారిపోయింది. తన దారేదో తాను చూసుకోవాలి అనే నిర్ణయానికి ఈటల వచ్చినట్టుగా కనబడుతుంది.
undefined

Latest Videos


ఈటెల తెరాస ను వీడి వేరే పార్టీలో చేరతారా, లేదా కొత్త పార్టీ పెడతారా అనే విషయం గురించిన చర్చను కొద్దిసేపు పక్కన పెడితే... అసలు కేసీఆర్ కి, ఈటలకు మధ్య ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనే విషయం ఇప్పటికీ ఇంకా ఎవరికీ అంతుబట్టడం లేదు.
undefined
మృధుస్వభావిగా అందరితోనూ కలిసిపోయే ఈటల ను ఇలా మంత్రిపదవి నుండి తొలగించడం, ఆయన సైతం అదే స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించడం ఒకింతఆశ్చర్యంగా అనిపించక మానదు. గత 20 సంవత్సరాలుగా కేసీఆర్ తోపాటుగా కలిసి నడిచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెరాస ఫ్లోర్ లీడర్ గా కూడా పనిచేసారు. ఇంతగా కేసీఆర్ నమ్మిన వ్యక్తిని స్వయంగా ఆయనే బయటకు పొమ్మనడం అందరిని విస్మయానికి గురి చేస్తుంది.
undefined
వాస్తవంగా 2019లో గులాబీ జెండాకు ఓనర్లు ఎవరూ ఉండరనే వ్యాఖ్యలు ఆయన చేయడం కలకలం రేపాయి. వాస్తవానికి ఏ పార్టీకయినా కార్యకర్తలే ఓనర్లు. కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా నడిచే కుటుంబ పార్టీలకు అది రుచించదు. పోనీ ఈటల ఏదో క్షణికావేశంలో అన్నాడని అనుకోని సర్దుకుపోదామని కేసీఆర్ అనుకున్నప్పటికీ కూడా ఆ తరువాత రసమయి వంటి వారు ధిక్కార స్వరాన్ని వినిపించడం కేసీఆర్ కి రుచించినట్టుగా లేదు.
undefined
తరువాత వీరి మధ్య చిన్న ప్యాచ్ అప్ జరిగినట్టు వార్తలు వచ్చినప్పటికీ... తెగిన దారం అతకడం కష్టం అదే ఇక్కడ కూడా జరిగింది. ఆ తరువాత ఒక రెండు, మూడు నెలల వ్యవధిలో ఈటెల కుమార్త వివాహం జరిగింది. ఆ వివాహానికి విపరీతంగా జనాలు తరలివచ్చారు. రాష్ట్రంలోని అందరు పెద్దలతోపాటుగా మారోమూల ప్రాంతాల నుండి క్యాడర్ కూడా తరలి వచ్చారు.
undefined
ఆ సందర్భంగా దానిని కొందరు ఈటల బలప్రదర్శనగా ప్రొజెక్ట్ చేసారు. సాధారణంగా రాజకీయ నాయకుడి వివాహానికి వేల సంఖ్యలో జనాలు హాజరవుతుంటారు. కానీ ఈటల కార్యక్రమానికి అంతమంది రావడం, అందునా నాయకులూ, కార్యకర్తలు అన్న తేడా లేకుండా అందరూ ఆప్యాయంగా ఎంతో దూరం నుంచి రావడం చూసిన వారికి, అది బలప్రదర్శన అని చెప్పిన వాటాలు విన్నవారికి ఆవునేమో అనే అనుమానం కలుగక మానదు.
undefined
అందునా, కేవలం రెండు నెలల ముందే పార్టీకి ఓనర్లు ఉండరు అనే వ్యాఖ్య చేయడం, ఆ తరువాత బలప్రదర్శనగా కొందరు ప్రొజెక్ట్ చేసిన పెళ్లి వేడుక. అన్ని వెరసి బహుశా ఇద్దరి మధ్యా దూరాన్ని మరింతగా పెంచి ఉండొచ్చు. పార్టీ ఓనర్ల వ్యాఖ్యలకు ముందే ఆర్టీసీ సమ్మె విషయంలో కూడా ఈటల అంతర్గతంగా కార్మికులకు మద్దతు ఇచ్చారు అని పుకార్లు షికార్లు చేసాయి. అన్ని వెరసి ఇప్పుడు ఈటల కేసీఆర్ తో బహిరంగంగానే ఓపెన్ ఫైట్ కి దిగారు.
undefined
click me!