దేశానికి కంటైన్మెంట్ అన్న పదం నేర్పింది తామే అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం పై కరోనా వైరస్ కట్టడి విషయంలో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోజు రోజుకి తెలంగాణలో కేసులు అధికంగా నమోదవుతుండడంతో.... మరోమారు గ్రేటర్ పరిధిలో లాక్ డౌన్ కూడా విధించాలని యోచనలో ఉంది సర్కార్.
undefined
ఇక తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న కరోనా వైరస్ కట్టడి చర్యలపై అసంతృప్తితో ఉన్న కేంద్రం ఏకంగా తమ బృందాన్ని హైదరాబాద్ కి పంపించింది. వారు సైతం తెలంగాణ తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసారు.
undefined
తెలంగాణలో ఇంతకుముందు టెస్టింగ్ తక్కువగా జరుపుతున్నారు అన్నప్పుడు టెస్టింగులు ఎక్కువ చేస్తే ఎక్కువ కేసులు వస్తాయి అనేది వట్టిమాట అని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నవిషయం తెలిసిందే. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
undefined
తెలంగాణాలో రోజుకి 3000 నుంచి నాలుగు వేల మధ్య టెస్టులను నిర్వహిస్తున్నారు. 50 వేల టెస్టులని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటినుండి ఈ టెస్టులను చేస్తున్నారు. సరాసరిన 25 శాతం నుంచి 30 శాతం టెస్టు ఫలితాలు పాజిటివ్ గా వస్తున్నాయి. అంటే టెస్ట్ చేసిన ప్రతి నలుగురిలో, లేదా ముగ్గురిలో ఒక్కరికి కరోనా వైరస్ ఉందన్న మాట.
undefined
కేంద్రం అక్షింతల నేపథ్యంలోనే టెస్టింగులు అధికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతకుమునుపు వరకు తెలంగాణాలో రోజుకి 500కు మించి టెస్టులు నిర్వహించిందే లేదు(ఆరంభంలో తప్ప)ఇలా టెస్టింగులను ఎక్కువగా చేస్తుండడంతో.... కేసులు అధికంగా బయటపడుతున్నాయి.
undefined
కేసులు బయటపడుతుండడంతో తెలంగాణాలో కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉందోజనాలకు అర్థమవుతుంది. నాలుగువేల పరీక్షలు చేస్తేనే 1000 కేసులునమోదవుతుండడంతో..... ఒకవేళ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ మాదిరి గనుక 20 నుంచి 25 వేల పరీక్షలను జరిపితే.... ఇక్కడ పరిస్థితి ఊహించుకోవడానికే భయంకరంగా ఉందని మీడియా కోడై కూస్తుంది.
undefined
ఇక తెలంగాణాలో పరీక్షలు ఒకెత్తయితే... తెలంగాణాలో ట్రీట్మెంట్ మరో ఎత్తు. తొలుత అందరికి ఎవ్వరికి కరోనా సోకినా కూడా గాంధీలోనేట్రీట్మెంట్ అన్నారు కేసీఆర్. కానీ తెలంగాణాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కరోనా సోకగానే వారంతా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిపోయారు.
undefined
ప్రజలకు సేవలందించడంలో భేష్ అయిన గాంధీ ఆసుపత్రి వీఐపీలకు మాత్రం పనికి రాకుండా పోయింది అంటూ సోషల్ మీడియాలో ప్రభుత్వం పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇలా ఎమ్మెల్యేలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరుతుండడంతో... అప్పటివరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో గుట్టుగా సాగిన కరోనా చికిత్సకు ప్రభుత్వం అధికారికంగా పచ్చ జండా ఊపింది.
undefined
ఇక తెలంగాణాలో తొలిసారి కరోనా చికిత్స విషయంలో లోపాలున్నాయి అన్న విషయాన్నీ బయటపెట్టింది జూనియర్ డాక్టర్ల సమ్మె. వారు గాంధీలో పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా వివరించడం వల్ల ప్రజలు కూడా గాంధీలో ఏదో జరుగుతుంది అనే భయాందోళనలకు లోనయ్యారు. మీడియా డిబేట్లలో కూడా అందరూ గాంధీని గుడ్డిగానమ్మకండి, ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోండి అని చెబుతుండడం ప్రజలు కరోనా వైరస్విషయంలో తమను తాము రక్షించుకోవడంపై దృష్టి పెట్టారు.
undefined
ఇక తాజాగా ఛెస్ట్ ఆసుపత్రిలో తమకు చికిత్స సరిగా అందించడం లేదు అని సెల్ఫీ వీడియోలు తీసి మరణించిన ఇద్దరు యువకుల దీన గాథ, తెలంగాణాలో కరోనా చికిత్సపై ఎన్నో అనుమానాలకు తెరతీసింది.ఒక వ్యక్తేమో డాడీ నాకు ఊపిరాడ్తలేదు అని మరణిస్తే... ఇంకొకరేమో ఆసుపత్రిలో పట్టించుకునే నాథుడే కరువయ్యాడు అని వాపోయి ప్రాణాలను వదిలాడు.
undefined
ఈ మరణాలు దురదృష్టకరం, మరోమారు ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాము అంటూ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన ఆరోగ్య మంత్రి ఈటెల ఏవో రెండు మరణాలకు తమను బదనాం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించడం పై తీవ్ర దుమారం చెలరేగింది. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా అంటూ ప్రభుత్వం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
undefined
హైదరాబాద్ బహుశా మహానగరం అయి ఉండడం కేసులు అధికంగా నమోదవుతూ ఉండవచ్చు. కానీ బెంగళూరును తీసుకుంటే.. అక్కడ కేసులు చాల తక్కువ. వారి కాంటాక్ట్ ట్రేసింగ్ పద్ధతి అత్యంత ఖచ్చితత్వంతో కూడి ఉంది.వారు టెస్టులను అధికంగా నిర్వహిస్తూ ఎక్కడికక్కడ వైరస్ సోకిన వారిని ఐసోలేట్చేసారు, చేస్తున్నారు.
undefined
పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ కట్టడి ఆశాజనకంగా ఉంది. అక్కడ జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని లాక్ డౌన్ ఎత్తేయమని అన్ని రాష్ట్రాలకంటే ముందే ఎత్తేయమని కోరినప్పటికీ.... వారు మాత్రం చాలాజాగ్రత్తగా ఉన్నారు. అవసరమున్నప్పుడల్లా, అవసరమున్న ప్రాంతాన్ని లాక్ డౌన్ లో ఉంచుతూ, అధికంగా టెస్టులను నిర్వహిస్తూ కరోనా ను అదుపులోనే ఉంచగలిగారు.
undefined
అందరికన్నా ముందు లాక్ డౌన్ ను విధించిన తెలంగాణ ప్రభుత్వం మాత్రం కరోనా వైరస్ కట్టడిలో ఏపీకన్నా వెనుక పడిపోయింది. అక్కడ రోజుకి దాదాపుగా 20 నుంచి 25 వేల పరీక్షలు చేస్తున్నప్పటికీ... కేసుల సంఖ్య మాత్రం తెలంగాణ కన్నా తక్కువగానే నమోదవుతున్నాయి. ఏపీలో వేరే రాష్ట్రం నుంచి వారి వివరాలు సేకరించడంతోపాటుగా కరోనా పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ విధంగా అక్కడ కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంది. ఇంకో అంశం ఏమిటంటే... అక్కడ మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉంది.
undefined
కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో మరోమారు లాక్ డౌన్ యోచన చేస్తుంది సర్కార్. మరోమారు లాక్ డౌన్ విధించడం అంటే... ఉన్న సమయాన్ని ప్రభుత్వం వినియోగించడంలో విఫలమైందనే మాట ఎక్కడ వస్తుందో అని సర్కార్ మల్లగుల్లాలు పడుతుంది.
undefined
ఈ అన్ని పరిస్థితులను చూస్తుంటే... కరోనా వైరస్ పంజా విసరడం ఆరంభించినప్పుడు తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కానీ ఎప్పటినుంచయితే టెస్టులు తక్కువగా చేస్తున్నారు అనే ఆరోపణ వచ్చిందో నప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వం పై అందరూ వేలెత్తి చూపెడుతున్నారు. కేంద్ర బృందం పర్యటన, వస్తున్న విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సెల్ఫ్ డిఫెన్సె లో పడిందా అనే అనుమానం మాత్రం కలుగక మానదు.
undefined