జగన్ కు చెక్: ఓ వైపు పవన్ కల్యాణ్, మరో వైపు చంద్రబాబు

First Published Jun 29, 2020, 8:32 AM IST

అన్ని పరిణామాలకు తోడుగా తాజాగా చంద్రబాబునాయుడుకి కేంద్రం క్లీన్ చిట్ ఇవ్వడం. జనసేన నేత పుల్లారావు రాసిన లేఖకు కేంద్రం సమాధానమిస్తూ పోలవరం విషయంలో ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక్కడొక ఆసక్తికర అంశం ఏమిటంటే.... ఎన్నికలప్పుడు స్వయంగా ప్రధాని మోడీయే టీడీపీకి పోలవరం ఒక ఎటిఎం లాగా మారిందంటూ దానిపై ఆరోపణలు చేసారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కరోనా వైరస్ కన్నా హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన అన్ని పార్టీలు గత కొన్ని రోజులుగా యాక్టీవ్ గా మారడంతో.... రసకందాయంలో పడ్డాయి రాష్ట్ర రాజకీయాలు. సొంత పార్టీ మీదే దాడి చేస్తున్న రఘురామకృష్ణం రాజు వ్యవహారం మరో స్పెషల్ ఎఫెక్ట్.
undefined
సాధారణంగా వైసీపీ నిర్ణయాలను వ్యతిరేకించే టీడీపీ... అధికార వైసీపీ పై దాడిని చేయడం సహజం. అచ్చెన్నాయుడు అరెస్ట్, ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచాయి. ప్రజలంతా కూడా ఏమి జరుగుతుంది అంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
undefined
ఈ అరెస్టుల తరువాత రాష్ట్రమంతా టీడీపీ ఆందోళనలు చేస్తుండగానే మరోసారి రఘురామకృష్ణం రాజు వ్యవహారం తెరమీదకు వచ్చింది. ఎప్పటినుండో తన సొంత పార్టీ నేతల మీద ఆరోపణలు చేస్తున్న ఈయన... ఒక్కసారిగా స్పీడ్ పెంచారు. అది షో కాజ్ నోటీసు, దాని మీద కూడా రఘురామకృష్ణంరాజు కౌంటర్ ఇవ్వడం అన్ని వెరసి ఇది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.
undefined
ఈ పరిస్థితుల్లో బీజేపీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఎంటర్ అయింది. బీజేపీ నేతలు ఎప్పటినుండో జగన్ మీద దాడి చేస్తున్నారు కదా అని అనిపించొచ్చు. కానీ అందుకు భిన్నంగా కేంద్ర నాయకత్వం ఇప్పుడు రంగంలోకి దిగింది. మొన్న రామ్ మాధవ్ జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు, తాజాగా ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ వంతు.
undefined
నిన్నమొన్నటి వరకు పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్..ఇప్పుడు వరుస సినిమాలతో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపద్యంలో ఓ వార్త బయిటకు వచ్చి అభిమానులను ఆనందపరుస్తోంది.
undefined
ఇక ఈ అన్ని పరిణామాలకు తోడుగా తాజాగా చంద్రబాబునాయుడుకి కేంద్రం క్లీన్ చిట్ ఇవ్వడం. జనసేన నేత పుల్లారావు రాసిన లేఖకు కేంద్రం సమాధానమిస్తూ పోలవరం విషయంలో ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక్కడొక ఆసక్తికర అంశం ఏమిటంటే.... ఎన్నికలప్పుడు స్వయంగా ప్రధాని మోడీయే టీడీపీకి పోలవరం ఒక ఎటిఎం లాగా మారిందంటూ దానిపై ఆరోపణలు చేసారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కే క్లీన్ చిట్ ఇవ్వడం విశేషం.
undefined
ఈ అన్ని పరిస్థితులు వేర్వేరు సంఘటనలుగా కనబడ్డప్పటికీ.... వీటిని దగ్గరగా గనుక పరిశీలిస్తే.... అన్నింటికి దగ్గర సంబంధం మనకు కనబడుతుంది. ఒకేసమయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ శక్తులు యాక్టీవ్ అవడం, అందరూ కూడా ఒకే అజెండాతో ముందుకు పోతుండడం చూస్తుంటే... రానున్న కాలంలో నెలకొనబోయేరాజకీయపరమైన పరిస్థితులకు ఇవి దర్పణం పడుతున్నాయి.
undefined
రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా అన్ని శక్తులు ఒక్కటవుతున్నాయా అనే అనుమానం ఇక్కడ కలుగుతుంది. రఘురామకృష్ణంరాజు ఒకవైపు వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. తనను పార్టీ నుండి బహిష్కరించేవరకు ఆయన ఆ రకమైన వ్యాఖ్యలను చేస్తూనే ఉంటాడు.
undefined
ఇక పవన్ కళ్యాణ్ తన అజెండాగా ప్రస్తుతానికి కాపుల ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఎత్తుకున్నాడు. దీన్నిపరిశీలించి చూస్తే....కాపులకు పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా ఎదుగుదామని అనుకుంటున్నాడు. జగన్ అఖండ విజయానికి కారణం ఉభయగోదావరి జిల్లాల్లో వచ్చిన మెజారిటీ.కాపులను ఇప్పుడు తనవైపుగా తిప్పుకోవాలని పవన్ కళ్యాణ్ ఒక తీవ్రమైన ఆలోచన వేస్తున్నాడనేది ఇక్కడ తేటతెల్లం. తనను కాపు నాయకులు గొంతుక అవ్వమంటున్నారని, వైసీపీలో కాపు నేతలు కాపుల సంక్షేమాన్ని గాలికొదికలేశారనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న ప్రధాన అజెండాలు.
undefined
బీజేపీ, జనసేనలు కలిసికట్టుగా వైసీపీని ఎదుర్కోవడంతోపాటుగా టీడీపీ ని కూడా తమ పక్షాన ఉంచుకోవాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి అనేది ఇక్కడ వారి వ్యూహం కావచ్చు. బీజేపీ తన సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలని చూస్తుంది.
undefined
ఇప్పటికే జనసేన తోడుగా ఉంది. జనసేనతోపాటుగా టీడీపీతో కూడా గనుక జతకట్టగలిగి ఒక బలమైన ప్రతిపక్షంగా, అందునా వైసీపీఇబ్బంది పెట్టలేని ప్రతిపక్షంగా గనుక ఉద్భవిస్తే.... వైసీపీలో చేరే ప్రతిపక్ష నాయకుల సంఖ్య తగ్గిపోవడంతోపాటుగా అధికారపక్షం నుంచి ఉన్న అసమ్మతులను కూడా చేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇలా లాభాపడాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు.
undefined
click me!