జగన్ మీద ముప్పేట దాడి: చంద్రబాబుతో సహా విపక్ష నేతలు ఏకం

First Published | Jul 1, 2020, 10:08 AM IST

ఏపీలోని పరిస్థితులన్నీ చూస్తుంటే... వెనుక ఉన్నదీ బీజేపీ అనేది తేటతెల్లం. మొన్నటివరకు టీడీపీ, వైసీపీలను సమానదూరం పెట్టిన బీజేపీ ఇప్పుడు ఒక్కసారిగా జగన్ కు ఎందుకు వ్యతిరేకంగా మారిందనేది ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రధాన ప్రశ్న. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతానికి మంచి రంజుమీద ఉన్నాయి. రాజకీయ అరెస్టులు, అధికారపక్షం దూకుడు, కేంద్ర బీజేపీ రాష్ట్రంలో పావులు కడుపుతుండడం, పవన్ కళ్యాణ్ కాపు రాజకీయ అజెండాను ఎత్తుకోవడం, రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్. అన్ని వెరసి రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి.
undefined
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ కి కొన్ని ఇబ్బందికర పరిస్థితులను (రాజకీయంగా దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయం చెప్పలేకున్నప్పటికీ.... ఆయన ఇమేజ్ కి మాత్రం డామేజ్చేసేలా వైసీపీ పైదాడి చేస్తున్నారు రఘురామ) సృష్టిస్తున్నారు నరసాపురం ఎంపీ. ఆయన ఈ స్థాయిలో వైసీపీ పై దాడి చేయడం, తన ఇమేజ్ ని పెంచుకోవడంతోపాటుగా... జగన్ ఎవ్వరిని కలవడు అనే ఇమేజ్ కి ఒక రూపం ఇవ్వడానికి.
undefined

Latest Videos


అయితే జగన్ కి రాసిన లేఖలో ఆయన తనకు అపాయింట్మెంట్ ఇవ్వమని కోరారు కదా అని అనవచ్చు. ప్రస్తుతానికి రఘురామ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన రచ్చఅంతా ఇంతా కాదు. ఆయన వైసీపీలో అందరి మీద తీవ్రంగా ఫైర్ అయ్యారు.ఆయనతోని ఆరంభంలోనే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాప్ పెరిగిపోయింది. ఇలా గ్యాప్ పెరిగిపోవడంతో ఇప్పుడు మాట్లాడడం కుదరని పని. ఎప్పుడు పార్టీ బహిష్కరణ వేటు వేస్తే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోదామా అని ఎదురు చూస్తున్నారు రఘురామకృష్ణం రాజు.
undefined
ఆయన తాజాగా తనను యాంటీ క్రిస్టియన్ గా చూస్తున్నారు అని లేఖలో పేర్కొనడం, ఆయన తన ప్రో హిందుత్వాన్ని చెప్పకనే చెప్పడం. ఆయన ఇప్పుడు ఒక పూర్తి స్థాయి బీజేపీ కార్యకర్త కాబోతున్నారు అనడంలో ఎటువంటి సంశయం లేదు. ఈ అన్ని పరిణామాల వల్ల రఘురామకృష్ణం రాజు ఒక గోదావరి జిల్లాల నాయకుడి దగ్గరి నుండి ఇప్పుడు రాష్ట్ర నాయకుడిగా ఎదిగాడు.
undefined
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన కాపు రాజకీయ అజెండాను ఎత్తుకున్నాడు. కాపుల ఆత్మగౌరవ నినాదంతో ఆయన తదుపరి రాజకీయ కార్యాచరణ ఉండబోతుంది అనేది తథ్యం. ఆయన కాపులను తన వైపుగా ఆకర్షించుకోవాలని చూస్తున్నాడు.
undefined
కాపులను గనుక పవన్ తన వైపుగా తిప్పుకోగలిగి, తన వెంట నడిపించగలిగితే.... జగన్ కి అది ఖచ్చితంగా ఒక పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. ఎవరు అవునన్నా కాదన్న గోదావరి జిల్లాల్లో వీరి ప్రభావం అధికం. జగన్ అఖండ మెజారిటీకి వారి ఓట్లు కీలకంగా పనిచేసాయి.
undefined
ఇక చంద్రబాబు నాయుడు కితాజాగా పోలవరం విషయంలో క్లీన్ చిట్ ఇవ్వడం. చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇవ్వడం బీజేపీ, టీడీపీ మధ్య నూతన స్నేహం చిగురిస్తుందా అనే అనుమానం కలిగించకమానదు. స్వయంగా ప్రధాని మోడీయే పోలవరం టీడీపీకి ఎటిఎం గా మారింది అని అన్నారు. సరే అటువంటి పోలవరం పై ఇప్పడు చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇచ్చారు.
undefined
ఏపీలోని పరిస్థితులన్నీ చూస్తుంటే... వెనుక ఉన్నదీ బీజేపీ అనేది తేటతెల్లం. మొన్నటివరకు టీడీపీ, వైసీపీలను సమానదూరం పెట్టిన బీజేపీ ఇప్పుడు ఒక్కసారిగా జగన్ కు ఎందుకు వ్యతిరేకంగా మారిందనేది ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రధాన ప్రశ్న.
undefined
టీడీపీ, బీజేపీలు రెండు కూడా కాంగ్రెస్ మిత్రపక్షాలు కాదు. ఇప్పటికే అవసరమైనప్పుడల్లా బీజేపీకి పోటీ పడిమద్దతు ఇస్తున్నాయి. వచ్చే ఎన్నికలప్పుడు అవసరమైతే.. ఇరు పార్టీలతో ఎవరితోనయినా పొత్తు పెట్టుకోవడానికి బీజేపీకి ఆస్కారముంటుంది. పొత్తుపెట్టుకోకున్నప్పటికీ... మద్దతైనా స్వీకరించే అవకాశం ఉంది.
undefined
కానీ అనూహ్యంగా ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో తన పంజా విసురుతోంది. దానికి కారణం లేకపోలేదు. బీజేపీ వాస్తవానికి ఎవరైనా ప్రతిపక్షంలోని వారు వైసీపీ వారి బ్యాటింగ్ ని తట్టుకోలేక బీజేపీలో చేరతారని అనుకున్నారు. కానీ వారంతా ఇప్పుడు ఏకంగా వైసీపీలోనేచేరిపోతున్నారు. కారణం బీజేపీ ఇంకా ఏపీలో బలంగా లేకపోవడం.
undefined
బీజేపీ బలంగా లేకపోవడంతో ఎవరు కూడా బీజేపీలో చేరి తమ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకోదల్చుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకు తగ్గ పరిణామాలే ఇప్పుడు ఏపీలో కనబడుతున్నాయి. ఇప్పటికిప్పుడు బీజేపీ సంస్థాగతంగా బలపడడానికి ఆస్కారం లేదు.కాబట్టి బీజేపీ ఇప్పుడు తన మిత్రుల బలం ద్వారా రాజకీయంగా అక్కడ పటిష్టమవ్వాలనే యోచనలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. బీజేపీ స్ట్రాటజీ కూడా ఇదే. బీజేపీ ఏ రాష్ట్రంలో అయినా తనకు అక్కడ పట్టులేనప్పుడు అధికార పక్షం పక్కన చేరి ప్రతిపక్షంలో అసమ్మతులను ఆకర్షిస్తుంది. ఏపీలో కూడా అలానే జరుగుతుందని ఆశించింది.
undefined
కానీ ఏపీలో తొలుత టీడీపీ నేతలు సైతం బీజేపీలో చేరారు, కానీ బీజేపీలో రాజకీయ కెరీర్ ఉండదు అని భావించివైసీపీలో చేరుతున్నారు ప్రతిపక్ష నేతలు. ప్రస్తుత సిద్ధ రాఘవరావు వంటి వారు బీజేపీ గనుక బలంగా ఉండిఉంటేబీజేపీలోనే చేరే వారు. వారి ఆర్ధిక ప్రయోజనాలతోపాటుగా రాజకీయ ప్రయోజనాలు కూడా బాగుండేవి.
undefined
దీన్ని గమనించిన బీజేపీ ఇప్పుడు టీడీపీ, జనసేనలతో కలిసి నడవాలని అనుకుంటున్నాయి. జగన్ ను యాంటీహిందూ గా ప్రాజెక్ట్ చేసి సంస్థాగతంగా టీడీపీ క్యాడర్, పవన్ కళ్యాణ్ ద్వారా కాపుల ఓట్లు, తన సోషల్ ఇంజనీరింగ్ ద్వారా జగన్ పైహిందుత్వ అస్త్రాన్ని ప్రయోగించిలాభపడొచ్చు అని బీజేపీ అనుకుంటుంది.
undefined
undefined
click me!