ఏపీలో కరోనా వ్యాప్తి:  జగనే కరెక్ట్.... డీలా పడ్డ చంద్రబాబు!

First Published Jun 12, 2020, 4:21 PM IST

ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కన్నా కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో ఏపీలోని ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై తీవ్రస్థాయి విమర్శలను గుప్పించాయి. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లు పెట్టి మరి జగన్ మోహన్ రెడ్డి పై అనేక వ్యాఖ్యలు చేసారు. 

కరోనా వైరస్ తొలినాళ్లలో బ్లీచింగ్ పొడి, పారాసెటమాల్ వ్యాఖ్యలు చేసినందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విపరీతంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పారాసెటమాల్ వ్యాఖ్యలు చేసినప్పటికీ.... కేసీఆర్ ముందుండి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని, జగన్ మోహన్ రెడ్డి కి మాత్రం అది చేతకావడంలేదని అందరూ అన్నారు.
undefined
ఆయన ఆ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం పట్టుబట్టడం తప్పే. కానీ.... కేంద్రం లాక్ డౌన్ విధించగానే ఆయన ఆ విషయాన్నిపక్కకుబెట్టి లాక్ డౌన్ ను కఠినంగా అమలుచేసేందుకు కృషి చేసారు.
undefined
ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కన్నా కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో ఏపీలోని ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై తీవ్రస్థాయి విమర్శలను గుప్పించాయి. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లు పెట్టి మరి జగన్ మోహన్ రెడ్డి పై అనేక వ్యాఖ్యలు చేసారు
undefined
Hundreds of volunteers offered their support by helping with the packing and loading of relief material. Many of them walked long distances braving the summer heat and some of them even left their homes to stay in the hostel just to be a part of this mammoth relief effort.
undefined
ఊరిలోకి కొత్తవారు ఎవరు వచ్చారు అనే విషయం ప్రభుత్వానికి నివేదించడం దగ్గరి నుండి వారి వారి హోమ్ క్వారంటైన్ లను పరిశీలించడంవరకు అన్ని విషయాల్లోనూ వారి పాత్ర కీలకంగా మారింది. సాంపిల్స్ కలెక్షన్ నుండి వచ్చిన ఆ ఫలితాలనుగ్రామంలోని ప్రజలకు చేరవేయడం వరకు అన్ని విషయాల్లోనూ కారు కీలకంగా మారారు.ఆంధ్రప్రదేశ్ లో కరోనా హ్యాండ్లింగ్ సరిగా లేదు అని ప్రతిపక్షం వాదించింది. కానీ ప్రస్థుత పరిస్థితుల్లో దేశంలోనే కరోనా పరీక్షల్లో ముందువరసలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
undefined
లాక్ డౌన్ స్టార్ట్ అయిన కొత్తలో ఆంధ్రప్రదేశ్ లో కట్టడి సరిగా చేయలేకపోతున్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు గనుక చూసుకుంటే.. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. లాక్ డౌన్ కాలంలో కూడా కేవలం కొద్దిసేపు మాత్రమే తెరిచి ఉండడం, ప్రజలకు అవసరమైన అన్ని కూరగాయల నుండి నిత్యావసరాల వస్తువుల వరకు ఇండ్లకే పంపించడం అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం ముందుంది.క్వారంటైన్ కి తరలించే విషయంలో ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించింది. ఊరిలోకి ఎవరొచ్చినా వారందరిని హోమ్ క్వారంటైన్ కో ప్రభుత్వ క్వారంటైన్ కో తరలించారు.
undefined
అందరికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లాక్ డౌన్ ను ఎత్తేయాలని కోరారు. దానిపై విపక్షాలు తీవ్రంగా ఫైర్ అయ్యాయి కూడా. అయినప్పటికీ... జగన్ మాత్రం తన పంథాలో సాగిపోయారు.లాక్ డౌన్ ఎత్తివేసి ఇంతకాలం అయినప్పటికీ... ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి ఎవ్వరిని ఇష్టం వచ్చినట్టుగా రానివ్వడం లేదు. అందరిపై ఒక కన్నేసించేందుకు పాసులను జారీ చేస్తుంది. అలా రాష్ట్రంలోకి వచ్చేవారిపై ఒక కన్నేసి ఉంచి వారికి పరీక్షలను చేస్తుంది.
undefined
ఆంధ్రప్రదేశ్ లో వైద్య సిబ్బంది సరిగా లేరు అని కూడా విపక్షాలు తొలుత వాదించాయి. కరోనా వైరస్ స్థాయి మహమ్మారిని ఎదుర్కునే వైద్య సిబ్బంది ఏ రాష్ట్రంలో కూడా రెడీ గా ఉండరు.అది వాస్తవం కూడా. నిర్మాణాత్మకంగా ఆ విమర్శను తీసుకున్న జగన్ రాష్ట్రంలో కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు వైద్య సిబ్బంది నియామకాలను చేపట్టింది. ఏప్రిల్ నాటికే ఈ నియామకాల ప్రక్రియను ప్రారంభించింది.
undefined
లాక్ డౌన్ లో ఏ ప్రభుత్వమయినా చేయాల్సిన ముఖ్యమైన పని....వైద్య సదుపాయాలను మెరుగుపరిచి కరోనా విజృంభిస్తే కూడా దాన్ని తట్టుకునేలా తయారుచేయడం. ఆ పనిలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కి మంచిమార్కులే పడ్డాయని చెప్పవచ్చు.
undefined
ఇక మరో అంశం వికేంద్రీకరించి కరోనా చికిత్సను అందించడం. దేశంలో కేరళతో సహా అన్ని రాష్ట్రాల్లోనూ వికేంద్రీకరించి కరోనా చికిత్సను అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా అదే పద్దతిని పాటించింది. దీనివల్ల మనకు రెండు లాభాలు మొదటగా ఎక్కడివారికక్కడే చికిత్స అందించడంతోపాటుగా ఏ ఒక్క ఆసుపత్రి మీదనో అతి ఎక్కువ భారంవేయాల్సిన అవసరం రాదు. దానితోపాటుగా వైద్య సిబ్బందిమీద కూడా భారం, ఒత్తిడి తగ్గుతాయి.
undefined
తెలంగాణలో ఈ కారణాల వల్లనే కదా... గాంధీ ఆసుపత్రి వైద్యులు రోడ్డెక్కింది. ఈ అన్ని విషయాల్లో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ముందుచూపుతో వ్యవహరించిందని చెప్పక తప్పదు. కరోనా వైరస్ హ్యాండ్లింగ్ విషయంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు ప్రతిపక్షాలు ఎత్తిచూపెట్టిన లోపాలను కరెక్ట్ చేసుకుంటూ, అనవసర ఆరోపణలు ఏవైనా ఉంటే, వాటిని తోసిరాజేస్తూ ముందుకెళ్తుంది.
undefined
click me!