అమరుడైన సంతోష్: బీహార్ రెజిమెంటుకు ఇది కొత్తకాదు, చరిత్ర ఇదీ...

First Published Jun 18, 2020, 3:36 PM IST

కల్నల్ సంతోష్ బాబు, మరో 20 మంది సైనికులు విధులు నిర్వహిస్తున్న బీహార్ రెజిమెంట్ కు వీరత్వం కొత్తకాదు. భారత స్వతంత్రం ముందే ఏర్పాటైన ఈ బెటాలియన్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బర్మా కాంపెయిన్, స్వతంత్రం తరువాత 1947లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్ ఆక్రమణకు ప్రయత్నించినప్పుడు నుండి మొదలు మొన్నటి కార్గిల్, నిన్నటి చైనాతో ఘర్షణ వరకు భారతదేశ రక్షణకు సంబంధించిన ఏ అంశం అయినా వెన్ను చూపకుండా పోరాడిన యోధులు ఈ బెటాలియన్ సైనికులు. 

భారత చైనా సరిహద్దులో ప్రాణాలు వదిలిన కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. చైనా సైనికుల దాష్టీకానికి, వారి దురాగతానికి సంతోష్ కుమార్ సహా అదే రెజిమెంట్ కి చెందిన 13 మంది సైనికులు మరణించారు. నిరాయుధులుగా ఉన్న కేవలం 35 మంది భారత సైనికులపైకి కర్రలు రాడ్లతో 250 మంది చైనా సైనికులు దాడిచేసినావెన్ను చూపకుండా దాదాపుగా 35 మంది చైనా సైనికులను కూడామట్టుబెట్టారు. ఒక్క బులెట్ వాడకుండా చేతులతోజరిగిన ముష్టి యుద్ధంలో వారిని మట్టికరిపించారు.
undefined
కల్నల్ సంతోష్ బాబు, మరో 20 మంది సైనికులు విధులు నిర్వహిస్తున్న బీహార్ రెజిమెంట్ కు వీరత్వం కొత్తకాదు. భారత స్వతంత్రం ముందే ఏర్పాటైన ఈ బెటాలియన్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బర్మా కాంపెయిన్, స్వతంత్రం తరువాత 1947లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్ ఆక్రమణకు ప్రయత్నించినప్పుడు నుండి మొదలు మొన్నటి కార్గిల్, నిన్నటి చైనాతో ఘర్షణ వరకు భారతదేశ రక్షణకు సంబంధించిన ఏ అంశం అయినా వెన్ను చూపకుండా పోరాడిన యోధులు ఈ బెటాలియన్ సైనికులు.
undefined
జై భజరంగబలి అని వీరు యుద్ధ భూమిలోకి దూకారంటే... శత్రువులను మట్టికరిపించడం తథ్యం. వీర్ బిహారి ల నుండి పుట్టిన ఈ రెజిమెంట్ లో క్రమంగా అన్ని ప్రాంతాలవారు కూడా సమ్మిళితులయ్యారు. భారతదేశంలోనే కాకుండా వీరంతా ఐక్యరాజ్యసమితి శాంతి దళాలలో సోమాలియా, కాంగోలలో కూడా పనిచేసారు. సంతోష్ బాబు సైతం కాంగోలో పనిచేసారు.
undefined
1971 పాకిస్తాన్ యుద్ధంలో ఈ బీహార్ రెజిమెంట్ కి చెందిన ధైర్యసాహసాల వల్ల పాకిస్తాన్ కి అందవలిసినవిదేశీ సహాయం అందే లోపలే... తూర్పు పాకిస్థాన్( ప్రస్తుత బాంగ్లాదేశ్) ను భరత్ తన ఆధీనంలోకితెచ్చుకొని బాంగ్లాదేశ్కి విముక్తిని కల్పించింది. పాకిస్తాన్ సైనికులు బర్మాలోకి పారిపోకుండా అడ్డుకోవడం నుండి మొదలు, చిట్టగాంగ్ పరిధిలోని ఆఖురా ప్రాంతాన్నిమొత్తం ఆదేనంలోకి తీసుకురావడం వరకు అన్నింటిలోనూ బీహార్ రెజిమెంట్ సైనికులు వెన్ను చూపకుండా పోరాడారు.
undefined
1999 కార్గిల్ యుద్ధంలో దాధాపుగా 10,000 మంది బీహార్ రెజిమెంట్ సైనికులు, ఆఫీసర్లు పాల్గొన్నారు. 1999 వసంతంలో మంచు కరుగుతున్న సమయంలో భారతదేశంలోకి ముష్కరులు ప్రవేశించారు. వారిని భారతదేశమ్ నుండి వెనక్కి పంపించి కార్గిల్ యుద్ధంలో విజయం సాధించడంలో బీహార్ రెజిమెంట్ కీలక పాత్ర పోషించింది.
undefined
బటాలిక్ సెక్టార్ ని ఆక్రమించుకున్న ముష్కరులను హతమార్చి, వారు అధిక ఎత్తులో ఉండికాల్పులు జరుపుతున్నప్పటికీ... వెన్ను చూపకుండా వారితో యుద్ధం చేసి పాయింట్ 4268, జుబేర్ రిడ్జ్, తాంగ్ ప్రాంతాలలో పాకిస్తానీ సైనికులతో తీవ్ర పోరాటం అనంతరం వారిని మట్టుబెట్టి అక్కడ మరోసారి భారతజెండా ఎగురవేశారు. భజరంగబలి ఆర్మీ అని ముద్దుగా పిలిచే ఈ రెజిమెంట్ కి కిల్లర్ మెషీన్స్ అనే మరో ముద్దుపేరు కూడా ఉంది. ఆ పేరుకు తగ్గట్టుగానే శత్రుదేశాల సైనికులను మట్టుబెట్టడంలో వీరు సిద్ధహస్తులు. చైనా సైనికులతో జరిగిన మొన్నటి ఘర్షణలతో ఆయుధం పట్టకుండా ఎంతమందిని మట్టికరిపించారో చూస్తేనే మనకు అర్థమవుతుంది.
undefined
ఈ బెటాలియన్ నుండి అనేక మంది వీరులు దేశం కోసం కోసం వీరమరణం పొందారు. మొన్నొక్కరోజే ఈ బెటాలియన్ కి చెందిన 13 మంది మరణించారంటేనే మనం ఏ స్థాయిలో వీరు విరుచుకుపడతారో మనం అర్థం చేసుకోవచ్చు. కల్నల్ సంతోష్ బాబు మృతి నేపథ్యంలో ఈ బెటాలియన్ కి చెందిన ఇతర యుద్ధాల్లో మరణించిన హీరోల గురించి కూడా తెలుసుకుందాం.
undefined
లెఫ్టనెంట్ హర్ష ఉదయ్ సింగ్ గౌర్1994లో బారాముల్లాలో ముష్కరులు దాక్కొన్నారన్న సమాచారం తెలుసుకున్న గౌర్ తన బృందంతో కలిసి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దాజిపుర గ్రామాన్ని పూర్తిగా చుట్టుముట్టిన బీహార్ రెజిమెంట్ ఆర్మీ వారిపై విరుచుకుపడింది. శత్రువుల గుల్ల వర్షానికి ఎదురిల్లుతూ ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాడు గౌర్. అలా మట్టుబెడుతున్న సమయంలో ఆయనకు కూడా బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా రక్తమోడుతున్నప్పటికీ తన పోరాటాన్ని కొనసాగించి వీరమరణం పొందాడు.
undefined
లెఫ్టనెంట్ కల్నల్ శాంతి స్వరూప్ రాణాజమ్మూలోని కుప్వారా జిల్లాలో ముష్కరులు బుంకెర్లలో తలదాచుకున్నారన్న సమాచారంతో... ఆ బంకర్లను నాశనం చేయాల్సిందిగా శాంతి స్వరూప్ టీం కి ఆదేశాలు అందాయి. తన టీం తో అక్కడకు చేరుకున్న రాణా మూడు బుంకెర్లను గమనించాడు. మెరుపు వేగంతో తన బృందంతో వాటిని నాశనం చేసాడు.ఈ పోరు జరుగుతున్న సందర్భంలోనే ఆయనకు నాలుగవ బంకర్ కూడా కనబడడంతో ఆయన దానిపై కూడా దాడి చేసాడు. బాంబులు విసిరి దాన్ని నాశనం చేయగా అందులోంచి ఇద్దరు ముష్కరులు ఫైరింగ్ చేయసాగారు. ఆయన ఒంటారిగా వారిని మట్టుబెట్టాడు. ఇలా వారిపై కాల్పులు జరుపుతుండగానే వేరేవైపునుండి ముష్కరులు ఆయనపై కాల్పులు జరపడంతో ఆయన గాయపడ్డాడు. అయినప్పటికీ... కాదనా రంగంలో ముందుకు దూకుతూ బృందాన్ని ముందుకు నడిపాడు. తన బృందం పై వెనుక నుండి మరో ముష్కరుడు కాల్పులు జరుపుతున్నాడు అనిగమనించి ముష్కరుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించి హతమార్చాడు. తీవ్రగాయాలపాలైన రానా మరణించాడు.
undefined
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్బీహార్ రెజిమెంట్ కి చెందిన ఈ యువ ఆఫీసర్ కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. ఆ తరువాత ఎన్ఎస్ జి కమాండోగా సెలెక్ట్ అయ్యాడు. ముంబైలో 2611 అటాక్స్ లో 10 మంది కమాండోల యూనిట్లో ఒకడిగా వెళ్లి ముష్కరులను తుదముట్టించసాగాడు. వెనుక నుండి సడన్ గా బులెట్ తాకడంతో అతడు గాయపడ్డాడు. తాను మూడవ ఫ్లోర్ లోని ముష్కరులను హ్యాండిల్ చేస్తానని చెప్పి, మిగిలిన వారందరిని వేరే చిక్కుబడ్డ ప్రజలను కాపాడమని చెప్పాడట. అలా బులెట్ గాయాలతో ఆయన నేలకొరిగాడు.
undefined
మేజర్ శరవణన్కార్గిల్యుద్ధంలో బటాలిక్ సెక్టార్ లో ఎత్తులో ఉన్న ప్రాంతాన్ని చేజిక్కించుకోవడానికి మరియప్పన్ శరవణన్ బృందం బయల్దేరింది. ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో... వెలుతురు తక్కువుగా ఉంటుంది కాబట్టి శత్రువులకు కనపదం అన్న ఉద్దేశంతో వారు శత్రువుల మీదకు దుమికారు. ఎత్తునుండి శత్రువుల బుల్లెట్ల వర్షానికి ఎదురొడ్డి రాకెట్ లాఉంచేర్ ద్వారా ఒక శత్రువు పోస్టును ధ్వంసం చేసాడు.ఒక బాబు విస్ఫోటనంలో గాయపడిన శరవణన్ ను వెనక్కి వెళ్లవలిసిందిగా కమాండింగ్ ఆఫీసర్ ఆదేశించాడు. అతడు తిరిగి వెళుతుండగా ఉదయం6 .30 ప్రాంతంలో శత్రువు బులెట్ తలపై తగలడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. వీరు కేవలం మనకు తెలిసిన కొందరు అధికారులు మాత్రమే. ఎందరో ఆఫీసర్ స్థాయికి తక్కువ ఉన్న అధికారులు సైతం వీరమరణం పొందారు.
undefined
click me!