చంద్రబాబుకు ప్రాణసంకటం: గతానికి బిజెపి తిలోదకాలు, వ్యూహం ఇదీ...

First Published | Aug 25, 2020, 12:07 PM IST

రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే... బీజేపీని చంద్రబాబు హస్తాల్లోంచి విముక్తి చేయాలని వారు సంకల్పించారు. ఆ రోజు నుండి చిన్నగా తమ ప్రయత్నాలను మొదలుపెట్టి 2017 నాటికి దాన్ని అమలు చేయడం ఆరంభించారు. అప్పటికే వరుసగా రాష్ట్రాల్లో అప్రతిహత విజయాలను నమోదు చేసుకుంటూ దూసుకుపోతున్న బీజేపీ.... ఏపీపై పూర్తి ఫోకస్ పెట్టింది. 

2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత టీడీపీ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. జగన్ అఖండ విజయంతో..... ఒక్కసారిగా పార్టీలో స్థబ్ధత ఏర్పడింది. ఆ తరువాత చిన్నగా వలసలు మొదలయ్యే సరికి పార్టీ పరిస్థితి మరింతగా ఇబ్బందికరంగా మారింది. ఒక పక్క జగన్ బ్యాటింగ్, మరోవైపు దూసుకొస్తున్న బీజేపీ అన్ని వెరసి చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాడు.
undefined
టీడీపీ కి సంక్షోభాలు కొత్త కాదు. అప్పటి ఆగస్టు సంక్షోభాన్ని తట్టుకొని నిలిచి గెలిచిన పార్టీ. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు పదేండ్లు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ తరువాత తెలంగాణ ఉద్యమ సమయంలో తీవ్రంగా నలిగిపోయిన పార్టీ టీడీపీనే. ఆ సంక్షోభం తరువాత కూడా చంద్రబాబు నాయుడు తిరిగి 2014లో ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయ్యాడు.
undefined

Latest Videos


కానీ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. చంద్రబాబు నాయుడి వయసు ఇక్కడ ప్రతిబంధకంగా మారింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఆయన ప్రస్తుతానికి రోడ్లెక్కి మరీ పోరాటాలు చేస్తున్నారు. పార్టీకి సంస్థాగత నిర్మాణం కూడా ఉంది. కానీ భావి నాయకత్వం అనేది ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న.
undefined
ఈ విషయాన్నీ పక్కన పెడితే.... ఇంతకుమునుపు ఆయనకు బీజేపీ నుండి పెద్ద వ్యతిరేకత ఎదురు అయ్యేది కాదు. ఇప్పుడు బీజేపీ ఏకంగా టీడీపీని ఖాళీ చేయించేయాలని దృష్టి పెట్టింది. రాష్ట్రంలో నోటా కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ ఇలా ఎలా అనే అనుమానం రావచ్చు. కానీ బీజేపీ దూరమవడం ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ప్రాణసంకటంగా మారింది.
undefined
అటల్ బిహారి వాజపేయి హయాంలో చంద్రబాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. ఆయన ఆ సమయంలో జాతీయ రాజకీయాలను శాసించారనవచ్చు. అద్వానీ నుండి మొదలు మిగిలిన బీజేపీ నాయకులంతా కూడా చంద్రబాబుకి ఇచ్చే ప్రాముఖ్యతఅంతా ఇంతా కాదు. ఆయన అప్పుడు జాతీయ మీడియాలో కూడా తెగ దర్శనమిచ్చేవారు.
undefined
చంద్రబాబు ఆ రోజుల్లో చక్రం ఏ స్థాయిలో తిప్పేవారంటే.... రాష్ట్ర బీజేపీ వ్యవహారాలు కూడా ఆయన కనుసన్నల్లోనే నడిచేవి. ఇక్కడి నాయకులుఢిల్లీ వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదులు చేసినప్పటికీ.... వారు కూడా ఢిల్లీ పీఠం మీదనే దృష్టి కేంద్రీకరించి చంద్రబాబుకే మద్దతు తెలిపేవారు.
undefined
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దీనితో రాష్ట్రంలో బీజేపీకి కొన్ని మంత్రిపదవులు దక్కాయి. కేంద్రంలో టీడీపీకి దక్కాయి. గతంలో బీజేపీ అధినాయకత్వానికి, ప్రస్తుత అధినాయకత్వానికి ఉన్న తేడా... చంద్రబాబుకు నిద్రలేని రాత్రులు మిగులుస్తుంది.
undefined
మోడీ, షాల నాయకత్వంలోని బీజేపీ రాష్ట్రంలో కూడా బలపడాలని ఆలోచన మొదలుపెట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా కాషాయ జెండా పాతాలనేది వీరి లక్ష్యం. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ లో కూడా బలపడాలి అని ఆలోచనలు మొదలుపెట్టారు.
undefined
రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే... బీజేపీని చంద్రబాబు హస్తాల్లోంచి విముక్తి చేయాలనివారు సంకల్పించారు. ఆ రోజు నుండి చిన్నగా తమ ప్రయత్నాలను మొదలుపెట్టి 2017 నాటికి దాన్ని అమలు చేయడం ఆరంభించారు. అప్పటికే వరుసగా రాష్ట్రాల్లో అప్రతిహత విజయాలను నమోదు చేసుకుంటూ దూసుకుపోతున్న బీజేపీ.... ఏపీపై పూర్తి ఫోకస్ పెట్టింది.
undefined
చంద్రబాబుకు పడ్డ ప్రధాన ఎదురు దెబ్బ ఏదైనా ఉందంటే.... అది వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అవ్వడం. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవిని అలంకరించడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలను నెరపలేరు. అప్పటివరకు కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యను ఉప రాష్ట్రపతి చేయడం ద్వారా చంద్రబాబుకు చెక్ పెట్టింది బీజేపీ అధినాయకత్వం.
undefined
వెంకయ్య పార్టీలో సీనియర్. సంఘ్ నాటినుంచి పార్టీకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న వ్యక్తి. ఢిల్లీ సర్కిల్స్ లో బలమైన లాబీయింగ్ చేయగల నేత. ఒక్కసారిగా ఆయన ఉపరాష్ట్రపతి అవడంతో చంద్రబాబు నాయుడుకు ఢిల్లీతోని ఉండే యాక్సిస్ ఒక్కసారిగా తెగిపోయింది. సీనియర్లను బీజేపీ పక్కకు పెడుతుండడంతో.... గుజరాత్ నుంచి వచ్చిన మోడీషాల ద్వయందే పూర్తి ఆధిపత్యం అయింది.
undefined
ఇక ఆ తరువాత రాష్ట్ర బీజేపీ అధ్యక్ష మార్పు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన హరిబాబును తప్పించి వైసీపీలో చేరబోతున్న కన్నా లక్ష్మీనారాయణను తీసుకొచ్చి బీజేపీ అధ్యక్షుడిని చేసారు. కాపు సామాజికవర్గానికి పెద్ద పీటవేసిన బీజేపీ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో గురి పెట్టింది.
undefined
ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజుని తీసుకొచ్చింది. పవన్ తో పొత్తు, మరల కాపు సామాజికవర్గానికి చెందిన, చంద్రబాబుపై కారాలు మిర్యాలు నూరేసోము వీర్రాజును అధ్యక్షుడిని చేయడంతో టార్గెట్ చంద్రబాబు అనేది తేటతెల్లం అయిపోయింది.
undefined
ఒకప్పుడు బీజేపీనే తన కనుసన్నల్లో శాసించిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా అదే బీజేపీకి టార్గెట్ అయ్యాడు. వయోభారం, భవిష్యత్ నాయకత్వం, పార్టీలో నెలకొన్ననైరాశ్యం, మరోపక్క జగన్ బ్యాటింగ్. ఇన్నిటిని తట్టుకొని ఇప్పుడు టీడీపీ ముందుకెళ్లాల్సి ఉంటుంది.
undefined
click me!