ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంలో సైలెంట్ రెబెల్

First Published | Sep 26, 2020, 3:26 PM IST

ఎస్బీ బాలు తన తన వివాహం నుంచే ఓ రెబెల్ గా కనిపిస్తారు. అంతకు ముందు ఆయన ఏం చేశారో తెలియదు గానీ సాహసించి నిరంతరాయంగా కొనసాగుతూ వచ్చిన విశ్వాసాలను బద్దలు కొడుతు తన వివాహం చేసుకున్నారు. తనకు నచ్చిన అమ్మాయిని ఎత్తుకుని వెళ్లి వివాహం చేసుకున్నారు.

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంలో ఓ సైలెంట్ రెబెల్ ఉన్నట్లు కనిపిస్తుంది. మానవ హక్కుల ప్రవక్త కె. బాలగోపాల్ లో కూడా అటువంటి రెబెల్ ఉన్నాడు. ఎస్పీ బాలు, బాలగోపాల్ దారులు వేరైనా ఆ సామీప్యత కనిపిస్తుంది. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి అందులోని అనుచితమైన పద్ధతులను తృణీకరించే తిరుగుబాటుతనం అది.
undefined
అత్యంత శక్తివంతమైన సృజనాత్మకత, జీవితం పట్ల ధైర్యం ఉన్నవాళ్లలో మాత్రమే అది వ్యక్తమవుతుందనుకోవచ్చు. సినీ రంగంలో యాభై ఏళ్ల పాటు నిరంతరాయమైన కొనసాగుతూ తన ప్రత్యేకతను, విశిష్టతను నిలుపుకున్న వ్యక్తిత్వం బాలుది. సినీ రంగంలో ఆయన తనకు నచ్చనివాటి పట్ల కూడా తిరస్కార భావం ప్రదర్శించారు.
undefined

Latest Videos


కె. బాలగోపాల్ ప్రజల కోసం బహిరంగంగానే ఓ తిరుగుబాటుదారుగా కనిపిస్తారు. ఆయన పౌర హక్కుల కోసం పోరాటం చేసే సమయంలోనూ మానవ హక్కుల కోసం పోరాటం చేసిన సమయంలో గానీ అనితర సాధ్యమైన పనులు చాలా చేశారు. సమాజం నిశ్చలమైన నీరులా ఉండడం బాలగోపాల్ కు నచ్చలేదు. జీవితంలో వ్యక్తిగత సుఖాలను అన్నింటినీ ఆయన వదిలేశారు.
undefined
ఎస్బీ బాలు తన తన వివాహం నుంచే ఓ రెబెల్ గా కనిపిస్తారు. అంతకు ముందు ఆయన ఏం చేశారో తెలియదు గానీ సాహసించి నిరంతరాయంగా కొనసాగుతూ వచ్చిన విశ్వాసాలను బద్దలు కొడుతు తన వివాహం చేసుకున్నారు. తనకు నచ్చిన అమ్మాయిని ఎత్తుకుని వెళ్లి వివాహం చేసుకున్నారు. గోత్రాలు కలువలేదనే కారణంతో ఇరు కుటుంబాలు పెళ్లి చేయడానికి ఇష్టపడకపోతే ఆయన ఆ విశ్వాసాన్ని బద్దలుకొట్టాడు.
undefined
బాలు వ్యక్తిత్వం చాలా విశిష్టంగా రూపుదిద్దుకుంది. సినీ రంగంలో ఆయన విశిష్టత, తిరుగుబాటుదారు బయట పడుతూనే వచ్చారు. గాయకులు గాత్రం చెడిపోతుందనే భయాందోళనలు వ్యక్తం చేస్తూ కొన్ని కఠిన నియమాలను పాటిస్తూ ఉంటే బాలును ఆ భయాందోళనలు ఏమీ చేయలేకపోయాయి. ఫ్రిజ్ నీళ్లు తాగారు. గాయకులు దూరంగా ఉంచే పదార్థాలను ఇష్టంగా తిన్నారు. పొగ తాగారు. కానీ, ఆయన గాత్రం ఎక్కడా చెడిపోలేదు.
undefined
ఆయన యాభై ఏళ్లు నిరంతరాయంగా అదే గాత్రాన్ని అందిస్తూ వచ్చారు. వయస్సు పెరిగినా కూడా ఆయన గాత్రం ఎప్పటిలాగే మృదువుగా పలుకుతూ వచ్చింది. సన్నివేశానికి తగినట్లు గాత్రం తనను తాను సరిచేసుకుంది. అది కూడా ఆయనలోని తిరుగుబాటు లక్షణమే. గాత్రం కేవలం దుమ్ము వల్ల మాత్రమే చెడిపోతుందని ఆయన నమ్ముతూ వచ్చారు. భారతదేశంలో దుమ్ములేని ప్రదేశం లేదు కాబట్టి దాన్ని ఆయన గళం నిరోధించే శక్తిని పెంచుకుంది.
undefined
సూపర్ స్టార్ కృష్ణతో విభేదాల విషయంలో కూడా ఆయన తిరుగుబాటుదారుగానే కనిపిస్తారు. ఓ సందర్భంలో జరిగిన సంభాషణ కారణంగా ఆయన సూపర్ స్టార్ కృష్ణకు పాడబోనని భీష్మించుకు కూర్చున్నారు. అయితే, ఆయన ఎప్పుడు కూడా కృష్ణ గురించి చెడుగా ఎవరి వద్దా ప్రైవేట్ సంభాషణల్లో కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత ఇరువురి మధ్య దానంతటదే కుదిరింది.
undefined
తనకు ప్రాణ స్నేహితుడైన ఇళయరాజాతో చోటు చేసుకున్న సందర్భంలో కూడా ఆయన రెబెల్ గానే కనిపిస్తున్నారు. ఇళయరాజా చేసిన పని ఆయనకు నచ్చలేదు. లీగల్ నోటీస్ ఇవ్వడానికి ముందు తనతో మాట్లాడి ఉంటే సరిపోయేది కదా అనేది ఆయన అనుకుంటూ వచ్చారు. ఇళయరాజా పాటలు పాడకుండా తాను ముందుకు సాగారు. అది ఆయనలోని ధైర్యాన్ని సూచిస్తుంది.
undefined
గొంతులో ఏర్పడిన చిన్న బుడిపెను సర్జరీ ద్వారా తీయించుకునే విషయంలోనూ ఆయన రెబెల్ గానే కనిపిస్తున్నారు. ధైర్యం ప్రదర్శించారు. హిందీ గాయని లతా మంగేష్కర్ చెప్పినా వినకుండా ఆమెతో ఏమీ చెప్పకుండా సర్జరీ చేయించుకున్నారు. వైద్యులు చెప్పిన జాగ్రత్తలను కూడా ఆయన పాటించలేదు. వెంటనే పాటలు పాడడాన్ని, డబ్బింగ్ చెప్పడాన్ని ప్రారంభించారు.
undefined
ఇతరుల పట్ల తమ ప్రేమవాత్సల్యాలను ప్రదర్శించడంలో కూడా బాలగోపాల్ కు, బాలుకు సామీప్యత కనిపిస్తుంది. ఇతరుల గురించి వారు బయటి ప్రపంచంలో ఏ మాత్రం వ్యతిరేకంగా మాట్లాడలేదు. బాలగోపాల్ తన ఆచరణను మార్చుకున్న సమయంలో పలు విమర్శలు ఎదుర్కున్నారు. ఆ విమర్శలు చేసినవారి పట్ల ఆయన ఏనాడు కూడా వైముఖ్యం ప్రదర్శించలేదు. సినీ రంగంలో కూడా బాలు అదే విధానాన్ని పాటించారు
undefined
click me!