ఏపీ టీడీపీ రాజకీయం: అచ్చెన్నాయుడికి నారా లోకేష్ షాక్?

First Published | Sep 28, 2020, 12:12 PM IST

అన్ని లెవెల్స్ లో నాయకులను నియమిస్తున్న టీడీపీ ఇంతవరకు రాష్ట్ర అధ్యక్షుడిని మాత్రం నియమించలేదు. తొలుత అచ్చెన్నాయుడు పేరును టీడీపీ ప్రకటించనుందన్న వార్తలు వచ్చినప్పటికీ.... ఎందుకో అది మాత్రం కార్యరూపం దాల్చలేదు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం టీడీపీ పార్టీ వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది. కొత్తగా వైసీపీ పై హిందుత్వ కార్డును ప్రయోగిస్తుండడం ఒకటయితే.... పార్టీ అధ్యక్షుడి నియామకం మరో ఎత్తు. పార్టీలో నూతన జోష్ తీసుకురావాలని సంకల్పిస్తున్న చంద్రబాబు నాయుడు, పార్టీ క్యాడర్ ని బలోపేతం చేయడానికి కమిటీలను నియమిస్తున్నారు.
undefined
ఇందులో భాగంగా ఇప్పటికే పార్లమెంటరీ ఇంచార్జిలను నియమించారు. గ్రామస్థాయి కమిటీల నియామకం జోరుగా సాగుతుంది. అన్ని లెవెల్స్ లో నాయకులను నియమిస్తున్న టీడీపీ ఇంతవరకు రాష్ట్ర అధ్యక్షుడిని మాత్రం నియమించలేదు. తొలుత అచ్చెన్నాయుడు పేరునుటీడీపీ ప్రకటించనుందన్న వార్తలు వచ్చినప్పటికీ.... ఎందుకో అది మాత్రం కార్యరూపం దాల్చలేదు.
undefined

Latest Videos


టీడీపీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. జగన్ అఖండ విరాజయం తరువాత టీడీపీ డీలా పడిపోయింది. వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు కొందరు నాయకులూ పార్టీని వీడుతుండగా... ఆర్ధిక మూలాలపై ఎదురు దెబ్బలు పడడంతో... మరికొందరు నేతలు పార్టీని వీడుతున్నారు.
undefined
పనిలో పనిగా టీడీపీ భావి నాయకత్వంపై వైసీపీ ఎక్కడలేని ప్రశ్నలను లేవనెత్తుతోంది. చాలా తెలివిగా లోకేష్ ను అనర్హుడిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని విపక్షంలో ఉన్నప్పటి నుంచే మొదలుపెట్టిన వైసీపీ అందులో సఫలీకృతమైంది అని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పైబడుతున్న వయసు దృష్ట్యా భావి నాయకుడు ఎవరు అనే ప్రశ్న మరింత తీవ్రతరమయింది.
undefined
ఈ నేపథ్యంలో చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఎవరికీ అప్పగించాలనే విషయం పై మల్లగుల్లాలు పడుతున్నారు. లోకేష్ ని ప్రస్తుతానికి రాజకీయంగా యాక్టివేట్ చేసే పనిలో బిజీగా ఉంది టీడీపీ. ఈ మధ్యకాలంలో లోకేష్ సైతం బహిరంగంగా కనబడుతున్నారు. ఆ పరిస్థితి ఒకవైపు నడిపిస్తునే.... మరో వైపు టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు.
undefined
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బీసీలు టీడీపీ నుంచి చేయిజారిపోయిన పరిస్థితుల్లో, అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన తదనంతర పరిణామాలతో... అచ్చెన్న కు రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని భావించింది టీడీపీ. అందువల్ల అచ్చెన్నకు పార్టీ అండగా ఉంటుందన్న మెసేజ్ ఇవ్వడంతోపాటు, ఆయన తన పోరాటాన్ని మరింత బలంగా వినిపించే వీలుంటుంది.
undefined
అయితే ముందు నుంచి కూడా లోకేష్ రామ్ మోహన్ నాయుడు వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. పార్టీలో మొత్తం యువ రక్తం నింపినప్పుడే వైసీపీని ఎదుర్కోవడం సాధ్యమైతుందని లోకేష్ భావిస్తున్నారట. అయితే చంద్రబాబు మాత్రం ప్రస్తుత తరుణంలో బలంగా వాణిని వినిపించగలిగి, సానుభూతి పవనాలు వీస్తున్న అచ్చెన్న ను అధ్యక్షుడిని చేయాలనియోచిస్తున్నారు.
undefined
ఈవిషయమై ఇరువురు ఇంతవరకు ఒక పరస్పర అంగీకారానికి రానందున టీడీపీ తదుపరి అధ్యక్షుడు ఎవరు అనే విషయమై సస్పెన్స్ నెలకొంది. రామ్మోహన్ నాయుడును గనుక అధ్యక్షుడిని చేస్తేభవిష్యత్తులో తలపెట్టిన లోకేష్ సైకిల్ యాత్ర సందర్భంలో కూడా వైసీపీని బలంగా కౌంటర్ చేయవచ్చని లోకేష్యోచిస్తున్నట్టుగా తెలియవస్తుంది.
undefined
ఈ అన్ని లెక్కలను బేరీజు వేసుకున్న లోకేష్ రామ్మోహన్ నాయుడుకిఅధ్యక్ష పదవిని కట్టబెట్టాలని యోచిస్తుంటే... చంద్రబాబు మాత్రం అనుభవానికి పెద్దపీట వేస్తున్నట్టుగా సమాచారం. ఈ ఇద్దరి మధ్య నెలకొన్న ఈ సందిగ్ధత వల్లే ఇంకా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం వెనుక జాప్యానికి కారణం. వేచి చూడాలి, బాబాయి, అబ్బాయిల మధ్య ఎవరిని ఈ అధ్యక్షా పీఠం వరిస్తుందో...!
undefined
click me!