విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఎంపీ కేశినేని నానికి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పార్టీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా మహేశ్వరరావు వర్గాలకు మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకొన్నాయి.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై మరో పిడుగు పడింది. సీనియర్ నేత, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని చంద్రబాబుపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను గానీ తన కూతురు గానీ పోటీ చేయబోమని ఆయన బాంబు వేసినట్లు తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడం చంద్రబాబు తలనొప్పిగానే పరిణమించవచ్చు.