ఏపీలో బిజెపి ఎజెండా ఇదే: చంద్రబాబుపై గురి, టీడీపీని ఖాళీ చేయడమే...

First Published Aug 12, 2020, 7:30 PM IST

బీజేపీ రాష్ట్రంలో ఎలా దూసుకుపోవాలని భావిస్తుందో మనం అర్థం చేసుకోవాలంటే మొన్న రామ్ మాధవ్ మాట్లాడిన మాటలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది.  ఆయన తన వ్యాఖ్యల్లో పదే పదే రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు అని రాజకీయంగా ప్రతిపక్ష శూన్యత ఉందని మాట్లాడాడు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో బీజేపీ చాలా సీరియస్ గా ఉంది. నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో అందరికి తెలుసు. మానవవనరుల శాఖామంత్రి రమేష్ పోఖ్రియాల్ ఏకంగా పవన్ కళ్యాణ్ వీడియో పెట్టి, మీ సూచనలను కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా ట్విట్టర్ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.
undefined
ఇప్పటికిప్పుడు జెండా పాతాలనే ఉద్దేశం వారికి లేకున్నప్పటికీ.... వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పై వారు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఉత్తరాదిన వారికి ఇప్పటికే వారి సీట్లు సాచురేషన్ స్థాయికి చేరుకున్నాయి. వారికి అక్కడ సీట్లు తగ్గుతాయి తప్ప, పెరగవు. రెండు ఎన్నికల్లో ఓట్లు వేసిన ఓటర్లు మరోమారు వేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు.
undefined
ఈ పరిస్థితుల్లో వారి సీట్లు తగ్గకూడదు అంటే... ఇంతకుమునుపు తక్కువ సీట్లొచ్చిన రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో తమ సీట్లను పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకే బీజేపీ వేగంగా రాష్ట్రంలో తన పావులను కదుపుతుంది.
undefined
ఇక బీజేపీ రాష్ట్రంలో ఎలా దూసుకుపోవాలని భావిస్తుందో మనం అర్థం చేసుకోవాలంటే మొన్న రామ్ మాధవ్ మాట్లాడిన మాటలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఆయన తన వ్యాఖ్యల్లో పదే పదే రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు అని రాజకీయంగా ప్రతిపక్షశూన్యత ఉందని మాట్లాడాడు.
undefined
ఆయన ప్రతిపక్ష శూన్యత ఉంది అంటూనే జగన్ ని మాత్రం శత్రువు అనలేదు. విమర్శనాత్మకంగా ఉంటామని అన్నాడు. ఈ వ్యాఖ్యల్లోని మర్మం ఒక్కటే. రాష్ట్రంలో టీడీపీని ఖాళీ చేపించడం ఇప్పుడు బీజేపీ ముందున్న లక్ష్యంగా మనకు కనబడుతుంది.
undefined
వినడానికి ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు. 40 శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీ టీడీపీ. 23 సీట్లనే గెలిచి ఉండవచ్చు. కానీ టీడీపీకి అంటూ ఒక బేస్, క్యాడర్ ఉంది. గ్రామగ్రామాన వారి శాఖలు ఉన్నాయి. ఎన్టీఆర్ పైన్నే తిరుగుబాటు చేసినప్పటికీ... పార్టీ నిలబడగలిగింది.
undefined
కానీ అలంటి పార్టీని సైతం ఇప్పుడు ఖాళీ చూపించడం బీజేపీ ముందున్న లక్ష్యం. బీజేపీ ఏ రాష్టీరంలో అయినా పనిచేసే విధానమొక్కటే. వారికి పట్టులేని చోట, ప్రతిపక్షాన్ని ఖాళీ చేసి అక్కడ ప్రధాన ప్రతిపక్షం హోదాను దక్కించుకోవడం. అప్పటివరకు అధికార పక్షంతోపాటు నడుస్తుంది. ఒక్కసారి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగగానే ప్రతిపక్షాన్ని ఖాళీ చేపించి అధికార పక్షానికి సవాలు విసురుతుంది. ఇదే వారి వర్కింగ్ ప్లాన్.
undefined
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే ప్లాన్ ని అమలు చేయాలని యోచిస్తున్నారు. జగన్ సర్కార్ ను ఇప్పుడు ముట్టుకునే యోచనలో బీజేపీ లేదు. టీడీపీ ఓటింగ్ బేస్ ని తమవైపుకు తిప్పుకున్నంత తేలికగా వైసీపీకి చెందిన వోటింగ్ బేస్ ను బీజేపీ తిప్పుకోలేదు.
undefined
దళిత, మైనారిటీ వోట్ బ్యాంకు జగన్ కు బోలెడంత అండ. ఏపీలోని దళిత వోట్ బ్యాంకులో చాలావరకు క్రిస్టియన్ వోట్ బ్యాంకు. అది అంత తేలికగా బీజేపీవైపు తరలదు. ఈ నేపథ్యంలోనే టీడీపీని ఖాళీ చేపించి ఆ పోస్ట్ లో కూర్చోవాలనుకుంటుంది బీజేపీ.
undefined
ఇందుకోసం ఇక రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచబోతుంది. రాష్ట్రంలో వైసీపీ బ్యాటింగ్ ఎంతలా పెరిగితే... అంతలా తమకు లాభం అనుకుంటుంది. కానీ, వైసీపీ బ్యాటింగ్ ను తట్టుకోలేక అందరూ బీజేపీ వైపే చూస్తారన్న గ్యారంటీ కూడా లేదు. శిద్ధారాఘవరావు వంటి వారు తమ ఆర్ధిక ప్రయోజనాల దృష్ట్యా వైసీపీలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో వేచి చూడాలి. ఏపీలో రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయో. కానీ రానున్న రోజుల్లో టీడీపీ పార్టీకి మరిన్ని చికాకులు, మరింత గడ్డుకాలం కూడా తప్పేలా కనబడడం లేదు.
undefined
click me!