పవన్ కళ్యాణ్ తో బీజేపీ దోస్తీ... పురంధేశ్వరి జాక్ పాట్

First Published Jan 16, 2020, 2:00 PM IST

పవన్ కళ్యాణ్ పొత్తుల వల్ల ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుకి సంబంధించిన సూచనలను కనబడుతున్నాయి. ఇప్పటికి జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాకు మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని కూడా మార్చాలని అధిష్టానం యోచిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాజధాని అంశం పుణ్యమాని నూతన పునరేకీకరణ దిశగా సాగుతున్నాయి. నూతన పొత్తులు కూడా పొడుస్తున్నాయి. తాజాగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి నడవాలని నిశ్చయించుకున్నాడు. ఈ మేరకు మొన్న ఢిల్లీలో ఇరు పార్టీల మధ్య దీనికి సంబంధించిన అవగాహన కుదిరింది.
undefined
ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తుల వల్ల ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుకి సంబంధించిన సూచనలను కనబడుతున్నాయి. ఇప్పటికి జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాకు మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని కూడా మార్చాలని అధిష్టానం యోచిస్తోంది.
undefined
ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీన్ అంత ప్రభావాన్ని చూపెట్టలేకపోయింది. దానికి అనేక కారణాలున్నప్పటికీ కనీసం డిపాజిట్లు కూడా కోల్పోయింది బీజేపీ. ఎన్నికలకు పూర్వపు విషయాలను అటుంచితే....ఎన్నికల తరువాత బీజేపీ ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టిని పెట్టింది. ప్రధాని మోడీ తిరుపతి సభ ఇందుకు మంచి ఉదాహరణ.
undefined
ఈ నేపథ్యంలో అందివచ్చిన రాజధాని అంశంలో ఇంకా దూకుడు ప్రదర్శించి రాజకీయంగా లబ్ది పొందాలని బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరింత ఊపు తీసుకొచ్చేందుకు నాయకత్వ మార్పు దిశగా బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పుడిదే కన్నాకు మింగుడు పాడడం లేదు. మొన్నటి వరకు ఆయన బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగడానికి ఆయన కాపు సామాజికవర్గ కార్డు ఉపయోగపడింది
undefined
ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతులు కలపడంతో కాపు సామాజికవర్గానికి సంబంధించిన ఒక పెద్ద ఫిగర్ బీజేపీ దగ్గరుండగా ఇక కన్నాతో పనేంటని వారు భావిస్తున్నారు. కన్నా ను తీసేస్తే నెక్స్ట్ ఎవరు అనే చర్చ బలంగా సాగుతుంది. కన్నా తరువాత ఆ పదవిని ఒక కమ్మ సామాజికవర్గానికి చెందిన బలమైన నేతకు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.
undefined
టీడీపీతో లోలోన ఏదో అప్రకటిత ఒప్పందం ఉన్నట్టు కనబడుతున్నప్పటికీ...టీడీపీ ని గనుక ఎవరైనా నేతలు వీడితే, వారిని తమవైపు తిప్పుకోవాలనే యోచనలో ఉంది బీజేపీ. ఇందుకోసం కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతకే పెద్ద పీత వేయాలని భావిస్తున్నారు. ఇలా ఆలోచించినప్పుడు మనకు రెండు పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి.
undefined
మొదటిది పురంధేశ్వరి పేరు కాగా..రెండోది సుజనా చౌదరియు పేరు. పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్రావు కూడా వైసీపీకి రాజీనామా చేసి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండడం, ఆమె కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె ప్రకటించడం, ఈ అన్నిటిని గనుక కలిపి చూసుకుంటే...ఆమెకు అప్పుడే కేంద్రం హామీ ఎమన్నా ఇచ్చిందా అనే అనుమానం కలుగక మానదు
undefined
ఇక సుజనా చౌదరి పేరు కూడా వినబడుతున్నప్పటికీ ఆయనకు, చంద్రబాబుకు ఉన్న సాన్నిహిత్య సంబంధాల వల్ల ఆయనను ఎంతమేర రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తారన్నది చూడాల్సిన అంశం. దానితోపాటు రాష్ట్ర అధ్యక్షుడు పార్టీలో జోష్ నింపేవారై ఉండాలి.
undefined
ఇలా ఈ ఈక్వేషన్స్ అన్ని గనుక చూసుకుంటే పురంధేశ్వరికి ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. ఈ నాయకులంతా బయట పార్టీలనుంచి వచ్చిన నేతలు కాగా...ఒక సొంత పార్టీ నేత పేరు కూడా వినబడుతుంది. ఆయనే బీజేపీ ఉత్తరాంధ్ర నేత మాధవ్. ఈయన తండ్రి చలపతి రావు కూడా బీజేపీ నేతగా కొనసాగారు. బీజేపీ యువమోర్చ అధ్యక్షుడుగా పనిచేసారు. ఆయన పేరు కూడా బలంగా వినపడుతున్నప్పటికీ, ఆ సామాజికవర్గంలో పట్టు ఇప్పుడు బీజేపీకి అవసరమైనప్పటికీ కూడా మాధవ్ వయసు తక్కువ కావడం వల్ల ఆయన్ను పక్కకు పెట్టేట్టు చేస్తున్నాయి.
undefined
ఇప్పుడు మొత్తానికి పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలపడం కన్నా కు ఒకింత ప్రతిబంధకంగా తయారయ్యింది. కాకపోతే, ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కన్నా లక్ష్మి నారాయణను గనుక పార్టీ అధ్యక్షా పదవి నుంచి తప్పిస్తే...ఆయన పార్టీలో కొనసాగుతారా అనేది సమస్య. ఇంతకు ముందు ఆయన బీజేపీలో చేరడమే...నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ఆయన వైసీపీలో చేరడానికి వెలుతూ, ఉన్నపళంగా బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు ఆయన్ను గనుక తొలిగిస్తే... ఆయన వైసీపీలోకి జంప్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు.
undefined
ఇలా కన్నా లక్ష్మీనారాయణ గనుక వైసీపీలో చేరితే అది బీజేపీకి చాలా అవమానకరంగా ఉంటుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ ఫిరాయించాడు అనేది పార్టీకి ఒకింత అవమాన భారంగా పరిణమిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన్నే కొనసాగిస్తారా..లేక ఆయనను వేరే ఏదైనా తాయిలం చూపెట్టి బుజ్జగిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
undefined
click me!