జగన్ మీద ఫైట్: బిజెపి అస్త్రం పవన్ కల్యాణ్, చంద్రబాబు వెనక్కి..

First Published Jan 13, 2020, 5:02 PM IST

బిజెపితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు కొత్త సమీకరణాలకు దారి తీయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ధీటుగా ఎదుర్కోలేకపోతున్న బిజెపికి పవన్ కల్యాణ్ రూపంలో అస్త్రం దొరికినట్లయింది. 

బిజెపితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు కొత్త సమీకరణాలకు దారి తీయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ధీటుగా ఎదుర్కోలేకపోతున్న బిజెపికి పవన్ కల్యాణ్ రూపంలో అస్త్రం దొరికినట్లయింది. వైఎస్ జగన్ పై పోరాటానికి ఇక ముందు బిజెపి పవన్ కల్యాణ్ ను ముందు పెట్టే అవకాశాలున్నాయి.
undefined
మూడు రాజధానుల ప్రతిపాదనతో చిక్కుల్లో పడిన వైఎస్ జగన్ ను మరింతగా చిక్కుల్లోకి నెట్టేందుకు కావాల్సిన వ్యూహాన్ని బిజెపి సిద్ధం చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. దాంతో ప్రాంతీయ వివాదాలు మరింతగా ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. అమరావతిని రాజధానిగా బిజెపి కాదనడం లేదు.
undefined
అయితే, రాష్ట్ర బిజెపి మాత్రం వైఎస్ జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర బిజెపి అడుగుతోంది. కానీ, కేంద్రం జోక్యం చేసుకునే స్థితిలో లేదు. జగన్ తన నిర్ణయాలను అమలు చేసే క్రమంలో మరింతగా చిక్కులు ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాన్ని బిజెపి జాతీయాధ్యక్షుడు రూపొందించి రాష్ట్ర శాఖకు సూచనలు చేసే అవకాశం ఉంది.
undefined
రాష్ట్ర పార్టీకి సూచనలు చేసే క్రమంలో పవన్ కల్యాణ్ ను యుద్ధరంగంలోకి దింపి ఆలోచన కూడా బిజెపికి ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బిజెపి నేతలంతా పవన్ కల్యాణ్ దారిలో నడిచే విధంగా వ్యూహరచన చేసే అవకాశం ఉంది. దానివల్ల వైఎస్ జగన్ ను ధీటుగా ఎదుర్కోవడానికి వీలవుతుందని బహుశా భావిస్తూ ఉండవచ్చు.
undefined
అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పక్కకు నెట్టే అవకాశం లభిస్తుంది. వైఎస్ జగన్ కు ప్రస్తుతం చంద్రబాబు మాత్రమే ప్రధాన ప్రత్యర్థిగా కనిపిస్తున్నారు. అమరావతిపై ఆయన చేసే పోరాటం విషయంలో అదే ముందుకు వస్తోంది. పవన్ కల్యాణ్ ను ముందు పెట్టి, బిజెపి శ్రేణులను ఆయన వెనక నడిపిస్తే చంద్రబాబును కూడా పక్కకు నెట్టే అవకాశం లభిస్తుందనేది బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది.
undefined
వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు కూడా తమతో కలిసి వచ్చే విధంగా బిజెపి వ్యూహరచన సాగవచ్చు. లేదా చంద్రబాబును మైనస్ లోకి నెట్టడం ద్వారా టీడీపీ స్థానాన్ని బిజెపి ఆక్రమించవచ్చు. ఆ రకంగా వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా జనసేన, బిజెపి కూటమి ముందుకు వచ్చే అవకాశాలుంటాయి.
undefined
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, బిజెపి కలిసి పోటి చేయడానికి తాజా పొత్తు ఉపయోగపడుతుంది. తమ కూటమిలో టీడీపీని కలుపుకుంటారా, లేదా అనేది సందేహమే. టీడీపీతో కూడా సీట్ల సర్దుబాటు చేసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి పొత్తులు ఎలా ఉండబోతాయనే స్పష్టత వచ్చినట్లే
undefined
పవన్ కల్యాణ్ బిజెపితో దోస్తీ కట్టినందున వామపక్షాలు దూరమయ్యే అవకాశం ఉంది. బిజెపి, జనసేన కూటమితో చంద్రబాబు వెళ్లకపోతే వామపక్షాలు టీడీపీతో జత కట్టవచ్చు. కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన స్పష్టత వస్తుంది.
undefined
మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, బిజెపి కలిసి పనిచేస్తే వచ్చి ఫలితాలు భవిష్యత్తు ఫలితాలకు సంబంధించిన ఒక అంచనా రావచ్చు. దాన్ని బట్టి కూడా బిజెపి, జనసేన తమ వ్యూహాలకు పదును పెట్టుకోవచ్చు. మొత్తం మీద, వచ్చే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి ఇప్పటి నుంచే వ్యూహాలను రచించి, అమలు చేయడానికి సిద్ధపడినట్లు కనిపిస్తోంది.
undefined
click me!