మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ర్ఫాజ్యసభకు వెళ్లడం, వారి పోస్టులు ఖాళీ అవడం వాటిని భర్తీచేయడం కూడా జరిగిపోయింది. పిల్లి, మోపిదేవిలను రాజ్యసభకు పంపాలని జగన్ నిశ్చయించుకున్నప్పటినుండి మొదలు ఆ రెండు మంత్రిపదవులు ఎవరికి అనే చర్చ మొదలయింది.
undefined
ఏపీలో మంత్రిపదవుల కోసం చాలా మందే ఆశలు పెట్టుకున్నారు. సామాజికవర్గాలకతీతంగా చాలామందే అమాత్యులవుదామని కలలుగన్నప్పటికీ అవి సాకారమవ్వలేదు. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి, రోజాల నుండి మొదలు జోగి రమేష్, తమ్మినేని సీతారాం వరకు చాలామందే కలలు కన్నారు.
undefined
అచ్చెన్నాయుడి అరెస్ట్, దాని తదనంతర పరిణామాల వల్ల వైసీపీ మీద బీసీల వ్యతిరేకి అనే ముద్ర వేయడానికి టీడీపీ ప్రయత్నించడం, సామాజికవర్గాల ఆధారంగా కూర్చిన మంత్రిమండలిలో మార్పులు చేయడం ఇష్టంలేని జగన్ సర్కార్......బీసీసామాజికవర్గాలతోనే మంత్రిమండలినినింపాలని భావించింది.
undefined
పిల్లి, మోపిదేవిలుఇద్దరూ కూడా బీసీ సామాజికవర్గానికి చెందినవారవడంతో తొలుత బీసీలందరూ ప్రయత్నాలు చేసారు. స్పీకర్ తమ్మినేని గారు కూడా తీవ్రంగానే ప్రయత్నంచేసారు. టీడీపీ బలమైన బీసీ నేత అచ్చెన్నాయుడిది కూడా శ్రీకాకుళం జిల్లాఅవడం, తన సామాజికవర్గం, అచ్చెన్నాయుడు సామాజికవర్గం కూడా ఒకటే అవడం ఇత్యాది లెక్కల వల్ల తనకు అవకాశం కలిసొస్తుందని భావించారు తమ్మినేని.
undefined
బీసీల విషయంలో ఏపీలో జరుగుతున్న గొడవ దృష్ట్యా అచ్చెన్నాయుడుని కౌంటర్ చేయడానికి తనకు అవకాశం లభిస్తుందని భావించాడు తమ్మినేని. గతంలో కూడా మంత్రిగా పనిచేసిన తమ్మినేని స్పీకర్ పదవిని అయిష్టంగానే చేపట్టారు. కానీ ఆయనకు అమాత్య పదవి దక్కలేదు.
undefined
చెల్లుబోయిన వేణుగోపాలరావు కి, అప్పలరాజుకి మంత్రిపదవులు కట్టబెట్టారు జగన్. ఇద్దరు కూడా తొలిసారి మంత్రులు అయినవారే. ఇలా ఇద్దరు కొత్తవారికి మంత్రిపదవులు ఇవ్వడంపై సర్వత్రా ఆశ్చర్యంవ్యక్తమయింది. పిల్లి శెట్టి బలిజ సామాజికవ్రగానికి చెందినవాడు కాగా మోపిదేవి మత్స్యకార సామాజికవర్గానికి చెందినవాడు.
undefined
మోపిదేవి గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందినవాడైనప్పటికీ... మంత్రిపదవి కట్టబెట్టేప్పుడు గుంటూరును కాదని శ్రీకాకుళం జిల్లాకు మంత్రిపదవిని ఇచ్చారు. మత్స్యకార సామాజికవర్గం నుండి పొన్నాడ సతీష్ పేరు వినబడ్డప్పటికీ.... ఆయనను కాదని అప్పలరాజుకి మంత్రిపదవిని కేటబెట్టారు.
undefined
తూర్పు గోదావరి జిల్లాకన్నా కూడా శ్రీకాకుళం జిల్లలో మత్స్యకార సామాజికవర్గ ప్రభావంఅధికం. అందునా ఆ ప్రాంతంలో బలంగా ఉన్న వైసీపీ మరింత బలపడాలనే యోచనతో ఆ ప్రాంతానికి ఈ పోస్టును కట్టబెట్టారు జగన్ మోహన్ రెడ్డి. ఈ లెక్కలు వేసుకున్నతరువాతే జగన్ అప్పలరాజుకు అవకాశం కల్పించారు.
undefined
శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పిల్లి ప్లేస్ లో అదే సామాజికవర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల్ కి అవకాశం దక్కింది. జోగి రమేష్ పేరు కూడా వినబడ్డప్పటికీ... చెల్లుబోయిన వేణుగోపాల్ కేఅవకాశం దక్కింది. ఈ ఇద్దరిని జగన్ ఏదో ఊరికే తీసుకోలేదు. దాని వెనుక పూర్తిస్థాయి ఆలోచన చేసి తీసుకున్న నిర్ణయమే.
undefined
ఉభయ గోదావరి జిల్లాల్లో శెట్టిబలిజ సామాజికవర్గం చెప్పుకోదగ్గ స్థాయిలో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణ జిల్లాకు చెందిన జోగి రమేష్ కన్నా ఈ ప్రాంతానికే చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఇస్తే సామాజికవర్గ లెక్కలు కలిసి వస్తాయని భావించారు.
undefined
ఇవి జగన్ నూతన మంత్రివర్గ విస్తరణలోని దాగున్న అంశాలు. ఏది ఏమైనా శ్రీకాకుళం జిల్లాకు ఒక ఉపముఖ్యమంత్రి పదవి, ఒక మంత్రి పదవి, స్పీకర్ పదవి దక్కాయి. జిల్లా పరంగా బలమైన ప్రాతినిధ్యం దక్కినప్పటికీ.... తమ్మినేనికిమాత్రం నిరాశే మిగిలింది!
undefined