ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయమంతా దేవాలయాల చుట్టూ తిరుగుతుంది. రాష్ట్రంలో గత కొంత కాలంగా ఎక్కడో ఏదో ఒకదేవాలయంపై దాడి జరిగిందన్న వార్త రావడం, ప్రతిపక్షం దాన్ని హైలైట్ చేస్తూ నిరసన తెలుపుతూ అధికార పక్షాన్ని తూర్పారపట్టడం.... ఆ తరువాత అధికారపక్షం ప్రతిపక్షం మీద దుమ్మెత్తిపోయడం. ఇది రోజువారీ రాజకీయంగా మారిపోయింది.
undefined
హిందూ దేవాలయాల మీద దాడులు జరగడం ఖండించవలిసిన విషయం. దీనికి బాధ్యులెవరైనా కఠినంగా శిక్షించావలిసిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది మాత విశ్వాసాలకు సంబంధించిన విషయం తోపాటుగా రాజ్యంగంలో కూడా పొందుపరిచినా ఒక అంశం. కానీ ఈ పరిస్థితులు రాజకీయ రంగును పులుముకోవడం అంత మంచి పరిణామం మాత్రం కాదు.
undefined
ఈ సంఘటనల వెనుక ఎవరున్నారు అనేది న్యాయ వ్యవస్థ తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత విశ్వాసాన్ని చూపెడుతూ... ఆయన అన్యమతస్థుడు అంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవడానికి దోహదం చేస్తుందనడంలో ఎటువంటి సంశయం లేదు. ఒకానొక దశలో బైబిల్ వర్సెస్ భగవద్గీత వంటి స్లొగన్స్ కూడా వినిపించాయి అంటే ఏ స్థాయిలో ఈ వివాదం రాజకీయమవుతుందో మనకు అర్థం అవవుతుంది.
undefined
ఆంధ్రప్రదేశ్ లో ఇలా మతం కోణంలో రాజకీయం చేయాలని చూడడానికి ఇది తొలి ప్రయత్నం కాదు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ.... ఆయన సంక్షేమ పథకాల జోరుతోపాటుగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల వీలు పడలేదు.
undefined
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నది మోడీ, షాల ద్వయం నాయకత్వంలోని బీజేపీ. దేశమంతా కాషాయ జెండా రెపరెపలాడించాలన్న కృతనిశ్చయంతో ముందుకు వెళ్తున్న వారు దేశంలో హిందుత్వ కార్డును ఎలా ప్రయోగిస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. మిగిలిన చోట్లకు భిన్నంగా ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్యమతస్థుడవడాన్ని ప్రతిపక్షాలు బలంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
undefined
దీనికి చెక్ పెట్టేందుకు జగన్ మోహన్ రెడ్డి కూడా అదే దారిలో ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గోమాత పూజలో పాల్గొన్నారు.కనుమ పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం నిర్వహించిన కామధేను పూజలో పాల్గొని పట్టు పంచె, కండువాతో గోత్రనామాలతో సంకల్పం చెప్పారు. ఇలా గోపూజతో పాల్గొనడం ద్వారా నేరుగా ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడంతోపాటుగా లోకల్ సంప్రదాయాలకు, తెలుగు పండుగలకు పెద్దపీట వేస్తున్నాననే సంకేతాన్ని ఆయన నేరుగా ప్రజల్లోకి పంపించాలని అనుకున్నారు. చూడాలి రానున్న కాలంలో ఇది జగన్ మోహన్ రెడ్డికి ఎంత మేర లబ్ది చేకూర్చగలవో..!
undefined