వల్లభనేని వంశీ, టీడీపీ వలస ఎమ్మెల్యేలపై జగన్ వెనక్కి: కారణాలు ఇవే....

First Published | Jul 11, 2020, 9:19 AM IST

వల్లభనేని వంశీ ఎలాగైనా తిరిగి ఎన్నికల్లో పోటీచేసి గెలవాలని యోచిస్తున్నారట. ఆయన కుదిరితే తనతోపాటు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలుగా మారిన కరణం బలరాం, మద్దాలి గిరిలను సైతం రాజీనామా చేపించి ఎన్నికల బరిలో నిలబెట్టాలి అని అనుకుంటున్నారట. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘురామా కృష్ణంరాజు ఎపిసోడ్ తారాస్థాయికి చేరుకుంది. ఆయనపై కేసులమీద కేసులు పెడుతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే ఆయన మీద తమను కించపరిచేలా మాట్లాడారంటూ కేసులు పెట్టారు. మరికొన్నికేసులు కూడాపెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయనంతట ఆయనే బయటకు వెళ్లిపోయేలా చేయడానికి వైసీపీ సర్కారు తీవ్ర ప్రయత్నాలను చేస్తుంది.
undefined
అయితే తాజాగా వైసీపీ సర్కారు సోషల్ మీడియాలో కొన్ని కౌంటర్లను ఎదుర్కొంటుంది. వల్లభనేని వంశీ వంటి వారిని టీడీపీ నుంచి తెచ్చిపెట్టుకుంటే తప్పులేదు కానీ, ఇప్పుడు రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో ఎందుకు అదే చర్య తప్పుగా కనబడుతుంది అని ప్రశ్నిస్తున్నారు.
undefined

Latest Videos


ఇక నేరుగా వల్లభనేని వంశీని సైతం టీడీపీ టార్గెట్ చేస్తుంది. ఇంకా టెక్నికల్ గా టీడీపీలోనే ఉన్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అంత దమ్ము వుంటే రాజీనామా చేసి మరల గెలవాలని సవాల్ విసురుతున్నారు. ఎప్పటినుండో కూడా ఇది సాగుతూనే ఉన్నప్పటికీ.... ఈ మధ్యకాలంలో అది మరి ఎక్కువవుతోంది.
undefined
వల్లభనేని వంశీ మీద విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా మండలి సమావేశాలప్పుడు, రాజ్యసభ ఎన్నికలప్పుడు అది ఏ స్థాయిలో సాగిందో మనమందరము చూసాము కూడా. వాస్తవానికి జగన్ రాజీనామా చేసివస్తేనే పార్టీలోకి తీసుకుంటాను అన్న మాటను ఇక్కడ అందరూ గుర్తు చేస్తూ.... రఘురామకు ఈ ఐడియా ఇచ్చింది మీరే కదా అంటూ ఎద్దేవా కూడా చేస్తున్నారు.
undefined
అక్కడితో ఆగకుండా వైసీపీకి టీడీపీ వర్గాలు ఒక సవాల్ ని విసురుతున్నారు.డొక్కా మాణిక్య వరప్రసాదును అయితే ఎమ్మెల్సీగా కాబట్టి గెలిపించుకోవచ్చు అని రాజీనామా చేపించారు...కానీ ఎమ్మెల్యేల విషయంలో భయపడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.
undefined
ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ ఎలాగైనా తిరిగి ఎన్నికల్లో పోటీచేసి గెలవాలని యోచిస్తున్నారట. ఆయన కుదిరితే తనతోపాటు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలుగా మారిన కరణం బలరాం, మద్దాలి గిరిలను సైతం రాజీనామా చేపించి ఎన్నికల బరిలో నిలబెట్టాలి అని అనుకుంటున్నారట.
undefined
కానీ వీరు పోటీ చేసి ఎన్నికల్లో మరల గెలవడం అంత తేలికైన అంశం కాదు. వైసీపీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నపార్టీకి ఉపఎన్నికల్లో సహజంగానే ఒకింత అనుకూలత ఉంది. ఎన్నికలకు ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి తేలికగా గెలవచ్చు అని అనుకుంటున్నారట రెబెల్ ఎమ్మెల్యేలు.
undefined
కానీ వీరి గెలుపు అంత తేలికైన పని కాదు. వల్లభనేని వంశి విషయానికి వస్తే..... ఆయనది గన్నవరం నియోజకవర్గం. విజయవాడను ఆనుకొని ఉండే ప్రాంతం. జగన్ గాలిని కూడా తట్టుకొని అక్కడ వల్లభనేని గెలిచారంటే కొంతలో కొంత టీడీపీ క్యాడర్ బలంగానే ఉన్నట్టు.
undefined
ఇక దానితోపాటు అతనికి గత ఎన్నికల్లో ప్రత్యర్థి యార్లగడ్డ. యార్లగడ్డ వంశీకి బలమైన పోటీ ఇచ్చాడు. కేవలం 800 ఓట్ల పైచిలుకు స్వల్ప తేడాతో మాత్రమే ఓడిపోయారు. ఇప్పుడు వంశి అక్కడకు గనుక వైసీపీ తరుఫున బరిలో దిగితే యార్లగడ్డ వర్గం ఎంతమేర ఆయనకు మద్దతిస్తుందనేది వేచి చూడాల్సిన అంశం.
undefined
ఇక అసలైన అంశం రాజధాని. మూడు రాజధానుల ఏర్పాటు వల్ల గన్నవరం ప్రాంతంలోని ప్రజలు ఒకింత అసహనంతో ఉన్నారనే మాటయితే వాస్తవం. ఆ ఫాక్టర్ ఎన్నికల్లో బలంగా పనిచేసే ఆస్కారం కూడా ఉంది.
undefined
మద్దాలి గిరి పరిస్థితి సైతం కూడా ఇంచు మించు ఇలాగే ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి బలం ఎక్కువ. ఫ్యాన్ గాలిని తట్టుకొని మద్దాలి గిరి అక్కడ దాదాపుగా 18 వేల మెజారిటీతో గెలిచారు. 2009 లో రాజశేఖర్ రెడ్డి ప్రభంజనంలో కూడా అక్కడి నుండి కన్నా కేవలం 3వేల మెజారిటీతో మాత్రమే గెలిచారు.
undefined
అక్కడ సైతం వైసీపీని నమ్ముకొని ఉన్నవారు చాలామందే ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీచేసిన ఏసురత్నం అక్కడ బలమైన ప్రత్యర్థిగా నిలదొక్కుకునే ప్రయత్నమే చేస్తున్నారు. 2014లో పోటీచేసి ఓటమి చెందిన అప్పిరెడ్డి సైతం అక్కడ పునాదులు వేసుకుంటున్నారు. ఈ సమయంలో అక్కడ మద్దాలి గిరికి ఎంతమేర అందరూ మద్దతిస్తారు అనేది వేచి చూడాల్సిన అంశం. రాజధాని అంశం ఎలాగూ ఉండనే ఉంది.
undefined
ఇక కరణం బలరాం విషయానికి వస్తే చీరాలలో కరణం వర్గానికి ఆమంచి వర్గానికి పడదన్నవిషయం అందరికి తెలుసు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి బలరాం పోటీ చేస్తే వైసీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేసారు. 2019 ఎన్నికల్లో బలరాం అక్కడ గెలుపొందారు. ఈ తరుణంలో అక్కడ టికెట్ మరల బలరాం కి ఇస్తే ఆమంచి వర్గీయులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
undefined
నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ పరిధిలోని కొందరి అధికారుల పరిపాలనా పరమైన బాధ్యతల కేటాయింపులలో మార్పులు జరిగాయి. మార్పులు జరగడం సహజమే కదా అని అనిపించొచ్చు. కానీ... అన్ని తామై ఇన్నిరోజులు సీఎంఓ లో చక్రం తిప్పినవారు ఇప్పుడు ఒక్కసారిగా తమ అధికారాలను కోల్పోయినట్టయింది. వారికి కేటాయించిన శాఖలన్నీ వేరేవారికి బదిలీ అయిపోయాయి.
undefined
ఇక ఆ తరువాత మళ్లీ యథాప్రకారంగా నాకు విప్ ఇచ్చేన్తా మొగుడా అంటూ విరుచుకుపడ్డారు. వీరంతా పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా, పార్టీలోనే ఉంటూ సొంతపార్టీపై విరుచుకుపడుతున్నారు.
undefined
click me!