వైఎస్, ఎన్టీఆర్ వారసత్వాలు: జగన్ పాస్, చంద్రబాబు ఫెయిల్

First Published | Jul 8, 2020, 4:09 PM IST

రాజకీయ కారణాలు ఏమైనప్పటికి.... రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని ఫాలో అవుతున్నాను అని చెప్పుకుంటూ రాజశేఖర్ రెడ్డి బొమ్మను వాడుకోవడంలో జగన్ పూర్తిగా సఫలీకృతుడయ్యాడు. కానీ ఎన్టీఆర్ బొమ్మను వాడుకోవడంలో కానీ, ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవడంలో కానీ చంద్రబాబు విఫలమయ్యారు. 

మహానేత రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు నేడు. జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి ఆయనను రాజశేఖర్ రెడ్డి వారసుడిగానే చూస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నప్పటికీ.... ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాను అన్నట్టుగా పథకాలకు రాజశేఖర్ రెడ్డి నామకరణం నుండి మొదలు ఆయన ప్రారంభించిన అన్నిటిని కొనసాగిస్తున్నారు.
undefined
ఈ సందర్భంగా ఒకసారి రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని జగన్ మోహన్ రెడ్డి ఎలా కొనసాగిస్తున్నారు అని పోల్చి చూస్తున్నారు. ఆయన జన్మదినోత్సవం నాడు ఆ మహా నేత ప్రారంభించిన కార్యక్రమాలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని వాటిని జగన్ ఎలా కొనసాగిస్తున్నాడో చూద్దాం.
undefined

Latest Videos


మొదటగా రాజశేఖర్ రెడ్డి అంటేనే మనకు ముందు గుర్తొచ్చేది ఆయన పాదయాత్ర. ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను వింటూ ఆయన జరిపిన పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేలా చేసింది.
undefined
జగన్ సైతం అదే ఫార్ములాను పాటించాడు. ప్రజల మధ్య ఉంటూ ముందుకెళ్లాడు. తొలిసారి అధికారం చేజిక్కకపోవడంతో ప్రజల మధ్య ఉండడమే మార్గమని అసెంబ్లీని వదిలేసి ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. అఖండ మెజారిటీతో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు.
undefined
సంక్షేమ పథకాల విషయంలో కూడా జగన్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. రెండు రూపాయలకే కిలో బియ్యం నుండి మొదలు ప్రజల ప్రాణాలను కాపాడే ఆరోగ్యశ్రీ వరకు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు రాజశేఖర్ రెడ్డి. ఫీజు రీ ఎంబర్సుమెంట్ ను కల్పించడం ద్వారా ఎందరో పేద విద్యార్థులకు కల అయినా ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులను ఉచితంగా చదువుకునేలా చేసాడు.
undefined
జగన్ సైతం తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ సంక్షేమానికి పెద్దపీట వేసాడు. నవరత్నాల పేరిట రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. పెన్షన్లు, విద్య వైద్యం, ఆరోగ్యం, అన్ని రంగాల్లోనూ సంక్షేమ పథకాలను ప్రారంభించాడు. ఆ ఫలాలను పేదలకు ఖచ్చితంగా చేరేలా కూడా జాగ్రత్త పడుతున్నాడు.
undefined
జగన్, రాజశేఖర్ రెడ్డి ని అన్ని విషయాల్లో ఫాలో అయినప్పటికీ... ఒక విషయంలో మాత్రం రాజశేఖర్ రెడ్డి పాలసీనిఫాలో అవలేదు అనిపిస్తుంది. హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం, ఎక్స్ ప్రెస్ వే అన్ని చంద్రబాబు హయాంలోనే శంకుస్థాపన చేయడం జరిగింది.
undefined
రాజశేఖర్ రెడ్డి వాటిని వదిలేయకుండా పూర్తిచేసాడు. పూర్తి చేసినప్పటికీ... ఆ క్రెడిట్ మాత్రం చంద్రబాబుకు రాకుండా జాగ్రత్తపడ్డాడు. అన్నిటికి కాంగ్రెస్ వారి పేర్లను పెట్టి రాజశేఖర్ రెడ్డి అభివృద్ధిని సాగనిస్తునే చంద్రబాబుకు క్రెడిట్ దక్కకుండా చేయడంలో సఫలీకృతుడయ్యాడు.
undefined
జగన్ మాత్రం అమరావతి విషయంలో రాజశేఖర్ రెడ్డి లెగసీని ఫాలో అయినట్టుగా మాత్రం అనిపించదు. ఈ విషయాన్నీ అటుంచినా... జగనా మాత్రం రాజశేఖర్ రెడ్డి మీద పూర్తి పేటెంట్ హక్కులు తనవే అన్నట్టుగా దక్కించుకోగలిగాడు.
undefined
ఇంకోపక్క చంద్రబాబు మాత్రం ఆ విషయంలో వెనుకబడ్డట్టుగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారి లెగసీని పూర్తి స్థాయిలో చంద్రబాబు ఫాలో అవలేకపోయినట్టుగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ సైతం పూర్తి స్థాయిలో సంక్షేమానికి పెద్దపీట వేస్తే.... చంద్రబాబు మాత్రం దానికి తిలోదకాలు ఇచ్చారు. అదే ఆయనకు 2004లో అధికారాన్ని దూరం చేసింది. 2019లో సంక్షేమ పథకాల మంత్రాన్ని జపించినప్పటికీ... ప్రజలు నమ్మలేదు.
undefined
మరో అంశం కాంగ్రెస్ తో పొత్తు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడ్డ టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంపై తీవ్రమైన విమర్శలు సైతం వచ్చాయి. అలా అంటే... రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ వాది. కాంగ్రస్ కి వ్యతిరేకంగానే జగన్ పార్టీని ఏర్పాటు చేసాడు. ఎవరి రాజకీయ కారణాలు వారివి.రాజకీయ కారణాలు ఏమైనప్పటికి.... రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని ఫాలో అవుతున్నాను అని చెప్పుకుంటూ రాజశేఖర్ రెడ్డి బొమ్మను వాడుకోవడంలో జగన్ పూర్తిగా సఫలీకృతుడయ్యాడు. మరోపక్క ఎన్టీఆర్ బొమ్మను వాడుకోవడంలో కానీ, ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవడంలోకానీ చంద్రబాబు విఫలమయ్యారు.
undefined
చంద్రబాబు విఫలమయ్యారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉండడం. హరికృష్ణ కూతురు సుహాసిని ఎన్నికల్లో నిలబడితే కూడా తారక్ ప్రచారానికి రాలేదు. బాలకృష్ణ మినహా వేరే కుటుంబసభ్యులెవ్వరు ఇప్పుడు చంద్రబాబుకు తోడుగా ఉన్నట్టు కనబడం కూడా లేదు.
undefined
click me!