కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక ప్రధాన సమస్య. మందు లేదు, వాక్సిన్ ఇంకా రాలేదు.... ఏం చేయాలో అర్థం కానిప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించేశాయి.లాక్ డౌన్ వల్ల ఈ కరోనా వైరస్ వ్యాప్తిని ఒకింత వాయిదావేశారేతప్ప.... ఈ లాక్ డౌన్ ద్వారా ఈ కరోనా వైరస్ ని పూర్తిగా అడ్డుకోలేకపోయారు. లాక్ డౌన్ అసలు విధించకుండా ఉంటే... పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయేది. కానీ... ఈ కరోనా వైరస్ కి లాక్ డౌన్ మందు కాదనే విషయం ఖచ్చితంగా అర్థమైపోయింది.
undefined
ఇలా లాక్ డౌన్ విధించడం వల్ల కలిగిన లాభం ఏదైనా ఉందిఅంటే... అది ప్రజలను ఈ కరోనావైరస్ పట్ల చైతన్యవంతులను చేయడం(వైన్ షాపుల దగ్గర ఆ క్యూ లైన్లు ఏమిటి అనే వాదన ఇక్కడ అప్రస్తుతం).చాలా వరకు ప్రజలు మాస్కులను ధరిస్తున్నారు.అవసరాముంటేనే బయటకు వెళ్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా భౌతిక దూరం పాటిస్తున్నారు. ప్రజలు కూడా ఈ విషయంలో చైతన్యవంతులయ్యేరు అని చెప్పక తప్పదు. ప్రజలు ఈ కరోనా వైరస్ ను లైట్ గా మాత్రం తీసుకోవడం లేదు.
undefined
ఇక ఇలా లాక్ డౌన్ ను విధించడం వల్ల దేశం సరాసరిన రోజుకిదాదాపుగా 35 వేల కోట్ల రూపాయలను నష్టపోతుంది. డబ్బున్న అగ్ర రాజ్యాలే ఈ లాక్ డౌన్ ని నెలల పాటు కొనసాగించలేకపోతున్నాయి. అమెరికాలో నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య దాదాపుగా పదింతలు పెరిగిందంటేనే... ఆర్ధిక వ్యవస్థపైఈ మహమ్మారిప్రభావం ఏ స్థాయిలోఉందొ మనం అర్థం చేసుకోవచ్చు.
undefined
అన్ని దేశాలు కూడా వేరే మార్గం లేక ఈ లాక్ డౌన్ దిశగా పయనించాయి. ఎప్పుడైతే ఈ లాక్ డౌన్ అంతిమ పరిష్కారం కాదు వాక్సిన్ వచ్చే వరకు ఇది సమాజంలోఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుందనే విషయం అర్థమయ్యిందో అన్ని దేశాలు కూడా అటకెక్కిన తమ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రంగంలోకిదిగాయి.
undefined
ధనిక దేశాలు, అగ్ర రాజ్యాల పరిస్థితే ఇలాగుంటే.... అభివృద్ధి చెందుతున్న మన పరిస్థితి మరి దారుణంగా ఉంది, రెక్కాడితే కానీ డొక్కాడని ఎందరో ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోయారు. ఒక సర్వే ప్రకారం ఈ లాక్డౌన్ లో 90 శాతం మంది వలసకూలీలకు తినడానికి మూడుపూటలాతిండికూడా దొరకడం లేదు.
undefined
ఇక లాక్ డౌన్ వల్ల ఎన్నో పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోయింది. ప్రజల వద్ద డబ్బులేదు. రానున్న రోజుల్లో ప్రజల కొనుగోలు శక్తి మరింతగా పడిపోయి డిమాండ్ తగ్గితే.... ఎన్నో పరిశ్రమలు తమ ఉద్యోగులను తొలగిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పుడు మధ్యతరగతి వారు కూడా ఇబ్బందులు పడడం మొదలు పెడతారు. ఇప్పటికే ఆ ఛాయలు మనకు కనబడుతున్నాయి కూడా.
undefined
ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో ఆర్ధికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకుమనం ఉత్పత్తిని ఆరంభించాలి. ప్రజలు పనుల కోసం బయటకు వెళ్ళాలి. పనులు చేసుకోవడం మొదలు పెట్టాలి. కరోనా వైరస్ ఉంది, నిజమే! కానీ ఇంట్లోనే కూర్చున్నంతమాత్రానకరోనా వైరస్ అయితే మాయం అయిపోదు కదా!
undefined
ఆ వైరస్ కనీసం ఇంకో సంవత్సరం పాటు ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల బ్రతికే ఉంటుంది. టీకా వచ్చే వరకుఈ కరోనా వైరస్ కి అంతం లేదు. అంతవరకు ఈ వైరస్ తో మనం సహజీవనం చేయక తప్పదు. అదే విషయాన్నీఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.ఆయన ఆ విషయం అనగానేప్రతిపక్షాలు ఆయనమీదతీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాయి. కరోనా ఉన్నప్పటికీ... రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేస్తాను అంటున్నాడు అంటూ తీవ్ర స్థాయిలోవిరుచుకుపడ్డారు.
undefined
కానీ ఇప్పుడు జగన్ అన్న మాటనే అన్ని రాష్ట్రాలు జపిస్తున్నాయి, తెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, తెలంగాణరాష్ట్రఐటీశాఖామంత్రి కేటీఆర్ కూడా మనం ఈ కరోనా వైరస్ తో సహజీవనం చేయక తప్పదు అని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా కరోనా వైరస్ తోపాటుగానే ప్రజలు బ్రతకడం అలవాటు చేసుకోవాలని అన్నారు.
undefined
ప్రపంచ దేశాలన్నీ కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఈ కరోనా లాక్ డౌన్ ను గనుక ఇంకొన్ని రోజులు పొడిగిస్తే.... ఈ కరోనా వైరస్ కన్నా ఆకలితో చనిపోయేవారు సంఖ్యే ఎక్కువగా ఉంటుంది.
undefined
ఈ అన్ని విషయాలను అర్థం చేసుకొని, పరిస్థితులను బేరీజు వేసుకున్న తరువాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ మాటలను మాట్లాడారు. ఇదే విషయాన్నీ ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాలు అంటున్నాయి. అదే బాటలో పయనిస్తున్నాయి కూడా. కేంద్రం మూడవదఫా విధించిన లాక్ డౌన్ లో ఇన్ని సడలింపులు ఇవ్వడానికికారణం కూడా ఇదే కదా!
undefined