తెలంగాణ మినహా దేశమంతా తెరుచుకున్న మద్యం షాపులు, మరి కేసీఆర్ నిర్ణయం...?

First Published May 4, 2020, 11:23 AM IST

జోన్ల వారీగా కేంద్రం కొన్ని లాక్ డౌన్ సడలింపులు ఇచ్చింది. ఈ అన్ని సడలింపుల్లోకెల్లా అందరి దృష్టి పడింది మాత్రం మద్యానికిచ్చిన అనుమతులపైన్నే! నేటి నుంచి మద్యం దుకాణాలు ఒక్క తెలంగాణాలో తప్ప అన్ని ప్రాంతాల్లో తెరుచుకోనున్నాయి. 

దేశమంతా విధించిన రెండవ దఫా లాక్ డౌన్ నిన్న మే 3వ తేదీతో ముగిసింది. నేటి నుంచి మూడవ దఫా లాక్ డౌన్ మే 17 వరకు అమలవనున్న విషయం తెలిసిందే. ఈ దఫా లాక్ డౌన్ లో మనకు భారీస్థాయిలో సడలింపులు దక్కాయి.
undefined
జోన్ల వారీగా కేంద్రం కొన్ని లాక్ డౌన్సడలింపులు ఇచ్చింది. ఈ అన్ని సడలింపుల్లోకెల్లా అందరి దృష్టి పడింది మాత్రం మద్యానికిచ్చిన అనుమతులపైన్నే! నేటి నుంచి మద్యం దుకాణాలుఒక్క తెలంగాణాలో తప్ప అన్ని ప్రాంతాల్లో తెరుచుకోనున్నాయి.
undefined
మన తెలంగాణాలో మాత్రం మే 7వ తేదీవరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలోఇక్కడ కనీసం మరో మూడు రోజులపాటు మాత్రం సంపూర్ణ లాక్ డౌన్, ఎటువంటి మినహాయింపులు లేకుండా కొనసాగనుంది.ఇక ఆ తరువాత పరిస్థితి ఏమిటనే విషయం కేసీఆర్కి మాత్రమే తెలియాలి. కేసీఆర్నిర్ణయం మీద తెలంగాణలోని మందుబాబుల ఆశలన్నీఆధారపడి ఉన్నాయి. తెలంగాణాలో మే 7 తరువాత కేసీఆర్ ఏ నిర్ణ్యం తీసుకోబోతున్నాడు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
undefined
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మాత్రం తెలంగాణాలో బీర్ల ఉత్పత్తికిడిస్టిలరీలకు అనుమతులను ఇచ్చినట్టు తెలియవస్తుంది. ఒక్కసారిగా బీర్ల ఉత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చిందనగానే... మందుబాబులంతా పండగ చేసుకుంటున్నారు.
undefined
తెలంగాణదాదాపుగా నెలకు 95 శాతం ఆదాయాన్ని కోల్పోతుంది. లాక్ డౌన్ కొనసాగబట్టిదాదాపుగా 45 రోజులవుతుంది. ముగిసేనాటికి47 రోజులవుతుంది. రాష్ట్రాన్ని నడిపించడానికి అప్పుల మార్గంలోనే పయనిస్తోంది ప్రభుత్వం. కాబట్టి ఆదాయ మార్గాలను తెరిచే దిశగాకేసీఆర్ సర్కార్అడుగులు వేసే ఆస్కారమే ఎక్కువగా కనబడుతుంది.
undefined
కానీ ఇలా మద్యం షాపులను తెరిస్తే... కరోనా వైరస్ పెచ్చు మీరే ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం కేసీఆర్ప్రజారోగ్యానికి మాత్రమే పెద్దపీటవేస్తారు. ఆ పరిస్థితుల్లో లాక్ డౌన్ ను మాత్రం కొనసాగించవచ్చు.
undefined
దానికి తోడుగా రంజాన్ మాసం. బయట దుకాణాలను తెరిస్తే... ఉన్నపళంగా ప్రజలు షాపింగ్ అని బయటకు వస్తే... అది ఏ జోన్ అయినా కూడా ప్రమాదమే ఉంటుంది. ఇంత కఠినంగా లాక్ డౌన్ అమలవుతుంటేనే, చాలావరకు ప్రజలు స్వచ్చంధంగా ఇండ్లలో ఉంటేనే లాక్ డౌన్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి.
undefined
ఇక అనుమతులిస్తే... అంతమంది ప్రజలను కట్టడి చేయడం, లాక్ డౌన్ మార్గదర్శకాలను పాటించేలా చేయడం, పోలీసులకు తలకు మించిన భారమే అవుతుంది. దానికితోడుగా ప్రజల్లో ఇన్ని రోజులుగా కట్టేశామన్న భావన కూడా నెలకొంది. ఇంకా కేసులు కూడా నమోదవుతూనే ఉన్నాయి. ఇవన్నీ వెరసి కరోనా మహమ్మారి మరల విజృంభించే ప్రమాదం కూడా లేకపోలేదు.
undefined
కేంద్రం విధించిన లాక్ డౌన్ మే 17తో ముగుస్తుంది. కేసీఆర్విధించిన లాక్ డౌన్ మే 7వ తేదీతో ముగుస్తుంది. ఇంకొక్క పది రోజులే కదా, అప్పటికే కొంప మునిగిపోయేదేమీలేదు, మిగిలిన రాష్ట్రాల్లోని పరిస్థితులు ఎలా ఉన్నాయో బేరీజు వేసుకొని అప్పుడు ముందుకు పోదము అనుకున్నాఆశ్చర్యపోనక్కర్లేదు!
undefined
మరి మద్యం ఉత్పత్తికి ఇచ్చిన అనుమతులూ... అంటే... బీర్ ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది. పది రోజుల్లో ఒరిగేదేమీ లేదు కదా! ఈ ఉత్పత్తికయితే అనుమతులిచ్చారు కానీ అమ్ముకోవడానికి అనుమతులు ఎప్పటినుంచి అన్న విషయం మాత్రం రేపు 5వతేది కేసీఆర్ సర్ పేస్ మీట్ తరువాతే!
undefined
click me!