మద్యం షాపులు ఓపెన్: వైఎస్ జగన్ రాజకీయం ఇదీ...

First Published May 4, 2020, 8:27 AM IST

మద్యం షాపులను తెరవడానికి కేంద్రం అనుమతులిచ్చిన తరువాత, దేశంలో ఏ ఇతర రాష్ట్రం మీద కూడా లేని ఫోకస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉంది. నవరత్నాల్లో భాగంగా పూర్తి మధ్య నిషేధం మా లక్ష్యం అని, దాన్ని దశలవారీగా సాధిస్తామని చెప్పింది వైసీపీ సర్కార్. అందుకు మొదటి అడుగుగా దశలవారీగా మద్యం షాపులను తగ్గిస్తామని చెప్పారు, చేసి చూపించారు  ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు. 

రెండవ దఫా విధించిన లాక్ డౌన్ కూడా నిన్నటితో ముగిసింది. నేటి నుండి కేంద్రం విధించిన నూతన మార్గదర్శకాలతో మూడవదఫా లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ మూడవ దఫా లాక్ డౌన్ లో భారీ స్థాయిలోనే సడలింపులు దక్కాయని చెప్పకనైతే తప్పదు.ఈ సారి విధించిన సడలింపుల్లో అందరూ కూడా ఎక్కువ ఆతృత చూపెట్టింది మద్యం షాపుల అనుమతులకు సంబంధించి. జీఎస్టీ పుణ్యమాని రాష్ట్రాలకు వచ్చే పన్నులకు భారీ స్థాయిలో గండి పడింది. కేంద్రం కూడా చెల్లింపులను పూర్తిస్థాయిలో రాష్ట్రాలకు చేయలేదు.
undefined
లాక్ డౌన్ వల్ల రోడ్ల మీద బండ్లు తిరగడం ఆగిపోవడంతో... పెట్రోల్, డీజిల్ మీద వచ్చే సుంకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలోకోల్పోయాయి. ఈ నేపథ్యంలో వేరే మార్గం లేక, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం షాపులను తెరుచుకోవడానికి అనుమతులివ్వమని కేంద్రాన్ని కోరాయి.ఇందుకు సంబంధించి కేంద్రం కూడా మద్యం షాపులను తెరవడానికి అనుమతులిచ్చింది. బార్లు, పబ్బులు మినహా ఇతర లిక్కర్ షాపులను తెరుచుకోవడానికి అనుమతులిచ్చింది. కాకపోతే షాపుల వద్ద భౌతిక దూరాన్నిపాటిస్తూ... షాపు వద్ద ఒకేసారి అయిదుగురు కన్నా ఎక్కువ మంది ఉండకుండా అమ్మకాలు జరుపుకోవాలని ఆదేశాలిచ్చింది.
undefined
ఈ ఆదేశాల నేపథ్యంలోడబ్బుల్లేక ఖాళీ ఖజానాలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం షాపులు తెరవడానికి అనుమతులిచ్చాయి. నేటి ఉదయం మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. మందుబాబులు ఇప్పటికే మద్యం షాపుల దగ్గర పూజలు కూడా నిర్వహించారు.
undefined
ఇకపోతే...మద్యం షాపులను తెరవడానికి కేంద్రం అనుమతులిచ్చిన తరువాత,దేశంలో ఏ ఇతర రాష్ట్రం మీద కూడా లేని ఫోకస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉంది. నవరత్నాల్లో భాగంగాపూర్తి మధ్య నిషేధం మా లక్ష్యం అని, దాన్ని దశలవారీగా సాధిస్తామని చెప్పిందివైసీపీ సర్కార్. అందుకు మొదటి అడుగుగాదశలవారీగా మద్యం షాపులనుతగ్గిస్తామని చెప్పారు, చేసి చూపించారుఏపీ సీఎంజగన్ మోహన్ రెడ్డి గారు.
undefined
మద్యం షాపులను కూడా ప్రభుత్వమే నడిపేలా ఏర్పాట్లు చేసారు కూడా. అలా మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేశారు. ఒకేసారి మద్యం షాపులనుఎత్తేయొచ్చుకదా అంటే.... ప్రజలు ఒకే సారి మద్యాన్ని మానేస్తేవారికి మానసికంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఆల్కహాల్ విత్ డ్రాయల్సింప్టమ్స్వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు కాబట్టి దశల వారీగామద్యపాననిషేధం అమలు చేస్తున్నట్టుగా చెప్పారు.
undefined
చెప్పినట్టుగానే మద్యం షాపుల సంఖ్యను తగ్గించారు. షాపులు తెరిచి ఉంచే సమయం తగ్గించారు. మద్యం రేట్లను కూడా భారీస్థాయిలో పెంచారు. ఈ అన్ని చర్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసాయి, అన్ని రకాల మద్యం అందుబాటులో ఉండట్లేదని జే టాక్స్కట్టిన మద్యం బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయంటూ రకరకాలఆరోపణలు చేసారు.
undefined
ఇవన్నీ పక్కనపెడితే... ఇప్పుడు మద్యం షాపులను నడుపుతుంది కేవలం ప్రభుత్వమే. కాబట్టి మద్యం అమ్మకాలు ఆపేసి దాదాపుగా 40 రోజులయింది. మందుబాబులు మద్యం దొరక్కతొలిదశలో ఇబ్బందులు పడ్డప్పటికీ.... వారిలో చాలామంది ఇప్పటికే ఆల్కహాల్ విత్ డ్రాయల్సింప్టమ్స్నుంచి బయటపడి ఉంటారు.
undefined
సాధారణంగామద్యం దొరక్కమందుబాబులు వింతగా ప్రవర్తించడం తొలి రెండు వారాల్లో అధికంగా ఉంటుంది. స్టేజి1, స్టేజ్2 లలోఈ లక్షణాలు అధికంగా ఉంటాయి. మనిషి వింతవింతగా, పిచ్చిగా ప్రవర్తించడం కూడా జరుగుతుంది. కానీ ఇప్పటికేదాదాపుగా ఆరువారాలయిపోయింది. చాలామంది ఈ ఆల్కహాల్ విత్ డ్రాయల్సింప్టమ్స్ నుంచి బయటపడిపోయారు.
undefined
ఇప్పుడు వారు ఆ మద్యానికి బానిసలుగా బ్రతికే బ్రతుకుల నుంచి బయటకు వచ్చారు. జగన్ మోహన్ రెడ్డిగారు మద్యపాన నిషేధం అనే మాట అన్నదే... ప్రజల కుటుంబాలు ఈ మద్యం వల్ల నాశనమవ్వకూడదు అన్న ప్రధాన ఉద్దేశంతో!ప్రజలు మద్యానికి బానిసలై, వారి సంపాదనంతా మద్యం మీద తగలేస్తుండడంతోపాటుగా,కుటుంబ కలహాలు, గృహ హింస ఇలాంటివి ఎక్కువవుతున్నాయని. ఇప్పుడు మద్యం దొరకడంలేదు అనే ఒక నిర్ణయానికి వచ్చిన వాడికి మరల మద్యం అందుబాటులోకి తెస్తే వాడిని మరల మద్యానికి బానిసను చేయడంకాదా?
undefined
అంతే కాకుండా జగన్ సర్కార్ మద్యం షాపులనుఆదాయ మార్గాలుగా చూడకూడదు అని అన్నారు. అందుకోసమే మద్యపాన నిషేధం అని అన్నారు. ఇప్పుడు మరల మద్యం షాపులను తెరవడం ఎంతవరకు సబబు?కేంద్రమే చెప్పింది కదా అని అనొచ్చు, ఇతర రాష్ట్రాలు కూడా తీరుస్తున్నాయి కదా అనే వాదన కూడా తెర మీదకు తీసుకురావచ్చు. కానీ మిగిలిన రాష్ట్రాలు మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పలేదు కదా! మద్యపాన నిషేధం అమల్లో ఉన్న గుజరాత్, బీహార్ రాష్ట్రాలు ఇదే సందు అని మద్యం షాపులకుఅనుమతులు ఇవ్వలేదుకదా!
undefined
ఒక ఉన్నతమైన లక్ష్యంతో రాష్ట్రం సుభిక్షంగా, సుఖ సంతోషాలతో, కాపురాలన్నీ పచ్చగా ఉండాలన్నసర్వోత్క్రుష్టమైనఆలోచనతోపాలనను ఆరంభించిన శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇలా మద్యం షాపులను తెరవడం మరల ప్రజలను మద్యం వైపుగా పురికొల్పడమే అవుతుంది.కొన్ని సంవత్సరాల కిందనే మద్యపాన నిషేధం విధించిన బీహార్ దాన్ని విజయవంతంగా అమలు చేస్తూనే ఉంది. మన ఆంధ్రప్రదేశ్కూడా ఆ దిశగా పయనించిఉంటే...బాగుండేది!
undefined
ఎలాగూ ఇప్పుడు కరోనా వైరస్ పుణ్యమానిఆరోగ్యం మీద ప్రజలకు బాగా అవగాహన పెరిగింది. ఆసుపత్రుల్లో సదుపాయాలు కూడా మెరుగయ్యాయి. ఈ పెరిగిన మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని ఈ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసుంటే బాగుండేది.
undefined
ఇక్కడ ప్రభుత్వం ఒక వాదనను తెరపైకి తీసుకురావొచ్చు. మద్యం రేట్లను 20 నుంచి 25 శాతం పెంచాము, కాబట్టి మద్యం తాగేవారిసంఖ్య తగ్గుతుంది అని. కానీ మద్యం తాగాలనుకున్నవాడు ఏం చేసైనా ఆ మద్యం తాగుతాడు.ఆ మద్యానికి బానిసలైన వారు భార్యల మెడలోని తాళిని కూడా తాకట్టు పెట్టడానికి వెనకాడరు. అది వారి దౌర్భాగ్యం. దీనివల్ల మరింతగా గృహ హింస పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
undefined
ఇక ప్రభుత్వం ఈ కరోనా సమయంలో చేతికి ఇస్తున్న డబ్బును కూడా పూర్తిగా మద్యం మీదనే ఖర్చుపెట్టే ఆస్కారం కూడా లేకపోలేదు. ఇప్పుడు కంటైన్మెంట్ జోన్లలో మినహా అన్ని చోట్లా మద్యం షాపులను తెరిచారు. ఈ కరోనా కాలంలో, కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఈ వైన్ షాపుల వల్ల ఆ మహమ్మారి మరింతగా విజృంభించే ఆస్కారం కూడా లేకపోలేదు!
undefined
click me!