TVK అద్భుత విజయంతో విజయ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమైంది… మరి డిప్యూటీ సీఎం ఎవరు..? అనే చర్చ అభిమానులు, చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. త్రిషకు ఆ ఛాయిస్ ఏమైనా ఉందా..?
Tamilnadu Assembly Election Results 2026 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ విజయం రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరిచింది. దశాబ్దాలుగా తమిళ రాజకీయాల్లో పాతుకుపోయిన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలను TVK (తమిళగ వెట్రి కళగం) వెనక్కి నెట్టింది. ఈ ఫలితాలతో తమిళనాడు ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పరిణామాల మధ్య హీరోయిన త్రిష రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారా..? ఇన్నాళ్లూ తెరవెనుకే ఉన్న ఆమె ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా..? అనే చర్చ జోరుగా సాగుతోంది.
25
త్రిష పోటీచేసేది ఇక్కడేనా..?
దళపతి విజయ్ చెన్నైలోని పెరంబూర్, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండింటిలోనూ గెలిచారు. నిబంధనల ప్రకారం… ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. విజయ్ రాజీనామాతో ఖాళీ అయ్యే స్థానం నుంచి త్రిష పోటీ చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది.
35
విజయ్ కేబినెట్ లో త్రిష..?
కొన్ని రిపోర్టుల ప్రకారం.. విజయ్ తిరుచ్చి తూర్పు ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ స్థానం నుంచి త్రిష పోటీ చేసి గెలిచి, విజయ్ ప్రభుత్వంలో మంత్రి లేదా డిప్యూటీ సీఎం పదవిని చేపట్టే అవకాశాలను కొట్టిపారేయలేం. మరోవైపు విజయ్ రాజీనామా చేసే స్థానం నుంచి ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ కూడా పోటీ చేయవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి.
విజయ్-త్రిష జోడీని ఇప్పుడు చాలామంది ఎంజీఆర్-జయలలిత జంటతో పోలుస్తున్నారు. అప్పట్లో ఎంజీఆర్ సీఎంగా ఉన్నప్పుడు, జయలలిత తెరవెనుక ఉండి ఆయనకు సపోర్ట్ గా నిలిచారు. ఎంజీఆర్ మరణం తర్వాత జయలలిత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యారు.
55
విజయ్ సీఎం కావడం పక్కా..!
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ ఏకంగా 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్ సీఎం పీఠాన్ని అధిరోహించడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ పెట్టి, పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే సీఎం అయిన సినీ స్టార్‌గా విజయ్ చరిత్ర సృష్టించబోతున్నారు.