అయోధ్య రామాలయం ప్రవేశ ద్వారం వద్ద సింహాలు, ఏనుగుల విగ్రహాలు..

First Published | Jan 5, 2024, 12:48 PM IST

రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్ ప్రాంతం నుంచి సేకరించిన ఇసుకరాయితో ఈ విగ్రహాలను తయారు చేశారు.

అయోధ్య : అయోధ్యలోని రామాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఏనుగులు, సింహాలు, హనుమంతుడు, 'గరుడ' విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ ట్రస్ట్ సీనియర్ అధికారి గురువారం తెలిపారు.

రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్ ప్రాంతం నుంచి సేకరించిన ఇసుకరాయితో ఈ విగ్రహాలను తయారు చేశారు. ఈ నిలువెత్తు విగ్రహాలు దేవాలయం గాంభీర్యాన్ని మరింతగా వన్నెతేలేలా చేస్తున్నాయి. 

Latest Videos


"దేవాలయంలోకి ప్రవేశం తూర్పు వైపు నుండి ఉంటుంది. దక్షిణం వైపు నుండి నిష్క్రమణ ఉంటుంది. మొత్తం ఆలయ నిర్మాణం మూడు అంతస్తులుగా ఉంటుంది. జీ ప్లస్ 2" అని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అంతకు ముందే తెలిపారు. 

సందర్శకులు తూర్పు వైపు నుండి 32 మెట్లు ఎక్కి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. గురువారం రామాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ ట్రస్ట్ సీనియర్ అధికారి తెలిపారు.
 

ఆలయానికి వెళ్లే మెట్లకు ఇరువైపులా అమర్చిన అంచెల పలకలపై ఈ విగ్రహాలు అమర్చబడ్డాయి. ట్రస్ట్ షేర్ చేసిన చిత్రాల ప్రకారం, దిగువ పలకలపై ఒక్కో ఏనుగు ప్రతిమ, రెండో స్థాయిలో ఒక్కో సింహం విగ్రహం, పైభాగంలో హనుమంతుడి విగ్రహం ఒకవైపు ఉండగా, 'గరుడ' విగ్రహం మరోవైపు ఉంది.

సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన ఆలయ సముదాయం 380 అడుగుల పొడవు (తూర్పు-పడమర దిశ), 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది.

ఆలయంలోని ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు మరియు 44 ద్వారాలు ఉంటాయి. అత్యంత సుందరంగా ఈ దేవాలయం రూపు దిద్దుకుంటోంది.

click me!