ఢిల్లీ అల్లర్లు : ఎవరీ దీప్ సిధు? రైతులతో సంబంధమేంటి..?

First Published Jan 27, 2021, 12:50 PM IST

ఢిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. కిసాన్ పరేడ్ లో అప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చిన రైతులు  ఎర్రకోటను ముట్టడించారు. చారిత్రక కట్టడంపై జెండా ఎగరేశారు. 

ఢిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. కిసాన్ పరేడ్ లో అప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చిన రైతులు ఎర్రకోటను ముట్టడించారు. చారిత్రక కట్టడంపై జెండా ఎగరేశారు.
undefined
అనుకోని ఈ ఘటనతో అల్లర్లు చెలరేగి దేశ రాజధాని అట్టుడికిపోయింది. అయితే ఇది తమ పనికాదని, విద్రోహ శక్తులు తమ ర్యాలీలో చేరి అల్లర్లు సృష్టించారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబీ నటుడు, గాయకుడు దీప్ సిధు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎర్రకోట ఉద్రిక్తతలకు దీప్ సిధునే కారణమని అధికారులు భావిస్తున్నారు. దీనిపై నోటిసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.
undefined
ఇంతకీ ఈ దీప్ సిధు ఎవరంటే.. పంజాబ్ కు చెందిన దీప్ సిధు ప్రముఖ గాయకుడు, పలు హిందీ, పంజాబీ సినిమాల్లో నటించారు. ముందు నుంచీ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్న సిధు రెండు రోజుల క్రితం మరోసారి ఢిల్లీకి వచ్చారు. అయితే సింఘు సరిహద్దుల్లో రైతుల ఆందోళనల్లో పాల్గొన్న సిధు రెచ్చగొట్టే ప్రసంగం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
undefined
తాజాగా మంగళవారం జరిగిన కిసాన్ పరేడ్ లోనూ సిధు పాల్గొన్నారు. ఎర్రకోట వద్ద రైతులు తమ జెండాలో పాటు సిక్కు జెండాలను ఎగరేసిన సమయంలో ఆయన అక్కడే ఉన్నారు.
undefined
ఈ నేపథ్యంలో మంగళవారం ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న పరిణామాలకు సిధునే కారణమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్రిక్తతలు జరిగేలా ఆయన రైతులను రెచ్చగొట్టారని మండిపడుతున్నారు.
undefined
మా ఉద్యమాన్ని కించపరిచేందుకు కొన్ని సంఘ విద్రోహశక్తులు చేరాయి. ఎర్రకోటపై జెండాలు ఎగరవేయాలనేది మా ప్రణాళికలో లేదు. ప్రధానితో దీప్ సిధు ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాకు ఆయనపై అనుమానాలున్నాయని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేత ఎస్ఎస్ పందేర్ అన్నారు.
undefined
భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘దీప్ సిధు సిక్కు కాదు. ఆయన బీజేపీ కార్యకర్త. ప్రధానితో ఆయన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
undefined
ఇది రైతుల ఉద్యమం. బారికేడ్లను ధ్వంసం చేయడం మా ఉద్యమంలో భాగం కాదు. అదంతా విద్రోహుల పని’’ అని ఆయన ఆరోపించారు. అయితే జరిగిన ఘటనలపై ఉద్యమంలో ఒక భాగస్వామిగా సిగ్గుపడుతున్నానని, వాటికి బాధ్యత వహిస్తానని తెలిపారు.
undefined
సిధును తాము ముందు నుంచి వ్యతిరేకిస్తున్నామని, ఘటన సమయంలో ఆయన ఎర్రకోట వద్దే ఉన్నారని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ ఓ టీవీ కార్యక్రమంలో తెలిపారు. ట్రాక్టర్ల ర్యాలీకి ముందు రోజు కూడా సిధు రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని, ఈ విషయంపై తాను పోలీసులకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆయన ఎర్రకోటకు ఎలా చేరుకున్నారో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
undefined
ఎర్రకోట ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అల్లర్లకు కారణంగా భావిస్తున్న సిధుకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఆందోళనకారులను ఎర్రకోటపైకి వెళ్లేందుకు ప్రోత్సహించడం, సామాజిక మాధ్యమాల్లో పంజాబీ యువకులను రెచ్చగొట్టేలా పోస్టులు చేసిన ఆరోపణలపై నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.
undefined
అయితే రైతుల ఆందోళన వ్యవహారంలో సిధుకు గతంలో చాలాసార్లు నోటీసులు జారీ అయ్యాయి. డిసెంబర్ లో ఈ నెల 16న నోటీసులు పంపినా ఆయన విచారణకు రాలేదు.ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలకు సిధు ఖండించారు.
undefined
ఎర్రకోట ఘటన జరిగిన కాసేపటి తర్వాత సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అంతమంది రైతులు ఎర్రకోట వెళ్లేలా నేనెలా ప్రోత్సహించగలను. ఉద్యమానికి నేను నాయకత్వం వహిస్తున్నట్లు ఉన్న ఒక్క వీడియో కూడా లేదు అన్నారు.
undefined
సినీ నేపథ్యం ఉన్న సిధు గత కొన్ని రోజులుగా రాజకీయాల్లో తిరుగుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, నటుడు సన్నీ డియోల్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మధ్య సొంతపార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎర్రకోట అల్లర్ల తర్వాత సిధు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
undefined
click me!