జాలరి పంట పండింది.. 55 కిలోల చేప పడింది.. వేలంలో రూ. 13 లక్షలకు విక్రయం

First Published Jun 27, 2022, 8:41 PM IST

పశ్చిమ బెంగాల్‌లోని ఓ జాలరికి 55 కిలోల చేప పడింది. అది కూడా ఔషధాలకు వినియోగించే తేలియా భోలా చేప పడింది. ఈ చేపను వేలం వేయగా.. ఓ కంపెనీ రూ. 13 లక్షలకు కొనుగోలు చేసింది.
 

telia bhola fish

telia bhola fish

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ దిఘా జిల్లాకు చెందిన ఓ జాలరి పంట పండింది. వేట కోసం సముద్రంలోకి వెళ్లిన వారికి అదిరిపోయే రేంజ్‌లో ఓ చేప పడింది. 55 కిలోల బరువు గల తేలియా భోలా చేప వలకు చిక్కింది. ఆ భారీ చేపను చేపల మార్కెట్‌కు తెచ్చి వేలం వేశాడు.  ఓ కంపెనీ భారీ మొత్తంలో పలికి కొనుగోలు చేసింది. ఆ 55 కిలోల తేలియా భోలా చేపను ఎస్‌ఎఫ్‌టీ కంపెనీ 13 లక్షలు చెల్లించి కొనుగోలు చేసింది.

దక్షిణ 24 పగరణాలకు చెందిన జాలరి శివాజీ కబీర్ ఎప్పటిలాగే చేపల వేటకు బయల్దేరాడు. కానీ, ఆ రోజు 55 కిలోల తేలియా భోలా చేప పడటంతో ఆయన పంట పండింది. 
 

telia bhola fish

దిఘా తీరంలో ఈ భారీ చేపను పట్టారు. దీన్ని ఆ తర్వాత వేలం వేయడానికి దిఘా ఫిష్ మార్కెట్‌కు తెచ్చారు. ఆ చేపను చూడటానికి జనాలు ఎగబడ్డారు. క్యూలో వచ్చి చూశారు. 

ఆ జాలరి 55 కిలోల తేలియా భోలా చేపకు వేలం నిర్వహించాడు. ఈ వేలంలో పాల్గొన్న ఎస్‌ఎఫ్‌టీ కంపెనీ చివరకు రూ. 13 లక్షలు చెల్లించి సొంతం చేసుకోవడానికి అంగీకరించింది.
 

telia bhola fish

స్థానిక జాలర్ల ప్రకారం,  ఆ తేలియా భోలా హైబ్రిడ్ చేప. మెడిసిన్స్‌లో ఈ చేప భాగాలు వినియోగిస్తారు. అందుకే ఈ చేపకకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. 

telia bhola fish

తేలియా భోలా చేపలు మూడు రకాలుగా ఉంటాయని వారు చెప్పారు. ఆడ చేప, మగ చేప, మూడో లింగంతోనూ ఈ చేపలు ఉంటాయని వివరించారు. మగ, ఆడ చేపల కంటే కూడా ఈ రెండు లింగాలతో లభించే తేలియా భోలా చేపలకే ఎక్కువ ధర ఉంటుందని వివరించారు. 

telia bhola fish

తేలియా భోలా చేప పొట్టలోని బ్లాడర్ ముఖ్యంగా మెడిసిన్స్ కోసం వాడుతుంటారని, ఆ మూడో లింగం చేపల్లో ఈ బ్లాడర్ పెద్దగా లభిస్తుంది. కాబట్టి, వాటికి ఎక్కువ ధర ఉంటుంది. ఆడ చేపల్లో గుడ్లు కూడా ఉండటం మూలంగా బ్లాడర్ చిన్నగా ఉంటుందని స్థానికులు చెప్పారు. 

తాజాగా, వేలం వేసిన చేప ఆడ చేప. ఆ 55 కిలోల్లో 5 కిలోలు గుడ్లే ఉన్నాయని వివరించారు. ఇటీవలే 30 కిలోల మగ తేలియా భోలా చేపను రూ. 9 లక్షలకు అమ్మారు.

click me!