ఉసేన్ బోల్ట్ రికార్డును బ్రేక్ చేసిన కన్నడ రైతు

First Published Feb 15, 2020, 10:42 AM IST

శ్రీనివాస గౌడ కూడా దున్నపోతు సహా పరిగెత్తాడు.  142.4 మీటర్ల దూరం పరుగును దున్నలతో కలిసి శ్రీనివాస గౌడ 13.42 సెకన్లలో పూర్తి చేశారు. ఈలెక్కన ఇతను 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పరుగెత్తినట్లు, ఉసేన్ బోల్ట్ కంటే 0.3 సెకన్ల వేగంగా పరుగెత్తాడు.

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూశారా... నిన్నటి వరకు ఇతను కేవలం సామాన్య రైతు మాత్రమే. కానీ... ఇప్పుడు ఇతనో సెలబ్రెటీ. ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఇతని గురించే మాట్లాడుకుంటోంది.
undefined
ఉసేన్ బోల్ట్.... ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితమే. పరుగు పోటీ అనేగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఉసేన్ బోల్ట్ ది. ఇప్పటి వరకు పరుగు పందెంలో ఆయనను మించినవారు ఎవరూ లేరని అంతా అంటారు
undefined
అయితే... అలాంటి ఉసేన్ బోల్ట్ రికార్డ్ ని ఓ సామాన్య రైతు బ్రేక్ చేశాడు. అతనే ఈ రైతు ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.
undefined
పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రం మూడబమద్రి పట్టణానికి చెందిన శ్రీనివాస గౌడ(28) సామాన్య రైతు. దక్షిణ కర్ణాటకలో ప్రతి సంవత్సరం కంబళ అనే పోటీ జరుగుతోంది. ఆ పోటీల్లో దున్నపోతులతో పాటు మనుషులు కూడా పరుగులు తీస్తారు.
undefined
శ్రీనివాస గౌడ కూడా దున్నపోతు సహా పరిగెత్తాడు. 142.4 మీటర్ల దూరం పరుగును దున్నలతో కలిసి శ్రీనివాస గౌడ 13.42 సెకన్లలో పూర్తి చేశారు. ఈలెక్కన ఇతను 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పరుగెత్తినట్లు, ఉసేన్ బోల్ట్ కంటే 0.3 సెకన్ల వేగంగా పరుగెత్తాడు.
undefined
100 మీటర్ల పరుగును పూర్తి చేసేందుకు బోల్ట్‌కు పట్టిన సమయం 9.58 సెకన్లు. ప్రస్తుతం ఇదే ప్రపంచ రికార్డు. దానిని ఈ రైతు ఇప్పుడు బ్రేక్ చేసేశాడు. ఈ మేరకు కర్ణాటకకు చెందిన ఓ జర్నలిస్ట్ గురువారం(ఫిబ్రవరి-13,2020) చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
undefined
కర్ణాటకలో దున్నపోతులు ఇన్వాల్వ్ అయ్యే సాంప్రదాయ రేస్ ను కంబాలా రేస్ అని పిలుస్తుంటారు. కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ,ఉడుపి జిల్లాల్లోని రైతుల కమ్యూనిటీ ప్రతి ఏటా ఈ కంబాలా రేస్ పోటీలను నిర్వహిస్తుంటారు.
undefined
ఇప్పుడు శ్రీనివాస్ ఓవర్ నైట్ లో స్టార్ గా మారాడు. అతనికి నలువైపుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అంత గుర్తింపు తనకు వస్తుందని తాను కూడా ఊహించలేదని శ్రీనివాస్ చెబుతుండగం గమనార్హం.
undefined
click me!