తాకరాని చోట తాకుతూ, హోటల్ కి రమ్మని.. టీవీ9లో లైంగిక వేధింపులు..!

First Published Jan 25, 2020, 3:23 PM IST

అన్ని రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు 'మీటూ' ఉద్యమం ద్వారా వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. 

అన్ని రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు 'మీటూ' ఉద్యమం ద్వారా వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ, కార్పోరేట్ ఫీల్డ్, మీడియా రంగానికి చెందిన చాలా మంది మహిళలు ఇప్పటికే తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు.
undefined
ఎంతో మంది ప్రముఖులు సైతం 'మీటూ' ఎఫెక్ట్ తో బాధ పడ్డారు. తాజాగా మరో మీడియా ప్రముఖుడు లైంగిక ఆరోపణలు ఎదుర్కొని తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రముఖ న్యూస్ ఛానెల్ టీవీ9 హిందీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
undefined
టీవీ9 భారత్‌వర్ష్ పేరిట హిందీ న్యూస్ ఛానెల్ ని ఏడాది క్రితం ప్రారంభించారు. ఈ ఛానెల్ కి సంబంధించిన అవుట్ పుట్ డివిజన్ నోయిడాలో ఉంది. ఈ డివిజన్ లో అవుట్ పుట్ ఎడిటర్ గా పని చేస్తోన్న అజయ్ ఆజాద్ పై లైంగిక ఆరోపణలు వచ్చాయి.
undefined
ఇదే ఛానెల్ లో పని చేస్తోన్న ఇద్దరు మహిళలు అతడిపై ఫిర్యాదు చేశారు. ఒక మహిళ ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లో మరో మహిళ ఫిర్యాదు చేయడంతో విషయం పెద్దదైంది. అజయ్ తమను లైంగికంగా వేధించడంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లు వారు వెల్లడించారు.
undefined
దీంతో టీవీ 9 యాజమాన్యం ఇంటర్నల్ కమిటీని పంపించి విచారణ చేపట్టింది. అనంతరం అజయ్ శుక్రవారం నాడు తన పదవికి రాజీనామా చేసినట్లు టీవీ9 భారత్‌వర్ష్ ప్రకటించింది. అజయ్ రాజీనామాని యాక్సెప్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది టీవీ9 టీమ్.
undefined
ఎడిటర్ అజయ్ మొదట్లో తమకు పనికి సంబంధించిన మెసేజ్ లు పెట్టేవాడని, ఆ తరువాత వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడని ఆ ఇద్దరు మహిళలు తెలిపారు. తనను 'సర్' అని పిలవకుండా 'జాన్' అని పిలవాలని, తన ప్రేమించాలని వారిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు కంప్లైంట్ లో పేర్కొన్నారు.
undefined
ఇద్దరిలో ఓ మహిళతో హోటల్ రూమ్ బుక్ చేస్తానని తప్పుగా మెసేజ్ లు చేస్తే.. మరొక మహిళను తాకరాని చోట తాకినట్లు ఫిర్యాదులో రాసుకొచ్చారు.
undefined
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న టీవీ9 యాజమాన్యం.. మహిళలపై లైంగిక నేరాల నివారణ చట్టం 2013 ప్రకారం ముందుగా విషయాన్ని ఐసీసీకి సూచించి.. ఎడిటర్ కి నోటీసులు పంపింది.
undefined
ఆ తరువాత ఐసీసీ దర్యాప్తు ప్రారంభించి.. ఎడిటర్ ని సెలవుపై పంపింది. అనంతరం ఎడిటర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. వెంటనే యాజమాన్యం రాజీనామాను ఆమోదించింది.
undefined
click me!