వికటన్ పై చర్యలకు కారణం ఈ కార్డూనే...
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సమయంలో వికటన్ మ్యాగజైన్ లో చాలా వ్యంగ్యంగా ఓ కార్టూన్ ప్రచురించారు. అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న ఇతర దేశాలవారిపై కొత్తగా ఏర్పాటయిన ట్రంప్ సర్కార్ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. కాళ్లు, చేతులు బంధించి మరీ ఆర్మీ విమానాల్లో వారివారి దేశాలకు తరలిస్తున్నారు... ఇలా భారతీయులను కూడా తరలించారు.
ఇలా భారత అక్రమ వలసదారుల తరలింపును సూచిస్తూ ట్రంప్ ప్రధాని మోదీ చేతులు, కాళ్లు గొలుసులతో బంధించినట్లు కార్టూన్ ప్రచురించింది వికటన్. ఇది బిజెపి నాయకులు, మోదీ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యింది.
తమిళనాడు బిజెపి అధ్యక్షులు అన్నామలై కేంద్రానికి ఫిర్యాదుచేసారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎల్.మురుగన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు రంజనా ప్రకాశ్ దేశాయ్ కు చేసిన ఫిర్యాదులో వెంటనే వికటన్ సంస్థపై చర్యలు తీసకోవాలని కోరారు.
వికటన్ ప్రచురించిన కార్టూన్ ను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని ... వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్లు అన్నామలై ఎక్స్ వేదికన ప్రకటించారు. ఆయన శనివారం మధ్యాహ్నం ఈ ట్వీట్ చేయగా అదేరోజు రాత్రి నుండి వికటన్ వెబ్ సైట్, యాప్ పనిచేయడం లేదు.