విజయ్ ని చూస్తుంటే మీకు కూడా పవన్ కల్యాణ్ గుర్తొస్తున్నాడా? మరి తలపతి 'పవర్' స్టార్ అవుతారా?

Published : Feb 26, 2025, 03:27 PM IST

TVK Leader Vijay Politics : తమిళ స్టార్ హీరోో విజయ్ ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. ఆయనను చూస్తుంటే జనసేనాని పవన్ కల్యాణ్ గుర్తుకు వస్తున్నాడు. మరి ఏపీ రాజకీయాల్లో పవన్ లా తమిళనాట విజయ్ సక్సెస్ అవుతారా?       

PREV
18
విజయ్ ని చూస్తుంటే మీకు కూడా పవన్ కల్యాణ్ గుర్తొస్తున్నాడా? మరి తలపతి 'పవర్' స్టార్ అవుతారా?
Pawan Kalyan Vijay

ఈయన టాలీవుడ్ లో స్టార్ హీరో అయితే ఆయన కోలీవుడ్ సూపర్ స్టార్... ఇద్దరి సినీ ప్రస్థానం ఒకేలా సాగింది. ఇప్పుడు ఇద్దరూ రాజకీయాల్లో ఎంట్రీఇచ్చారు... అయితే ఒకరు ఇప్పటికే పొలిటికల్ గా కూడా సక్సెస్ కాగా మరొకరు ఇంకా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే రాజకీయంగా సక్సెస్ అయిన ఆ తెలుగు స్టార్ నే ఇఫ్పుడు తమిళ హీరోగారు కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పటికే ఈ స్టార్లు ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది ... ఒకరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అయితే మరొకరు తలపతి విజయ్. 

ఇప్పటికే పవన్ కల్యాణ్ పదేళ్లకు పైగా రాజకీయ అనుభవాన్ని పొంది సక్సెస్ ఫుల్ నేతగా మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనవల్లే టిడిపి, జనసేన, బిజెపి కూటమి విజయం సాధించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పవన్ స్పీచులు తెలుగు ప్రజలను ఎంతగానో కదిలించాయి... ఆవేశంగా సాగే ఆయన ప్రసంగంలో ఒక్కో మాట తూటాలా పేలాయి. అందువల్లే ఆయన సభలకు భారీ స్పందన వచ్చింది. ఇలా పవన్ ప్రజలతో మమేకం అవుతూ చేసిన చేసిన ప్రచారం బాగా పనికివచ్చింది. 

అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ పొలిటికల్ స్టైల్ నే తమిళ రాజకీయాల్లో ఉపయోగిస్తున్నారు విజయ్. పవన్ లాగే సొంతంగా పార్టీ పెట్టి ముందుకు వెళ్లడమే కాదు ప్రసంగాలు, ప్రచారంలో కూడా ఆయననే ఫాలో అవుతున్నాడు విజయ్. ప్రజలతో మమేకం అవుతూ వారి నమ్మకాన్ని పొందుతూనే ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్న విజయ్ ను చూస్తుంటే గత ఎన్నికల్లో పవన్ ప్రచారం గుర్తుకురావడం ఖాయం. ఇలా పొలిటికల్ గా పవన్ స్టైల్ ను ఫాలో అవుతున్న విజయ్ ఆయనలాగే సక్సెస్ అవుతాడేమో చూడాలి. 
 

28
Vijay Politis

ఎంజీఆర్, జయలలిత, కమల్ హాసన్, సీమాన్, విజయకాంత్ తర్వాత సినిమా బ్యాక్‌గ్రౌండ్‌తో తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చారు విజయ్. 2024 ఫిబ్రవరి 2న తలపతి విజయ్ తమిళగ వెట్రి కళగం అనే పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేశారు. విజయ్ రాజకీయాల్లోకి రావడంతో సినిమాల్లో నటించకూడదని డిసైడ్ అయ్యారు. తన లాస్ట్ మూవీ 'జన నాయగన్'లో మాత్రమే ఇప్పుడు నటిస్తున్నారు.

ఇలా విజయ్ నిర్ణయాలను చూస్తుంటే ఆయన కూడా తెలుగు సినిమా స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.  మరి పవన్ లాగ ఆయన కూడా రాజకీయంగా కూడా సక్సెస్ అవుతాడో లేదో కాలమే తేలుస్తుంది. 

 

38
విజయ్ పాలిటిక్స్...

2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్‌ను దృష్టిలో పెట్టుకుని పొలిటికల్ పార్టీ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు విజయ్. సినిమా స్టైల్లో చెప్పాలంటే ఇప్పటివరకు టీజర్, ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక తమిళగ వెట్రి కళగం మెయిన్ పిక్చర్ చూడబోతున్నాం. ఈ టైమ్‌లో తమిళగ వెట్రి కళగం వార్షికోత్సవం బుధవారం జరిగింది.

48
Tamilaga Vettri Kazhagam

చెన్నై మహాబలిపురం దగ్గరలోని పూంచేరి ఏరియాలో ఉన్న ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో తమిళగ వెట్రి కళగం వార్షికోత్సవ సంబరాలు జరుగుతున్నాయి.  ఇందులో 2,500 మందికి పైగా పార్టీ లీడర్స్, మెంబర్స్ పాల్గొన్నారు. ఈ ఫంక్షన్‌లో విజయ్‌తో పాటు పార్టీ ఎలక్షన్ ప్రమోషన్ మేనేజ్‌మెంట్ జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున, జన్ సూరజ్ పార్టీ లీడర్, ఎలక్షన్ అడ్వైజర్ ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొన్నారు.

58
ఎంజీఆర్, జయలలిత స్టైల్లో విజయ్ పొలిటికల్ డైలాగ్స్!

విజయ్ ప్రతీ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో నా గుండెల్లో నిండిపోయిన ఫ్రెండ్స్ అని మాట్లాడటం కామన్. అదే డైలాగ్‌ను ఇప్పుడు తన పొలిటికల్ స్టేజీకి వాడుతున్నారు. ప్రతీ పొలిటికల్ స్టేజీ మీద తలపతి విజయ్ నా గుండెల్లో నిండిపోయిన వాళ్లందరికీ అని మాట్లాడుతున్నారు. ఇది చూస్తుంటే విజయ్ ఇప్పుడు ఎంజీఆర్, జయలలిత పొలిటికల్ స్పీచ్‌ను ఫాలో అవుతున్నారని అంటున్నారు.

68
Vijay

సినిమా బ్యాక్‌గ్రౌండ్‌తో రాజకీయాల్లోకి వచ్చిన ఎంజీఆర్, జయలలిత పొలిటికల్ స్పీచ్‌లో రక్తం పంచుకున్న తోబుట్టువులే, నా ప్రాణం కంటే మిన్నైన కార్యకర్తలే, ప్రజల కోసం నేను అంటూ పొలిటికల్ డైలాగ్‌తో ప్రతీ పొలిటికల్ స్పీచ్ స్టార్ట్ చేసేవాళ్లు.

78
vijay

ఎందుకు రక్తం పంచుకున్న తోబుట్టువులే అని అంటున్నారో ఎంజీఆర్ ఓ కార్యక్రమంలో వివరించారు. ఆయనపై జరిగిన కాల్పుల సమయంలో ట్రీట్‌మెంట్ కోసం చాలా రక్తం అవసరమైంది... దీనికి చాలామంది రక్తం ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆ రక్తపు చుక్కలు తన బాడీలో ఉండటం వల్లనే తాను ఇలా ఉన్నాను. అప్పుడు నా బాడీలో ఎక్కించిన రక్తం ఎవరిదో నాకు తెలీదు. కానీ అది చాలామంది రక్తం కాబట్టి అందరినీ నా రక్తం పంచిన కార్యకర్తలే అని పిలుస్తానని ఎంజీఆర్ తెలిపారు.

88
ఎంజీఆర్, జయలలిత స్టైల్లో విజయ్ పొలిటికల్ డైలాగ్స్!

అదేవిధంగా తలపతి విజయ్ ఈ పొజిషన్‌లో ఉండటానికి మెయిన్ రీజన్ ఆయన ఫ్యాన్స్. అందుకే ఆయన ప్రతీ ప్రోగ్రామ్‌లో గుండెల్లో నిండిపోయిన వాళ్లందరికీ అని మాట్లాడుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories