ముస్లిం యువకుడితో బీజేపీ నేత కూతురి పెళ్లికి డేట్ ఫిక్స్.. కానీ అంతలోనే రద్దు.. అసలేం జరిగిందంటే..

Published : May 21, 2023, 11:03 AM IST

ఓ బీజేపీ నేత తన కూతురు వివాహాన్ని ఒక ముస్లిం యువకుడితో జరిపించేందుకు సిద్దమయ్యారు. ఇందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే మరో వారం రోజుల్లో పెళ్లి ఉందనగా.. రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.   

PREV
15
ముస్లిం యువకుడితో బీజేపీ నేత కూతురి పెళ్లికి డేట్ ఫిక్స్.. కానీ అంతలోనే రద్దు.. అసలేం జరిగిందంటే..

ఓ బీజేపీ నేత తన కూతురు వివాహాన్ని ఒక ముస్లిం యువకుడితో జరిపించేందుకు సిద్దమయ్యారు. ఇందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే మరో వారం రోజుల్లో పెళ్లి ఉందనగా.. రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. 

25

ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. బీజేపీ నేత యశ్‌పాల్ బెనమ్.. పౌరి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నారు. అయితే తన కుతూరు సంతోషం కోసం ముస్లిం యుకుడితో వివాహం చేయాలని నిర్ణయించుకున్నట్టుగా యశ్‌పాల్ తెలిపారు. 

35

అయితే సోషల్ మీడియాలో ప్రతిపాదిత పెళ్లిపై పెద్ద సంఖ్యలో నెటిజన్లు స్పందించిన తీరును దృష్టిలో ఉంచుకుని.. దానిని వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు తాను ప్రజల మాట కూడా వినాలని అన్నారు. ‘‘మా పిల్లల పెళ్లి కారణంగా పరిపాలన, పోలీసులు ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాలని నేను కోరుకోను’’ అని చెప్పారు.

45

ఈ ప్రతిపాదిత పెళ్లికి సంబంధించి కొన్ని  వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకత  గురించి తాను వరుడి తల్లిదండ్రులతో చర్చించానని యశ్‌పాల్ చెప్పారు. ప్రస్తుతానికి అన్ని ఫంక్షన్లను రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మే 28న పౌరీ నగరంలో జరగాల్సిన పెళ్లిని రద్దు చేసినట్లు చెప్పారు. 

55

దిలా ఉంటే.. యశ్‌పాల్ కుమార్తె పెళ్లి కార్డు ఫొటో గురువారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే ఈ ప్రతిపాదిత వివాహంపై హిందూత్వ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. శుక్రవారం పౌరీలోని ఝండా చౌక్‌లో యశ్‌పాల్ దిష్టిబొమ్మను నిరసనకారులు దహనం చేశారు. వీహెచ్‌పీ, భైరవ సేన, భజరంగ్ దళ్ ఈ నిరసనలో పాల్గొన్నాయి. ఇలాంటి వివాహాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని జిల్లా వీహెచ్‌పీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దీపక్‌గౌడ్‌ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories