ఏపీ సరిహద్దులో ఘోర రైలు ప్ర‌మాదం - గూడ్స్‌ రైలును ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్‌ రైలు

First Published | Oct 11, 2024, 10:19 PM IST

Train Accident: మైసూరు నుంచి దర్భంగా వెళ్తున్న భాగమతి ఎక్స్‌ప్రెస్ శుక్రవారం చెన్నై సమీపంలోని కవరైపేట్టై రైల్వే స్టేషన్ దగ్గర గూడ్స్ రైలును ఢీకొట్టింది.
 

Tamil Nadu Train Accident: చెన్నై స‌మీపంలో శుక్ర‌వారం రాత్రి ఘోర రైలు ప్ర‌మాదం జ‌రిగింది. ఆగివున్న గూడ్స్ రైలును  ఎక్స్‌ప్రెస్  రైలు ఢీ కొట్టింది. దీంతో రెండు భోగీల‌లో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ప‌లు భోగీలు ప‌ట్టాలు తప్పాయి. రైలు ప్ర‌మాదం గురించి స‌మాచారం అందుకున్న రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్  టీమ్ వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుంది. 
 

Chennai Train Accident

చెన్నై శివారులో రైలు ప్రమాదానికి సంబంధించిన ప్రాథ‌మిక నివేదిక‌ల ప్ర‌కారం.. మైసూరు నుంచి దర్భంగా వెళ్తున్న భాగమతి ఎక్స్‌ప్రెస్ శుక్రవారం చెన్నై సమీపంలోని కవరైపేట్టై రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఎక్స్‌ప్రెస్ రైలు నిలబడి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఆగివున్న గూడ్స్ రైలును అత్యంత వేగంగా వ‌చ్చిన ఎక్స్ ప్రెస్ రైలు ఢీ కొట్ట‌డంతో పెద్ద ప్ర‌మాదం జ‌రిగింది. 

ఈ ప్ర‌మాదంలో రెండు రైళ్ల భోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. ఎక్స్‌ప్రెస్‌ రైలులో రెండు బోగీల నుంచి మంటలు చెలరేగాయి. మంట‌లు భారీగా చెల‌రేగ‌డంతో రైలులోని ప్ర‌యాణీకులు తీవ్ర భ‌యాందోల‌న‌కు గురై పరుగులు పెట్టిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఈ ప్ర‌మాదంలో ఆస్థి, ప్రాణ న‌ష్టానికి సంధించి అధికారిక ప్ర‌క‌ట‌న‌లు రావాల్సి ఉంది. 


Mysore Express train accident

రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ టీమ్స్  వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నాయ‌ని స‌మాచారం. చాలా కోచ్‌లు పట్టాలు తప్పడంతో పాటు ఎక్స్‌ప్రెస్ రైలులోని రెండు కోచ్‌లలో భారీ మంటలు చెలరేగాయనీ, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ టి.ప్రభుశంకర్ తెలిపిన వివరాల ప్రకారం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నష్టం, ప్రాణనష్టంపై ప్రాథమిక వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

భాగమతి ఎక్స్‌ప్రెస్ మైసూరు నుండి ఉదయం 10:30 గంటలకు బయలుదేరి, దర్భంగా వైపు వెళుతుండగా, తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వద్ద ఒక గూడ్స్ రవాణా రైలును ఢీకొట్టింది. ఢీకొనడంతో అనేక కోచ్‌లు పట్టాలు తప్పాయి, కొన్ని మంటలు అంటుకున్నాయి. గాయాపడిన వారి సంఖ్య అధికంగానే ఉండే అవకాశముందని సమాచారం. మరణాల గురించి ఇంకా నిర్దిష్ట వివరాలు ధృవీకరించబడనప్పటికీ, కొంతమంది ప్రయాణీకులకు గాయాలయ్యాయని నివేదికలు సూచిస్తున్నాయి.
 

అంతకుముందు, బీహార్‌లోని కతిహార్ జిల్లాలో పెను రైలు ప్రమాదం తప్పింది. కతిహార్ జిల్లా సుధానిలో పుల్ నంబర్ 136 సమీపంలో గూడ్స్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదనీ, పరిస్థితి అదుపులోకి వచ్చిందని రైల్వే అధికారులు తెలిపారు. రైలు గౌహతి నుంచి కిషన్‌గంజ్‌కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పిన రెండు మూడు గంటల్లోనే రైల్వే ట్రాక్‌ను క్లియర్ చేశామని కతిహార్ రైల్వే సీనియర్ డీసీఎం ఈ ఘటన గురించి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశోధించి, రైలు కోచ్‌లు ఎలా పట్టాలు తప్పాయో బృందం కనుగొంటుందని తెలిపారు. ప్రమాద శబ్ధం పెద్దగా వినిపించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నామని స్థానికులు తెలిపారు. అర్థరాత్రి వరకు డౌన్‌లైన్‌లో ట్రాఫిక్  మాములు స్థితికి వస్తుందని పేర్కొన్నారు.
 

Latest Videos

click me!