ఎవరి నోయెల్ టాటా :
నావల్ టాటా, సూని టాటా దంపతుల కుమారుడు రతన్ టాటా... అతడు 10 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు... అంతేకాదు తండ్రి నావల్ టాటా మరో వివాహం చేసుకున్నాడు. ఇలా నావల్ టాటాకు రెండో భార్య సిమోన్ టాటా ద్వారా కలిగిన సంతానమే నోయెల్ టాటా.
టాటా యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్ నుండి బ్యాచిలర్ డిగ్రీ చేసారు నోయెల్ టాటా. ఆ తర్వాత ఫ్రాన్స్ లో INSEAD బిజినెస్ స్కూల్ నుండి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ చేసారు. ఆ తర్వాత టాటా సంస్థలో చేరి అనేక కీలక బాధ్యతలు చేపట్టారు.
టాటా సంస్థ విదేశాల్లో నిర్వహించే వ్యాపార కార్యకలాపాలు, సేవలను చూసుకునే సంస్థ టాటా ఇంటర్నేషనల్. ఇందులో మొదట తన సేవలను అందించారు నోయెల్ టాటా. ఆ తర్వాత తన తల్లి స్థాపించిన ట్రెంట్ (వెస్ట్ సైడ్, జూడియో, ఉట్సా వంటి వస్త్రవ్యాపారాలు నిర్వహించే సంస్థ) కు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. 2003 లో నోయెల్ టైటాన్ ఇండస్ట్రీస్, వోల్టాస్ విభాగాలకు డైరెక్టర్ గా మారారు.
అయితే 2010-11 లోనే నోయెల్ టాటా తన సోదరుడు రతన్ టాటా వారసుడిగా నియమింపబడతాడనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా 2011 లో నోయెల్ బావమరిది సైరన్ మిస్త్రీ టాటా సంస్థల బాధ్యతలు చేపట్టాడు. ఇలా అప్పుడు టాటా సన్స్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టలేకపోయినా ఇప్పుడు టాటా వారసత్వాన్ని కొనసాగించే అవకాశం నోయెల్ టాటాకు దక్కే అవకాశాలున్నాయి.