Top 10 Best Fighter Jets in the World: ప్ర‌పంచంలోని టాప్-10 యుద్ధ విమానాలు ఇవే

Published : May 12, 2025, 08:01 AM IST

Top 10 fighter jets in the world: భార‌త్ పాకిస్తాన్ ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య యుద్ధ విమానాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే,  ప్రపంచంలో అత్యుత్తమ టాప్ 10 యుద్ధ విమానాల ఏవో మీకు తెలుసా? ఆధునిక సాంకేతికత, వేగం, యుద్ధంలో మెరుపు వేగంతో త‌న బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించే ప్ర‌పంచంలోని టాప్-10 యుద్ధ విమానాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
16
Top 10 Best Fighter Jets in the World: ప్ర‌పంచంలోని టాప్-10 యుద్ధ విమానాలు ఇవే

Top 10 Best Fighter Jets in the World: వైమానిక రంగంలో యుద్ధ విమానాలు అత్యాధునిక సాంకేతికతను ప్రదర్శించే అద్భుత‌మైన శక్తిగా నిలుస్తున్నాయి. వేగం, చాతుర్యం, ఖచ్చితత్వం కలిగిన ఈ విమానాలు, స్టెల్త్, అడ్వాన్స్డ్ అవియానిక్స్, సెన్సార్ ఫ్యూజన్, కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లాంటి సాంకేతికతలతో 21వ శతాబ్దపు యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

2025 నాటికి అమెరికా, చైనా, రష్యా వంటి శక్తివంతమైన దేశాలు అత్యుత్తమ యుద్ధ విమానాలను అభివృద్ధి చేసి, వినియోగిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ టాప్ 10 యుద్ధ విమానాలను, వాటి రూపకల్పన, స్పెసిఫికేషన్లు, సామర్థ్యాలను తెలుసుకుందాం. 
 

26

10. సుఖోయ్ Su-35S (రష్యా):

Su-27 ఆధారంగా అభివృద్ధి చేసిన ఈ 4.5 జనరేషన్ ఫైటర్ అత్యుత్తమ మానేవరబిలిటీ కలిగి ఉంటుంది. ఇర్బిస్-E రాడార్ ద్వారా 400 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను గుర్తించగలదు. ఒక్క యూనిట్ ఖర్చు సుమారు $85 మిలియన్లు ఉంటుంది.

9. యూరోఫైటర్ టైఫూన్ (యూరోప్):

యూకే, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాల సహకారంతో రూపొందిన ఈ యుద్ధ‌ విమానం, డెల్టా వింగ్స్, ఫ్లై-బై-వైర్ వ్యవస్థలతో మల్టిరోల్ పనితీరును ప్రదర్శిస్తుంది. గ్లోబల్‌గా 570 యూనిట్లు వినియోగంలో ఉన్నాయి.

36
Dassault Rafale.

8. దసాల్ట్ రఫెల్ (ఫ్రాన్స్):

డెల్టా వింగ్, స్నెక్మా M88 ఇంజిన్లతో కూడిన ఈ ఫ్రెంచ్ ఫైటర్, గగనతల ఆధిపత్యం, న్యూక్లియర్ డిటరెన్స్ సామర్థ్యం కలిగి ఉంది. భారత్, క్రొయేషియా సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు 500ల‌కు పైగా యూనిట్లు ఆర్డర్ చేశాయి. 

7. బోయింగ్ F-15EX ఈగిల్ II (USA):

ప్రసిద్ధ F-15 కు ఆధునీకరించిన రూపం. అత్యధికంగా 22 ఏయిర్-టు-ఏయిర్ మిసైళ్లు మోసే సామర్థ్యం కలిగి ఉంది. US వాయుసేన 140 యూనిట్లను కొనుగోలు చేయనుంది.

46

6. షెన్యాంగ్ FC-31 (చైనా):

జె-35 గా కూడా పిలవబడే ఈ నేవల్ స్టెల్త్ ఫైటర్, చైనా నేవీ కోసం అభివృద్ధి చేశారు. ఇది 1,200 కి.మీ పరిధిలో మిషన్లు చేయగలదు. ధర సుమారు $70 మిలియన్లు.

5. సుఖోయ్ Su-57 (రష్యా):

రష్యా ప్రధాన ఐదవ తరం స్టెల్త్ ఫైటర్. సూపర్‌క్రూజ్, సెన్సార్ ఫ్యూజన్, అంతర్గత ఆయుధ వ్యవస్థలు దీని ప్రత్యేకతలు. ఒక్క యూనిట్ ఖర్చు $40–$50 మిలియన్లు.

56

4. KAI KF-21 బోరామే (దక్షిణ కొరియా):

కొరియా ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన ఈ ఫైటర్, దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి అధునాతన విమానాలలో ఒకటి. 2032 నాటికి 120 యూనిట్లు ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నారు.

3. లాక్‌హీడ్ మార్టిన్ F-22 రాప్టర్ (USA):

F-22, అత్యుత్తమ గగనతల ఆధిపత్య ఫైటర్‌గా గుర్తింపు పొందింది. సుమారు 195 యూనిట్లు మాత్రమే తయారయ్యాయి. ఒక్క దాని ధర $150 మిలియన్లు.

66

2. చెంగ్డు J-20 మైటీ డ్రాగన్ (చైనా):

చైనాకు చెందిన ఐదవ తరం స్టెల్త్ ఫైటర్. దీని పరిధి 5,926 కి.మీ, అంటే చాలా దూరంంలోని మిషన్లకు అనుకూలంగా ఉంటుంది. 200కి పైగా యూనిట్లు వినియోగంలో ఉన్నాయి.

1. లాక్‌హీడ్ మార్టిన్ F-35 లైట్‌నింగ్ II (USA):

ప్రపంచంలో అత్యధికంగా వినియోగంలో ఉన్న ఐదవ తరం మల్టిరోల్ ఫైటర్. F-35A, F-35B, F-35C మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 1,000కి పైగా యూనిట్లు ఇప్పటికే త‌యార‌య్యాయి. ఇంకా  2,400 యూనిట్ల ఉత్పత్తి చేసే ప్రణాళికలు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories