ఎంపీ ప్రెగ్నెన్సీ వార్తలు.. ఆ కడుపుతో తనకు సంబంధం లేదన్న భర్త..!

First Published Jun 10, 2021, 11:20 AM IST

ఎంపీగా గెలుపొందిన వెంటనే నుస్రత్.. కలకత్తాలో అంగరంగవైభవంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్‌కు సీఎం మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. అయితే.. ఆ బంధం ఏంతో కాలం నిలపడలేదు.

తృణముల్ కాంగ్రెస్ ఎంపీ, బెంగాలీ నటి నుస్రత్ జహాన్.. పెళ్లి, ప్రెగ్నెన్సీ వార్తలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. గత ఏడాది నుస్రత్.. వ్యాపావేత్త నిఖిల్ జైన్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఆ పెళ్లి పెటాకులయ్యాయి.
undefined
గత కొద్దిరోజులుగా నుస్రత్ జహాన్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఆమె.. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి అంటూ వార్తలు వచ్చాయి.
undefined
అందులో నిజం ఉందో లేదో క్లారిటీ లేదు కానీ.. ఆ బిడ్డకు తండ్రిని నేను మాత్రం కాదంటూ ఆమె భర్త నిఖిల్ జైన్ పేర్కొన్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.
undefined
నుస్రత్..నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తను జూన్ 19,2019న టర్కీలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె బెంగాల్లో టీఎంసీ తరపున ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. దాంతో అటు పెళ్లి, ఆ వెంటనే రాజకీయ అరంగేట్రం అన్నీ ఆమెకు కలిసి వస్తున్నాయనుకున్నారు.
undefined
ఎంపీగా గెలుపొందిన వెంటనే నుస్రత్.. కలకత్తాలో అంగరంగవైభవంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్‌కు సీఎం మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. అయితే.. ఆ బంధం ఏంతో కాలం నిలపడలేదు.
undefined
గత ఆరు నెలలుగా నస్రత్.. తన భర్తతో విడిపోయారని సమాచారం. ఈ నేపథ్యంలో నస్రత్.. ఆరు నెలల గర్భవతి అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఆమె కుటుంబసభ్యులు స్పందించలేదు. అయితే.. ఈ లోపే.. ఆ గర్భంతో తనకు సంబంధం లేదు అంటూ ఆమె భర్త నిఖిల్ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
undefined
ఆరు నెలలుగా మిమిద్దరం కలిసి లేకపోతే.. ఆమె గర్భాన్ని నేనెలా కారణమౌతానంటూ ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
undefined
ఈ నేపథ్యంలో.. తాజాగా ఆమె తన పెళ్లిపై వస్తున్న వార్తలను ఆమె స్పందించారు. తాను తన భర్త నుంచి విడిపోయినట్లు ఆమె క్లారిటీ ఇచ్చారు.
undefined
అసలు నిఖిల్ తో తన పెళ్లి టర్కిష్ చట్టం ప్రకారం జరిగింది.. అది ఇండియాలో చెల్లదని ఆమె ప్రకటించారు. ఈ క్రమంలోనే నిఖిల్ జైన్పై పలు ఆరోపణలు చేశారు నుస్రత్.
undefined
తన కుటుంబ ఆభరణాలు, ఇతర ఆస్తులను నిఖిల్ అక్రమంగా దోచుకున్నారని ఆరోపించారు. తనకు తెలియకుండానే వివిధ ఖాతాల్లోని నిధులను దుర్వినియోగం చేశారన్నారు.
undefined
అయితే.. ప్రెగ్నెన్సీ వార్తలపై మాత్రం ఆమె నోరు విప్పలేదు. తన ప్రెగ్నెన్సీ పై నిఖిల్ చేసిన కామెంట్సపై కూడా ఆమె ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం.
undefined
కాగా నుస్రత్ మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. బీజేపీ నేత, నటుడు యశ్ దాస్ గుప్తాతో రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం.
undefined
ఈ విషయంలోనే నిఖిల్ తో ఆమెకు విభేదాలు వచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆమె నిఖిల్ కి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నారట. అందుకే.. గత ఆరు నెలలుగా వారు కలిసి ఉండటం లేదని తెలుస్తోంది.
undefined
click me!