ఎమర్జెన్సీ చీకటి రోజులు ఎప్పటికీ మర్చిపోలేం... ప్రధాని నరేంద్ర మోదీ

First Published Jun 25, 2021, 12:48 PM IST

ఎమర్జెన్సీ విధించి 46 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ‘ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పాతరేసింది" అన్నారు. జూన్ 25, 1975 న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు.

undefined
కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నినదించిన గొంతులను నొక్కేయడానికే దేశంలో ఎమర్జెన్సీ విధించారని, స్వతంత్ర భారత చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయంగా పేర్కొన్నట్లు హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
undefined
కాసేపటికే ప్రధాని నరేంద్రమోడీ కూడా ట్విటర్ వేదికగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దేశంలో అత్యాయక పరిస్థితిని అదుపులో పెట్టే క్రమంలో భాగంగా ఆర్టికల్ 352 ప్రకారం ఎమర్జెన్సీ విధించారు.
undefined
ఇది 1975 - 1977 వరకు 21 నెలల పాటు ఎమర్జెన్సీ కొనసాగింది. దీన్ని ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు. కాగా, రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అధికారికంగా జారీ చేశారు. అత్యవసర పరిస్థితి జూన్ 25, 1975 నుండి, మార్చి 21, 1977 న విత్ డ్రా చేసేవరకు అమలులో ఉంది అన్నారు.
undefined
ఈ చీకటి రోజులను దేశం ఎప్పటికీ మరచిపోదని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. "#DarkDaysOfEmergency ని ఎప్పటికీ మరచిపోలేం. 1975 నుండి 1977 వరకు కొనసాగిన ఈ ఎమర్జెన్సీతో ఇనిస్టిట్యూషన్స్ ను ఓ పద్ధతి ప్రకారం విధ్వంసం చేశారు.
undefined
భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా జీవించడానికి అనువైన ప్రతీ పనిని చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం’ అంటూ దేశ ప్రజాస్వామ్య నీతిని కాంగ్రెస్ ఎలా నాశనం చేసిందో ఆయన ట్వీట్ చేశారు.
undefined
దేశవ్యాప్తంగా తమకు వ్యతిరేకపవనాలు వీస్తుండడంతో వాటిని అదుపులో పెట్టడానికే 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించారని, దీనికోసం రాజ్యాంగ విలువలు కాలరాశారని, హక్కులు హరించారని.. వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం మీద ఉక్కుపాదం మోపారని అన్నారు. అంతేకాదు దేశపౌరుల స్వేచ్చను హరిస్తూ, వారికి అడ్డుకట్ట వేస్తూ పాలించే అధికారం డిక్రీ ద్వారా ప్రధానమంత్రికి ఇవ్వబడిందన్నారు.

click me!