ఢిల్లీ : కొత్త పార్లమెంట్ భవనం ఆదివారం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీనిమీద అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య చిన్నపాటి ఘర్షణ కొనసాగుతోంది. అదలా ఉంచితే.. ఈ పార్లమెంటు కొత్త భవనం మరో కొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది. పార్లమెంటు భవనంలో రాజదండం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆదివారం నాడు ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ స్పీకర్ కుర్చీ సమీపంలో ఒక బంగారు రాజ దండాన్ని ఆవిష్కరించబోతున్నారు.