సమాజంలో రోజురోజుకీ విలువలు తగ్గిపోతున్నాయి. తమ సంతోషం కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. కనిపెంచిన తల్లిదండ్రులను గాలికి వదిలేస్తున్నారు. ఈ కారణంగానే దేశంలో వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. నవమాసాలు పెంచిన తల్లినే భారంగా భావిస్తున్నారు కొందరు మహానుభావులు. తాజాగా ఝార్ఖండ్‌లోని రామ్‌గడ్ జిల్లా కేంద్రంలో ఓ జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది.
ఝార్ఖండ్‌లోని రామ్‌గడ్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యాపిల్లలు, అత్తమామలతో కలిసి మహా కుంభమేళా కోసం ప్రయాగ్ రాజ్ వెళ్లాడు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్లాడు. అయితే 65 ఏళ్ల సంజూదేవీని ఇంట్లో బంధించి బయట నుంచి తాళం వేసుకొని వెళ్లడం అత్యంత హేయమైన చర్య. సోమవారం నుంచి ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సంజూదేవీ తినడానికి తిండి కూడా లేకపోవడంతో అటుకులు తింటూ కాలం వెల్లదీసింది.