న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా పైలట్లు, సిబ్బంది కోసం కొత్త యూనిఫామ్‌లను ఈరోజు విడుదల చేసింది. 1932లో ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ స్థాపించారు. గత ఆరు దశాబ్దాలుగా ఒకే యూనిఫాం ఎయిర్ ఇండియాకు గుర్తుగా ఉంది. కానీ ఇప్పుడు తొలిసారిగా అందులో మార్పులు చేయబోతున్నారు. దశాబ్దాల ఎయిరిండియా పయనంలో మొట్టమొదటిసారిగా యూనిఫాం మారుస్తున్నారు. ఎయిర్‌లైన్ విస్తారాను ఎయిరిండియాలోకి విలీనం చేసి, అన్నీ ఒకే పరిధిలోకి తీసుకువస్తున్న సమయంలో ఈ మార్పు వచ్చింది.
‘ఈ కొత్త యూనిఫాంలు ఈ ఏడాది చివరి నాటికి విడుదల కానున్నాయి. ఇవి ఎయిరిండియాగొప్ప చరిత్ర, ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం" అని ఎయిర్‌లైన్ ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్‌లో పేర్కొంది. ఎయిర్‌లైన్ 10,000 మందికి పైగా విమాన సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్, భద్రతా సిబ్బందికి ఎరుపు, వంకాయ, బంగారు రంగులలో కొత్త యూనిఫామ్‌లను రూపొందించడానికి ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాను ఎంచుకుంది. ఇది "విశ్వాసం, శక్తివంతమైన కొత్త భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది" అని పేర్కొంది.
ఎయిర్ ఇండియా అధికారిక ఖాతా ద్వారా X లో పోస్ట్ చేసిన వీడియోలో, సిబ్బంది తాజా యూనిఫాంలు ధరించి కనిపించారు. "మా కొత్త పైలట్ అండ్ క్యాబిన్ క్రూ యూనిఫామ్‌లను పరిచయం చేస్తున్నాం. ఎయిర్ ఇండియా గొప్ప చరిత్ర, ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం చేస్తోంది. ఈ యూనిఫాంలు, భారతదేశపు ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించారు. ఈ యూనిఫాంలు మూడు అత్యుత్తమ భారతీయ రంగులను కలిగి ఉంటాయి - ఎరుపు, వంకాయ, బంగారం. ఇవి నమ్మకానికి, శక్తివంతమైన కొత్త భారతదేశానికి ప్రతీకలు" అని ఎయిర్‌లైన్ ఎక్స్‌లో రాసింది.
కొత్త యూనిఫాం ఎయిరిండియాలో కొనసాగుతున్న ఆధునీకరణలో ఒక భాగం. ఎయిర్ ఇండియా కొత్త గ్లోబల్ బ్రాండ్ గుర్తింపులో ఓ మెట్టుగా చెప్పచ్చు" అని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. "2023 చివరి నాటికి ఎయిర్ ఇండియా ఉద్యోగులు కొత్త యూనిఫాంతో కొత్త రూపంలో దర్వనం ధరించిన ఉద్యోగుల కోసం కొత్త రూపాన్ని ప్రారంభించాలని భావిస్తోంది" అని ఎయిర్‌లైన్ విడుదలలో తెలిపింది.
ఎయిర్ ఇండియా రూపురేఖలు మార్చుకోవడానికి నడుం బిగించింది. ఈ ప్రణాళికలో భాగంగానే ఈ సంవత్సరం ప్రారంభంలో బోయింగ్, ఎయిర్‌బస్ లు కలిపిమొత్తం 470 విమానాల కోసం ఆర్డర్ చేసింది. ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ.. "ఎయిర్ ఇండియా సిబ్బంది యూనిఫాంలు ప్రపంచంలోనే విమానయాన చరిత్రలో అత్యంత మెరుగైనవి, మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ దుస్తులు ఎయిర్ ఇండియా భవిష్యత్తు కోసం ఒక ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి తెరలేపుతుందని గట్టిగా నమ్ముతున్నాం. ఇది మా కొత్త గుర్తింపు, సేవా సూత్రాలు, గ్లోబల్ ఏవియేషన్‌లో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయాలనే మా ప్రయత్నాల సారాంశాన్ని ఇది సంపూర్ణంగా సంగ్రహిస్తుంది"
డిజైనర్ మనీష్ మల్హోత్రా మాట్లాడుతూ "ఎయిరిండియా కోసం యూనిఫాంలను రూపొందించే అవకాశం తనకు లభించినందుకు గౌరవంగా భావిస్తున్నాను" అన్నారు.