పార్లమెంట్ వద్ద భద్రత: ఎలా ఉంటుంది,బాధ్యత ఎవరిది?

First Published | Dec 14, 2023, 2:26 PM IST

పార్లమెంట్ వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అలాంటి భద్రతను చేధించుకొని  లోక్ సభలో  కలర్ స్మోక్ తో హడావుడి చేశారు ఇద్దరు ఆగంతకులు.
 

లోక్ సభలో ఈ నెల  13వ తేదీన ఇద్దరు ఆగంతకులు  కలర్ స్మోక్ వదిలారు. లోక్ సభ వెలుపల మరో ఇద్దరు  కలర్ స్మోక్ ను వదులుతూ  నినాదాలు చేశారు.ఈ నలుగురు అత్యంత భద్రత ఉన్న పార్లమెంట్ ఆవరణలోకి కలర్ స్మోక్ తో హడావుడి చేయడంతో  పార్లమెంట్  వద్ద భద్రతా వైఫల్యం చర్చకు వచ్చింది.

2001 డిసెంబర్ 13న పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటన తర్వాత పార్లమెంట్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు


పార్లమెంట్ సముదాయం వద్ద భద్రతను ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ బలగాలు, పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్(పీఎస్ఎస్) అనే ప్రత్యేక విభాగం నిర్వహిస్తుంది. పారా మిలటరీ జవాన్లు  పార్లమెంట్ వెలుపలి భాగంలో కాపలాగా ఉంటారు. పార్లమెంట్ లోపల  ఢిల్లీ పోలీసులు, పీఎస్ఎస్ సిబ్బంది సెక్యూరిటీ నిర్వహిస్తారు.

పార్లమెంట్ వద్ద మూడంచెల భద్రతా ఉంటుంది. పార్లమెంట్ విజిటర్స్ గ్యాలరీ పాసులు జారీ చేయడానికి ముందు,  కొత్త పార్లమెంట్ గేటు వద్ద, పార్లమెంట్ కాంప్లెక్స్ ప్రవేశ ద్వారం వద్ద, విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించే ముందు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తారు. పార్లమెంట్ లోకి పెన్నులు, పుస్తకాలతో పాటు ఏ వస్తువులను కూడ తీసుకోనేందుకు అనుమతించరు.  ఎంపీల సిఫారసు లేఖలపై  వచ్చే విజిటర్స్ వెంట పీఎస్ఎస్ సిబ్బంది ఉంటారు.అనుక్షణం విజిటర్స్ ను ఓ కంట గమనిస్తుంటారు.

లోక్ సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మెన్ తరపున వచ్చే విజిటర్స్ విదేశాల నుండి వచ్చే దౌత్యవేత్తలు, విదేశీ ప్రముఖులుంటారు. వీరిని  విశిష్ట సందర్శకులుగా పరిగణిస్తారు.వీరికి  కొన్ని భద్రతా ప్రోటోకాల్స్ సడలిస్తారు.పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో భద్రతను పీఎస్ఎస్, ఢిల్లీ పోలీసులు నిర్వహిస్తారు. 

పాత పార్లమెంట్ భవనంలో లోక్ సభలో జార్ఖండ్ బిల్లు ఆమోదం పొందే సమయంలో ఓ విజిటర్ లోక్ సభలోకి దూకారు. ఆ తర్వాత  నిన్న కొత్త పార్లమెంట్ భవనంలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది.

పార్లమెంట్ లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.  ఇక్కడ పనిచేసే వారంతా  తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాల్సి ఉంటుంది.
 

పార్లమెంట్ వద్ద భద్రతా వ్యవస్థ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తాయి.  పార్లమెంట్ వద్ద రోడ్ బ్లాకర్స్ తో పాటు  పవర్ ఫెన్సింగ్ కూడ ఉంది.  అంతేకాదు జాయింట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడ ఏర్పాటు చేశారు.2001లో పార్లమెంట్ పై ఉగ్రదాడి తర్వాత  మూడంచెల భద్రత వ్యవస్థను ప్రవేశ పెట్టారు.


ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం సీఆర్‌పీఎఫ్ సిబ్బంది  పార్లమెంట్ భద్రతను పర్యవేక్షిస్తాయి. సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్, ఫైర్ సర్వీస్ సహా ఇతర ఏజెన్సీలు కూడ  భద్రత విభాగంతో కలిసి పనిచేస్తాయి. నిన్నటి ఘటనలో  నిర్లక్ష్యంగా వ్యవహరించిన  ఎనిమిది మందిపై వేటు పడింది.

Latest Videos

click me!