మరో పోస్ట్‌లో జైపూర్ ఈవెంట్ గురించి శంతను నాయుడు ప్రకటించారు. "జైపూర్ వాసులారా, పుస్తకాలు చదవడానికి ఇదే సమయం. వెంటనే రిజిస్టర్ చేసుకోండి" అని రాశారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రజల్లో చదవాలనే ఆసక్తిని పెంచాలని, కలిసి చదవడం వల్ల మంచి అలవాటు ఏర్పడుతుందని ఆయన అన్నారు. "ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం చదవడాన్ని తిరిగి ప్రోత్సహించడమే. మనుషుల అనుభవాలకు చదవడం చాలా ముఖ్యం, కానీ ఇప్పుడు చదవడం తగ్గిపోతోంది. కలిసి చేసే ఏ పని అయినా ఒంటరిగా చేసేదానికంటే త్వరగా అలవాటు అవుతుంది" అని శాంతను నాయుడు అన్నారు. చాలామంది ఫోన్ల వల్ల పక్కదారి పడుతున్నారని, ఎక్కువసేపు ఏకాగ్రతతో ఉండలేకపోతున్నారని ఆయన అన్నారు.