దారుణం : భార్య మర్మాంగాలను కత్తితో కోసి.. దారుణంగా హత్య చేసిన భర్త...

Published : Jun 06, 2023, 10:37 AM IST

తన అక్క కొడుకుతో భార్య సన్నిహితంగా ఉండడాన్ని చూసి అనుమానించిన భర్త.. ఆమెను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. 

PREV
16
దారుణం : భార్య మర్మాంగాలను కత్తితో కోసి.. దారుణంగా హత్య చేసిన భర్త...

కర్ణాటక : అక్రమ సంబంధం అనుమానంతో ఓ భర్త అత్యంత దారుణంగా భార్యను హతమార్చాడు. ఆమె మర్మాంగాలను కత్తితో కోసి, పారిపోయాడు. ఈ పాశవిక ఘటన కర్ణాటకలోని యశ్వంతపురలో చోటుచేసుకుంది.  భార్య.. తన అక్క కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ భర్త ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. 

26

ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.  బెంగళూరు బసవేశ్వర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజునాథ నగరలో ఈ దారుణం చోటుచేసుకుంది. దీని గురించి డీసీపీ లక్ష్మణ నింబగిరి మాట్లాడుతూ..  నిర్భయ తరహాలోనే భర్తే అతి దారుణంగా భార్య మీద దాడి చేశాడని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు. 

36

అయ్యప్ప, నాగరత్న (32) అనే ఇద్దరు దంపతులు. 12 ఏళ్ల క్రితం వీరికి వివాహమయ్యింది. . వీరికి కుమార్ (11), భూమిక (7) అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నాగరత్న రామనగరంలోని ఓ బట్టల దుకాణంలో పనులు చేస్తుండేది. అయ్యప్ప సిటీ మార్కెట్లో కూలీ పనులకు వెళ్లేవాడు.

46

ఏం జరిగిందో తెలియదు కానీ కొద్ది రోజులుగా అయ్యప్ప.. భార్య నాగరత్నం మీద అనుమానం పెంచుకున్నాడు. నాగరత్న ఎక్కువగా ఫోన్లలో మాట్లాడుతుందని గొడవకు దిగుతుండేవాడు. అయ్యప్ప అక్క కొడుకు చంద్రు. అతను ఓ రోజు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో  చంద్రు, నాగరత్నతో సన్నిహితంగా ఉన్నాడు. ఇది అయ్యప్ప చూశాడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటూ గొడవకు దిగాడు. 

56

ఆ తరువాత చంద్రు మొబైల్ ను అయ్యప్ప లాక్కున్నాడు. దీంతో చంద్రు అక్కడి నుంచి పారిపోయాడు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత అనుమానం పెనుభూతమై అయ్యప్ప రాక్షసుడిలా మారిపోయాడు. నిద్రలో ఉన్న నాగరత్న మీద దాడి చేశాడు. ఆమె మర్మాంగం మీద చాకుతో కిరాతకంగా పొడిచి.. హత్య చేశాడు.  

66

ఆ తర్వాత పారిపోయాడు. దీనికి సంబంధించిన సమాచారం అందడంతో బసవేశ్వర నగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిమీద కేసు నమోదు చేసుకున్నారు. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త అయ్యప్ప మీద కేసు నమోదు చేశారు. అతని కోసం వెతుకుతున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

click me!

Recommended Stories