ప్రశాంత్ కిశోర్ ఎఫెక్ట్: అందుకే వైఎస్ జగన్ తో మోడీ, అమిత్ షాల భేటీ

First Published Feb 15, 2020, 3:33 PM IST

డిల్లీ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటివరకు బిజెపికి ఎదురులేదని అందరూ భావిస్తుండగా ఆప్ విజయం ఆ అభిప్రాయాన్ని మార్చేసింది. దీంతో ప్రాంతీయ పార్టీలు అలెర్ట్ కావడానికంటే ముందే బిజెపి అలెర్ట్ అయ్యింది. భవిష్యత్ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే  పనిలో పడింది. 

న్యూఢిల్లీ: రాబోయే ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం తర్వాత తమ ప్రయత్నాలను వారు ముమ్మరం చేసినట్లు అర్థమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీలు అందులో భాగమేనని అంటున్నారు.
undefined
ఈ నెల 18వ తేదీన బిగ్ అనౌన్స్ మెంట్ చేస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాంతీయ పార్టీల కూటమితో బిజెపికి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన ప్రకటనగా దాన్ని భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ రాజకీయాల్లోకి దించి దాని పునాదిని విస్తరించడం కూడా అందులో భాగంగా ఉంటుందని అంటున్నారు.
undefined
కాంగ్రెసు పార్టీని వెనక్కు నెడుతూ బిజెపికి ప్రత్యామ్నాయంగా ఆప్ ను నిలబెట్టాలనే ప్రశాంత్ కిశోర్ ఆలోచనగా చెబుతున్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు ఓట్ల శాతం గతంలో కన్నా ఎక్కువగా తగ్గాయి. కాంగ్రెసు ఓటు బ్యాంక్ ఆప్ కు మళ్లడం వల్ల అలా జరిగిందని భావిస్తున్నారు. కాంగ్రెసు సీనియర్ నేత వీరప్ప మొయిలీ అదే మాట అన్నారు. బిజెపిని తమ పార్టీ ఎదుర్కోలేదని ప్రజలు భావించి, బిజెపిని ఓడించడానికి తమ పార్టీ ఓటర్లు ఆప్ నకు ఓటేశారని ఆయన చెప్పారు.
undefined
అదే విధమైన పరిస్థితిని ఇతర రాష్ట్రాల్లో కూడా కల్పించాలనేది ప్రశాంత్ కిశోర్ వ్యూహంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెసు పునాదిని పూర్తిగా రూపుమాపుతూ ఆమ్ ఆద్మీ పార్టీని నిలబెట్టడానికి ఆయన భవిష్యత్తులో పనిచేస్తారని అంటున్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట్ల ఆ పార్టీలను కలుపుకుని వచ్చే వ్యూహాన్ని అనుసరిస్తారని అంటున్నారు.
undefined
వచ్చే ఏడాది జరిగే ఎన్నికల కోసం ప్రశాంత్ కిశోర్ తమిళనాడులో డీఎంకె అధినేత డిఎంకె కోసం, పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ కోసం పనిచేయడానికి ఇది వరకే ఆయన ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో దృష్టి కోణం నుంచి చూస్తూ బిజెపికి వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడం ప్రశాంత్ కిశోర్ లక్ష్యమని అంటున్నారు.
undefined
వైఎస్ జగన్ తో ప్రశాంత్ కిశోర్ ఇప్పటికీ పనిచేస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్ని ప్రభుత్వ పెద్దలు మోడీ, అమిత్ షా వైఎస్ జగన్ తో చర్చలు జరిపినట్లు భావిస్తున్నారు. ఎన్డీఎలో చేరాలని జగన్ ను ఆహ్వానించారా, లేదంటే తమకు మద్దతు ఎల్లవేళలా నిలువాలని ఒప్పిస్తారా అనేది తెలియదు. అందుకు జగన్ కూడా సిద్ధపడవచ్చునని అంటున్నారు. రాజకీయ కారణాల రీత్యానే కాకుండా వ్యక్తిగత కారణాల రీత్యా కూడా ఎన్డీఎలో చేరడానికైనా జగన్ సిద్ధపడవచ్చునని అంటున్నారు.
undefined
దేశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన తర్వాత కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. కేంద్రంలో తాము అధికారంలో ఉండే విధంగా మోడీ, అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాలను ఆయా ప్రాంతీయ పార్టీలకు వదిలేస్తూ కేంద్రంలో తమ పట్టు సడలిపోకుండా చూసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
undefined
లోకసభ ఎన్నికల్లో బిజెపికి అండగా నిలిచిన రాష్ట్రాల్లో కూడా ప్రజలు శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి ప్రాంతీయ పార్టీలను గెలిపిస్తున్నారు. ఢిల్లీ పరిణామాన్ని అదే విధంగా చూస్తున్నారు. అయితే, దక్షిణాది రాష్ట్రాలు మాత్రం కొంత వరకు కొరుకుడ పడని కొయ్యగానే మారాయి. తెలంగాణలో తాము ఊరట చెందే విధంగా లోకసభ ఫలితాలు వచ్చినప్పటికీ భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయనేది తెలియలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టంగా బిజెపిపై యుద్ధం ప్రకటించారు.
undefined
ఈ నేపథ్యంలో మోడీ, అమిత్ షా ఆ రాష్ట్రాల శాసనసభలను ఆయా ప్రాంతీయ పార్టీలకు వదిలేస్తూ కేంద్రంలో మాత్రం తమకు మద్దతు ఇచ్చే విధంగా చూసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. లోకసభ ఎన్నికలు కూడా ముందుగానే 2022లోనే రావచ్చునని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారమవుతోంది. ఈ స్థితిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాజకీయాలపై బిజెపి పెద్దలు దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.
undefined
టైమ్స్ నౌ సమ్మిట్ లో పాల్గొన్న తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీ రామారావుతో మాట్లాడినట్లు తెలుస్తోంది. రాబోయే పరిణామాలను ఆయన కేటీఆర్ కు వివరించి తమకు మద్దతుగా నిలువాలని చెప్పినట్లు తెలుస్తోంది. తమపై, తమ పార్టీపై కేసీఆర్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను ఆయన కేటీఆర్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇది సరైంది కాదని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ను కూడా తమతో కలుపుకుని వెళ్లాలని చూస్తున్నట్లు సమాచారం.
undefined
ఇక, తమిళనాడుకు సంబంధించి డిఎంకె అధినేత స్ఠాలిన్ ను కూడా తమతో తీసుకుని వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్టాలిన్ తో ఇప్పటికే మాట్లాడారా, మాట్లాడుతారా అనేది తెలియలేదు. కానీ స్టాలిన్ కు కూడా పరిస్థితిని వివరించి తమతో కలిసి నడవాలని అడిగినట్లు చెబుతున్నారు. దేశ పరిణామాల దృష్ట్యా తమతో కలిసి రాక తప్పదని వారు ప్రాంతీయ పార్టీల నేతలకు చెబుతున్నట్లు తెలుస్తోంది.
undefined
click me!