నిజంగానే ఈ ఇద్దరు సీఎంల హత్యకు కుట్ర జరుగుతోందా..? లేక ఎన్నికల స్టంటా..! 

First Published Apr 19, 2024, 11:45 AM IST

లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలనుండి సానుభూతి పొందేందుకో లేక నిజమో తెలియదుగానీ ఇద్దరు ముఖ్యమంత్రుల హత్యకు కుట్ర జరుగుతోందని ప్రచారం జోరందుకుంది.... ఇంతకూ ఆ ఇద్దరు సీఎంలు ఎవరంటే... 

Lok Sabha Elections

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది... దీంతో ప్రతిచోటా హాట్ హాట్ రాజకీయాలు సాగుతున్నాయి. జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ లతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఎత్తులు పైఎత్తలు, వ్యూహప్రతివ్యూహాలతో ముుందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ముఖ్యమంత్రులపై హత్యాయత్నం జరుగుతోందనే ప్రచారం కలవరపెడుతోంది. అయితే నిజంగానే ఆ సీఎంలను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయా? లేక ఇది ఎన్నికల స్టంటా? అనుమానాలు కలుగుతున్నాయి.  

YS Jagan

ఏపీ  సీఎం వైఎస్ జగన్ : 

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్ సభ ఎన్నికలతో పాటే జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమయ్యింది. ఇలా ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రచారం జోరందుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ 'మేమంతా సిద్దం' పేరిట రాష్ట్రవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఆయనను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న ప్రచారం వైసిపి శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. 

YS Jagan Mohan Reddy

ఇటీవల విజయవాడలో  సీఎం జగన్ బస్సు యాత్రలో వుండగా రాళ్ల దాడి జరిగింది. ఓ రాయి జగన్ ముఖంపై తాకడంతో గాయమయ్యింది. అయితే ఈ దాడి సాధారణంగా జరిగింది కాదని... సీఎంను చంపేందుకే జరిగిందని పోలీసులు తేల్చారు. పదునైన కాంక్రీట్ రాయితో జగన్ తలపై దాడిచేసి చంపాలన్నది నిందితుల కుట్రగా పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఈ దాడినుండి స్వల్ప గాయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయటపడ్డారు. 
 

Jagan

తల భాగం చాలా సున్నితమైనది... ఇక్కడ దాడిచేస్తే వైఎస్ జగన్ చనిపోతాడని నిందితులు భావించారని పోలీసులు తెలిపారు. అందువల్లే తలభాగంలో దాడి చేసినట్లు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొన్నారు పోలీసులు.  పథకం ప్రకారమే సీఎంపై దాడి జరిగిందని... ముందుగానే కాంక్రీట్ రాయిని వెంటతీసుకుని వచ్చి దాడికి పాల్పడ్డారని పోలీసులు కోర్టుకు తెలిపారు. అందువల్లే నిందితుడిపై హత్యాయత్నం కేసు పెట్టినట్లు పోలీసులు కోర్టుకు వివరించారు. 

YS Jagan Mohan Reddy, chandrababu

టిడిపి, వైసిపి, బిజెపి కూటమి సెటైర్లు :  

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన చిన్న దాడిని పట్టుకుని హత్యాయత్నం జరిగిందని అనడం విడ్డూరమని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ ఎన్నికల వేళ సానుభూతి కోసమే వైసిపి ఈ నాటకం ఆడుతోందని అంటున్నారు. చిన్న గులకరాయితో కొడితే చనిపోవడం ఏమిటి? అని అంటున్నారు. అయినా జగన్ పై రాళ్ల దాడి కూడా వైసిపి ఎన్నికల స్టంటేనని అంటున్నారు. కానీ ఎన్ని స్టంట్స్ చేసినా ఈసారి  వైఎస్ జగన్ ను ప్రజలు నమ్మరు... వైసిపి ఓటమి ఖాయమైపోయిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. 

ys jagan

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ పై కోడి కత్తితో జరిగిన దాడి కూడా నాటకమేనని టిడిపి ఆరోపిస్తోంది. అలాగే మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కూడా గత ఎన్నికల కోసమే జరిగిందని అంటున్నారు. ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి కాబట్టే ఈసారి రాళ్ల దాడి, వైఎస్ జగన్ పై హత్యాయత్నం నాటకాలకు తెరతీసారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. 

kejriwal

డిల్లీ సీఎం కేజ్రీవాల్ :  

దేశ రాజధాని న్యూడిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం  ఆమ్ ఆద్మీ పార్టీని చిక్కుల్లోకి నెట్టింది. ఈ కేసును విచారిస్తున్న ఈడీ ఇటీవలే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేసింది. లోక్ సభ ఎన్నికల వేళ జరిగిన ఈ అరెస్ట్ తో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. 

arvind kejriwal

అయితే కేజ్రీవాల్ అరెస్ట్ ను రాజకీయంగా వాడుకోవాలని అనుకుంటున్నారో లేక నిజమో తెలీదుగానీ తీహార్ జైల్లో కేజ్రీవాల్ హత్యకు కుట్రలు జరుగుతున్నాయని ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డయాబటిక్ పేషెంట్ అయిన కేజ్రీవాల్ ను ఇన్సులిన్ ఇవ్వకపోవడం ఇందులో భాగమేనని మంత్రి ఆతిషి ఆరోపించారు. 

KEJRIWAL

గత 30 ఏళ్ళుగా కేజ్రీవాల్ డయాబెటిస్ తో బాధ పడుతున్నాడు... తన షుగర్ స్థాయిని అదుపులో వుంచుకునేందుకు ఆయన ప్రతిరోజే 54 యూనిట్ల్ ఇన్సులిన్ తీసుకుంటారని ఆతిషి తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేయడంతో కోర్టు కూడా ఇంటి ఆహారాన్ని అనుమతించిందన్నారు. కానీ ఈడీ మాత్రం కేజ్రీవాల్ కు ఇంటినుండి వచ్చే ఆహారం అందకుండా చేసి, ఇన్సులిన్ ఇవ్వకుండా ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇలా తీహార్ జైల్లోనే కేజ్రీవాల్ ను చంపేందుకు కుట్రపన్నారని మంత్రి ఆతిషి ఆరోపించారు. 

Kejriwal

ఆతిషి కామెంట్స్ పై బిజెపి సీరియస్ : 

ఈడి సాయంతో బిజెపి డిల్లీ సీఎం కేజ్రీవాల్ ను చంపే కుట్రల చేస్తోందన్న ఆరోపణలపై కమలం పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. కేజ్రీవాల్ అరెస్టుతో బిజెపికి ఎలాంటి సంబంధం లేదని... అతడు తప్పు చేసాడని ఈడీ గుర్తించింది కాబట్టే అరెస్ట్ చేసారన్నారు. అయినా కేజ్రీవాల్ ను చంపాల్సిన అవసరం బిజెపికి ఏముందని అంటున్నారు. లోక్ సభ ఎన్నికల కోసమే ఆప్ నేతలు కేజ్రీవాల్ హత్యాయత్నం నాటకం ఆడుతున్నారని... ఇలా సానుభూతి పొంది ఓట్లు పొందాలన్నది ఆప్ ఆలోచనగా పేర్కొంటున్నారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నాటకాలను డిల్లీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని బిజెపి నాయకులు అంటున్నారు. 

click me!