ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్లినా భారత దేశానికి చెందిన కళలు, సంస్కృతిని ప్రతిబింబించే బహుమతులు వారికి ఇస్తుంటారు. భారత దేశ గొప్పతనాన్ని ఇతర దేశాలకు తెలియజేయడానికి దీని వెనుక ఉన్న రహస్యం. ఈ విధంగా వారికి మన దేశ గొప్పతనం తెలిసేలా అనేక రాష్ట్రాలకు చెందిన ఎన్నో చిత్రాలు, బొమ్మలను వివిధ దేశాల అధినేతలకు గిఫ్టులుగా ఇచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
బ్రెజిల్ అధ్యక్షుడు, కరికాం దేశాల నాయకులకు వార్లీ పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇది మహారాష్ట్రలోని వార్లీ తెగ కళను ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా గయానా ప్రథమ మహిళకు పష్మీనా శాలువా, కరికాం నాయకులకు కాశ్మీరీ కుంకుమపువ్వు బహుమతిగా ఇచ్చారు. గయానా అధ్యక్షుడికి చెక్క రాజసవారి విగ్రహం, ఆయన కుమారుడికి చెక్క బొమ్మ రైలు, ఉపాధ్యక్షుడికి ఫిలిగ్రీ పడవ, నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌కు లడఖీ కేటిల్ బహుమతిగా ఇచ్చారు.