పుష్పరాజ్ లకు పవన్ కల్యాణ్ షాక్ : మోదీ సర్కార్ తో కలిసి పెద్దప్లానే..!!

First Published | Nov 27, 2024, 6:53 PM IST

ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించేందుకు పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ వేసారు. మోదీ సర్కార్ తో కలిసి సరికొత్త యాక్షన్ లోకి దిగింది. 

Pawan Modi

Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేసినా సంచలనమే. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అన్నిస్థానాల్లో విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడం నుండి... డిప్యూటీ సీఎంగా, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖల మంత్రిగా ఏం చేసినా ప్రజల మన్ననలు పొందేలా వుంటున్నాయి. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఆయన ప్రచారంచేసిన అన్నిస్థానాల్లో ఎన్డిఏ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో పవన్ క్రేజ్ దేశం మొత్తానికి పాకింది. 

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర పెద్దలు పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా డిల్లీకి పిలిపించుకున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసారు పవన్. ఇదే అదునుగా ఏపీకి లబ్ది చేకూర్చే పలు ప్రతిపాదనలను పవన్ కేంద్రం ముందు వుంచారు పవన్. ఇందులో ఎర్రచందనం స్మగ్లింగ్ ను కట్టడిచేసే ఓ ప్రతిపాదనను కూడా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ముందుంచారు. ఇలా పుష్పరాజ్ ల ఆటకట్టించేందుకు సిద్దమయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం. 
 

Pawan Kalyan

ఎర్రచందనం ఎక్కడున్న ఏపీ సొంతమయ్యేలా పవన్ ప్లాన్ 

ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని పవన్ కల్యాణ్ కేంద్ర అటవీ శాఖ మంత్రిని కోరారు. ఇలా చేయడంద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ –వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని  వివరించారు. ఇలా ఎర్రచందనంపై ఏపీకి పూర్తి ఆధిపత్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రిని కోరారు పవన్. 
 
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశమయ్యారు. ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాల మీద కేంద్ర మంత్రితో చర్చించారు.
 
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రతిపాదించిన ప్రకారం ఎర్రచందనం అమ్మకం, ఎగుమతి చేసే విషయంలో సింగిల్ విండో విధానం ఉంటే మేలు జరుగుతుందని పవన్ అన్నారు. ఈ విధానానికి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కస్టోడియన్ గా వ్యవహరిస్తుందని... ఈ ప్రతిపాదననను పరిశీలించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడింగ్, వేలం, ఎగుమతి సాగిస్తుందని... తద్వారా ఈ-వేలం ద్వారా రెవెన్యూ పెరుగుతుందని కేంద్ర మంత్రికి తెలిపారు పవన్.

ఎర్రచందనం అరుదైన వృక్ష సంపద... ఆంధ్ర ప్రదేశ్ అటవీ ప్రాంతంలోనే ఇది పెరుగుతుందని పవన్ అన్నారు. కాబట్టి కేంద్రం నిబంధనలను సవరించి ఏపీ వెలుపల పట్టుబడిన ఎర్రచందనంను సైతం సింగిల్ విండో విధానంలో కస్టోడియన్ గా ఉండే తమ రాష్ట్రానికే దక్కేలా చూడాలని కోరారు దీనివల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పట్టుబడిన ఎర్రచందనం అమ్ముకోవడానికి కుదరదు... తద్వారా అమ్మకాలు, ఎగుమతులు ఒకే విధానం ద్వారా కొనసాగుతాయన్నారు. కేంద్ర పర్యవేక్షణతో ఏపీ ప్రభుత్వం కస్టోడియన్ గా కొనసాగుతుందని పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కు వివరించారు.
 


Pawan Kalyan

డిల్లీలోనూ పవన్ క్రేజ్ : 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పవన్ క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో మరింత పాకిపోయింది. ఇక తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత పవన్ పాన్ ఇండియా పొలిటీషన్ గా మారిపోయారు. ప్రస్తుతం ఉత్తరాదిన బలంగా వున్న బిజెపిని దక్షిణాదిలో బలహీనంగా వుంది... ఇందుకు ప్రధాన కారణం దక్షిణాదిన బిజెపికి బలమైన నాయకుడు లేకపోవడం. అయితే పవన్ కల్యాణ్ తో ఆ లోటును పూడ్చుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసమే పవన్ ను ప్రమోట్ చేసే పనిలో బిజెపి వుందట. 

పవన్ ను దక్షిణాదిలో కీలక నాయకుడిగా తీర్చిదిద్దేపనిలో బిజెపి వుంది. అందులో భాగంగానే డిల్లీ స్థాయిలో ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఆయన క్రేజ్ మరింత పెరిగేలా చూస్తున్నారు.ఇందులో భాగంగానే డిల్లీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్డిఏ పక్షాలకు బిజెపి ఎంపీలకు పవన్ విందు ఇస్తున్నారు. ఇలా పవన్ ను దక్షిణాదిన స్ట్రాంగ్ నాయకుడిగా తయారుచేస్తోంది బిజెపి. 

Latest Videos

click me!