No language will be imposed on any State: Centre tells RS Dr Sukanta Majumdar in telugu rma
ముఖ్యంగా, తాము చదువుతున్న మూడు భాషలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలను మార్చుకోవాలనుకునే విద్యార్థులు 6 లేదా 7వ తరగతిలో అలా చేయవచ్చని, మాధ్యమిక పాఠశాల ముగిసే సమయానికి మూడు భాషలలో (సాహిత్య స్థాయిలో భారతదేశంలోని ఒక భాషతో సహా) ప్రాథమిక నైపుణ్యాన్ని ప్రదర్శించగలిగితేనే అలా చేయవచ్చని మంత్రి అన్నారు.
మూడు భాషలలో కనీసం రెండు భారతదేశానికి చెందినవి అయితే, NEP 2020 విద్యార్థులు తాము చదవాలనుకునే భాషను ఎంచుకోవడానికి అనుమతిస్తుందని చెప్పారు. మంత్రి NEP-2020, పేరా-4.12 ను ఉటంకిస్తూ.. “ పిల్లలు 2 - 8 సంవత్సరాల మధ్య చాలా త్వరగా భాషలను నేర్చుకుంటారనీ, బహుభాషావాదం యువ విద్యార్థులకు గొప్ప అభిజ్ఞా ప్రయోజనాలను కలిగి ఉందని పరిశోధనలు స్పష్టంగా చెబుతున్నాయని అన్నారు.
అన్ని భాషలు ఆనందదాయకంగా, ఇంటరాక్టివ్ శైలిలో బోధించబడతాయి, పుష్కలంగా సంభాషణలు ఉంటాయి. ప్రారంభ సంవత్సరాల్లో మాతృభాషలో ప్రారంభ పఠనం, తరువాత రాయడం జరుగుతుంది. గ్రేడ్ 3 తర్వాత ఇతర భాషలలో చదవడం, రాయడం బోధిస్తారు. "వివిధ భాషలను బోధించడానికి, నేర్చుకోవడానికి, దానిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించడం జరుగుతుంది" అని మంత్రి అన్నారు.
NEP-2020 విధానం మాతృభాషలో అధిక-నాణ్యత గల పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచడం, బోధించేటప్పుడు ఉపాధ్యాయులు ద్విభాషా విధానాన్ని ఉపయోగించమని ప్రోత్సహించడం వంటి అంశాలను కూడా కల్పిస్తుందని మజుందార్ అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, ప్రభుత్వం పాఠశాల, ఉన్నత విద్య స్థాయిలలో బహుభాషావాదాన్ని ఏకీకృతం చేస్తోంది, భారతీయ భాషలలో పఠన సామగ్రిని అందిస్తోంది, తద్వారా విద్యార్థులు తమ మాతృభాష/స్థానిక భాషలో చదువుకునే అవకాశం ఉంటుందన్నారు.