జనవరి ఎందుకంత ప్రత్యేకం :
ఆరంభమే బాగుంటే ఆ ఏడాదంతా బాగుంటుందని చాలామంది నమ్ముతారు... అందువల్లే జనవరి నెలను చాలా ప్రత్యేకంగా భావిస్తారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను మంచి జోష్ తో జరుపుకుని మిగతా రోజులు కూడా ఇలాగే వుండాలని కోరుకుంటారు. ఇక కొత్త సంవత్సరంలోకి ఎన్నో ఆశలతో అడుగుపెడుతుంటారు... వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించేది జనవరిలోనే.
ఇక కొత్త సంవత్సరంలో కొత్త పనులు చేయాలని నిశ్చయించుకునేవారు చాలామందే వుంటారు. కొందరు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జిమ్ , యోగా, వాకింగ్ వంటివి చేయడం, ఆహార అలవాట్లను మార్చుకోవడం చేస్తుంటారు. మరికొందరు కెరీర్ గురించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా న్యూ ఇయర్ లో తమ జీవితాన్ని మరింత మెరుగ్గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు.
అయితే ఈ న్యూ ఇయర్ కొద్దిగా భారంగా ఆరంభం అవుతోంది ... కానీ ఈ ఇయర్ మొత్తం ఇలాగే వుండకుండా వుంటే బాగుంటుంది. హాయిగా, ఆనందంగా గడిచిపోవాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ న్యూ ఇయర్ ఆనందాన్ని పంచాలని కోరుకుందాం.