మహాత్మా గాంధీ ఆశ్రమం అప్పుడు.. ఇప్పుడు!

First Published | Mar 12, 2024, 3:07 PM IST

మహాత్మా గాంధీ ఆశ్రమాన్ని పునర్నిర్మించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా ఆ ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంలోనే ఆ ఆశ్రమ పాత చిత్రాలు, కొత్త చిత్రాలు వైరల్ అవుతున్నాయి.
 

mahatma gandhi sabarmati ashram

మహాత్మా గాంధీ బోధనలు ఇప్పటికీ ప్రాసంగికతను కలిగి ఉన్నాయి. ఆయన జీవితమే ఒక సందేశం అని చాలా మంది భావిస్తారు. ఆయన బోధనలకు ప్రపంచవ్యాప్త ఆదరణ ఉన్నది. అందుకే ఇతర దేశాల నాయకులు వచ్చినప్పుడు సమయం చూసుకుని గాంధీ ఆశ్రమాన్ని సందర్శిస్తుంటారు.

mahatma gandhi sabarmati ashram

మన దేశంలో తొలి ఆశ్రమం అది. 1915లో మహాత్ముడు దాన్ని స్థాపించారు. దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ ఆశ్రమాన్ని వ్యవస్థాపించారు.

Latest Videos


mahatma gandhi sabarmati ashram

వందేళ్లకు పైగా గడిచిపోయాయి. ఆ ఆశ్రమం కూడా రాను రాను పేలవంగా మారుతున్నది. అందుకే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కొచరాబ్ ఆశ్రమాన్ని పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. 

mahatma gandhi sabarmati ashram

సత్యాగ్రహ ఆశ్రమంగా కూడా పిలుచుకునే ఈ ఆశ్రమ పునర్నిర్మాణం వేగంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఈ సత్యాగ్రహ ఆశ్రమాన్నే సబర్మతి ఆశ్రమంగానూ సంబోధిస్తుంటారు.

mahatma gandhi sabarmati ashram

ఈ సబర్మతి ఆశ్రమం గుజరాత్ విద్యాపీఠ్ నిర్వహణలో ఉన్నది. మహాత్మా గాంధీకి స్మారకంగానూ, ఒక పర్యాటక కేంద్రంగానూ సబర్మతి ఆశ్రమం విలసిల్లుతున్నది.

mahatma gandhi sabarmati ashram

ఈ ఆశ్రమాన్ని ప్రారంభిస్తూ గాంధీ ఆశ్రమ్ మెమోరియల్ మాస్టర్ ప్లాన్‌ను ప్రకటించారు. ఆశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశ్రమంలో ఓ మొక్కను నాటారు. 

mahatma gandhi sabarmati ashram

మహాత్మా గాంధీ బోధనలు, ఆదర్శాలను నిలబెట్టడానికి తాను సంకల్పించినట్టు మోడీ అన్నారు. భావి తరాలకు కూడా ఆయన బోధనలు అందాలని, ఆ నాయకుడిని మరింత చేరువ చేసే మార్గాలను తాము అన్వేషిస్తున్నామని, అలాంటి వేదికలను తాము బలోపేతం చేస్తామని వివరించారు.

mahatma gandhi sabarmati ashram

ఈ సందర్భంగానే సబర్మతి ఆశ్రమ చిత్రాలు బయటికి వచ్చాయి. గత చిత్రాలు.. ఇప్పుడు పునర్నిర్మాణం జరిగిన తర్వాత ఆ ఆశ్రమ చిత్రాలు వైరల్ అవుతున్నాయి.

click me!