Mk2 యుద్దవిమానం ప్రత్యేకతలివే :
భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) తేలికపాటి యుద్ధ విమానం (LCA) Mk2 నమూనాను 2025 చివరి నాటికి ఆవిష్కరిస్తుంది. ఇది చాలా బాగా పనిచేస్తుందని నమ్ముతున్నామని...2028-29 నుండి వైమానిక దళానికి అందుబాటులో వుంటుందని నమ్ముతున్నామని ఏడిఏ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు.
ఇది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందుతున్న యుద్దవిమానమని జితేంద్ర జాదవ్ తెలిపారు. ఈ Mk2 భారత వైమానిక దళాన్ని మరింత శక్తివంతంగా మారుస్తుంది... శతృవుల్లో భయాన్ని రేకెత్తిస్తుందని ఏడిఏ డిజి తెలిపారు.
2026-27లో ఆవిష్కరించబడుతుందని భావిస్తున్న అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA), ఈ LCA Mk2 సారుప్యతలు వున్నాయన్నారు. రెండింటిలో ఏవియానిక్స్ మరియు సెన్సార్‌లు కొన్ని అప్‌గ్రేడ్‌లను పొందుతున్నాయని ఆయన తెలిపారు. భారత వైమానిక దళం యొక్క ఆధునీకరణ ప్రణాళికలకు LCA Mk2 కీలకం కానుందని ఏడిఏ పేర్కొన్నారు..
ముందుగా, LCA Mk2 యొక్క మొదటి నమూనా 2023లో ఆవిష్కరించబడుతుందని భావించామని... కానీ ఇప్పుడు అది 2026-27కి వాయిదా పడిందన్నారు. ప్రణాళిక ప్రకారం LCA Mk2 రష్యాకు చెందిన MiG-21 (బైసన్), MiG-26 మరియు జాగ్వార్ యుద్ధ విమానాల స్థానాన్ని భర్తీ చేస్తుందని ఏడిఏ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు.
LCA Mk2 యుద్దవిమానం 6.5 టన్నుల ఆయుధాలను మోసుకెళ్లగలదు... 11 హార్డ్ పాయింట్‌లను కలిగి ఉంటుంది. అయితే Mk1 ఏడు హార్డ్ పాయింట్‌లను కలిగి ఉంది. Mk1 2,450 కిలోల (లీటర్) అంతర్గత ఇంధనాన్ని మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది, అయితే ఇది (Mk2) 3,320 కిలోలను కలిగి ఉంది. దీని పరిధి 3000 కి.మీ ల వరకు వుంటుందని ఏడిఏ డైరెక్టర్ జనరల్ జితేంద్ర జాదవ్ తెలిపారు.
రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) తేలికపాటి యుద్ధ విమానం (LCA) Mk2 నమూనాను 2025 చివరి నాటికి ఆవిష్కరిస్తుంది... తొలి విమానం 2026 నాటికి అందుబాటులోకి వస్తుందని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) డైరెక్టర్ జనరల్ జితేంద్ర జె. జాదవ్ తెలిపారు. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?