ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్? : కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఆలోచన 

First Published | Nov 12, 2024, 11:30 AM IST

కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి సిద్దమైనట్లు సమాచారం. ముస్లింలకు ప్రభుత్వ పనుల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచనలో సిద్దరామయ్య సర్కార్ వున్నట్లు తెలుస్తోంది. 

Siddaramaiah

బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సిద్దరామయ్య ప్రభుత్వం ముస్లిం, మైనారిటీలకు అనూకూలంగా వ్యవహరిస్తోంది... హిందువులను అణచి వేస్తోందని బిజెపి ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్మాణ కాంట్రాక్టుల్లో ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే దిశగా సిద్దరామయ్య సర్కార్ ఆలోచిస్తోందట. కోటి రూపాయలలోపు సివిల్ కాంట్రాక్ట్స్ లో ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

సిద్దరామయ్య ప్రభుత్వం సివిల్ కాంట్రాక్టుల్లో ముస్లింల కోటా ప్రతిపాదనకు పచ్చజెండా ఊపితే టెండర్ల రిజర్వేషన్లలో మార్పులు రానున్నారు. ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్ల వాటా 47 శాతానికి చేరనుంది.   
 

siddaramaiah

ప్రస్తుత రిజర్వేషన్ ఎలా వున్నాయంటే... 

ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వ సివిల్ కాంట్రాక్ట్ పనుల్లో రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఎస్సి, ఎస్టీలు (24 శాతం), ఓబిసిలకు కేటగిరి -1 (4 శాతం), కేటగిరి 2A (15 శాతం)రిజర్వేషన్లు వున్నాయి.ఇలా వీరికి మొత్తంగా 43 శాతం రిజర్వేషన్లు వున్నాయి. 

అయితే ఇప్పుడు ముస్లింలకు కూడా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ డిమాండ్ వినిపిస్తోంది. దీంతో కేటగిరి 2B లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చే ఆలోచనలో సిద్దరామయ్య వుందట. అధికారికంగా ఇంకా నిర్ణయం తీసుకోకున్నా వారికి 4 శాతం రిజర్వేషన్ కేటాయించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. దీంతో కోటి రూపాయల లోపు ప్రభుత్వ సివిల్ కాట్రాక్టుల్లో రిజర్వేషన్లు 47 శాతానికి చేరుకోనున్నాయి.  
 


Karnataka

కర్ణాటకలో ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్లు : 

ఎస్సి, ఎస్టి, ఓబిసి వర్గాలకు ఆర్థికంగా,సామాజికంగా ఆండగా నిలిచేందుకు సిద్దరామయ్య సర్కార్ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ విధానాన్ని తీసుకువచ్చింది. మొదట ఎస్సి, ఎస్టీలకు ఆ తర్వాత ఓబిసిలకు రిజర్వేషన్ కేటాయించారు.

కేటగిరి -1 లో బెస్త, ఉప్పర, దళిత క్రిస్టియన్స్ వంటి 95 కులాలు వస్తాయి. ఇక కేటగిరి -2A కింద కురబ (సీఎం సిద్దరామయ్య కులం), ఇడిగలు వంటి 100 కులాలు వస్తాయి. ఈ కులాల వారికి ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ వుంటుంది. 

అయితే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ల పెంపుపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి మొదలయ్యింది. ముఖ్యంగా లింగాయత్, వొక్కలింగ వర్గాలకు చెందిన కాంట్రాక్టర్లు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని విరమింపజేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలంటూ కర్ణాటక స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. 
 

Siddaramaiah

ఎస్సి,ఎస్టి కాంట్రాక్టర్ల కొత్త డిమాండ్ 

ఇప్పటికే ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ల వ్యవహారంపై వ్యతిరేకత మొదలయ్యింది. ఈ క్రమంలో ఎస్సి, ఎస్టి కాంట్రాక్టర్లు మరో డిమాండ్ ను సిద్దరామయ్య ప్రభుత్వం ముందుంచారు. ప్రస్తుతం కోటి రూపాయల లోపు వున్న కాంట్రాక్టులకే రిజర్వేషన్ వర్తిస్తుంది...దీన్ని రెండు కోట్లకు పెంచాలనే డిమాండ్ చేస్తున్నారు. 

ఈ డిమాండ్ పై కూడా సిద్దరామయ్య సర్కార్ సానుకూలంగా వున్నట్లు సమాచారం. దీనిపై సోషల్ వెల్ఫేర్ ఆండ్ పబ్లిక్ వర్క్ విభాగం కసరత్తు కూడా చేస్తోందట. దీనిపై ప్రభుత్వ ప్రకటనే మిగిలివున్నట్లు తెలుస్తోంది. 

siddaramaiah

ముస్లిం రిజర్వేషన్లపై కర్ణాటక సర్కార్ క్లారిటి : 

ముస్లిం సామాజిక వర్గాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ వస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పనిలో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఉందనే వార్తల్లో నిజం లేదని ప్రకటించారు. రిజర్వేషన్ల డిమాండ్‌ వచ్చిన మాట వాస్తవమే... కానీ దీనికి సంబంధించి ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు.  

ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు లీజులో రిజర్వేషన్లు కల్పించింది. మొత్తం ప్రభుత్వ పనుల్లో 43% రిజర్వ్ చేయబడింది. ఇప్పుడు ముస్లిం సమాజం కూడా ప్రభుత్వ పనుల్లో కొంత శాతాన్ని కోరుతున్నారు. 4 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన సమర్పించారు.ఈ మేరకు సీఎం సిద్ధరామయ్యకు ముస్లిం సంఘాల మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించినట్లు సమాచారం. 

మంత్రులు జమీర్ అహ్మద్ ఖాన్, రహీమ్ ఖాన్, సీఎం పొలిటికల్ సెక్రటరీ నజీర్ అహ్మద్, విధాన పరిషత్ చీఫ్ విప్ సలీం అహ్మద్, ఎమ్మెల్యేలు తన్వీర్ సేఠ్, అబ్దుల్ జబ్బార్, ఎన్ఏ హారీస్, రిజ్వాన్ అర్షద్, ఆసిఫ్ సేథ్, ఖనేజా ఫాతిమా, ఇక్బాల్ హుస్సేన్, బల్కీష్ బాను దీనిపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. అయితే రిజర్వేషన్ల ప్రతిపాదన ప్రభుత్వం ముందు లేదని సిద్దరామయ్య సర్కార్ స్పష్టం చేసింది.

Latest Videos

click me!